నిజామాబాద్ మార్కెట్‌ యార్డులో విషాదం | farmer died with heart attack in nizamabad market yard | Sakshi
Sakshi News home page

నిజామాబాద్ మార్కెట్‌ యార్డులో విషాదం

Published Wed, May 3 2017 10:54 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

నిజామాబాద్ మార్కెట్‌ యార్డులో విషాదం - Sakshi

నిజామాబాద్ మార్కెట్‌ యార్డులో విషాదం

నిజామాబాద్‌: నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డులో బుధవారం ఉదయం విషాదం చోటచేసుకుంది. చిన‍్న గంగారామ్‌ అనే పసుపు రైతు గుండెపోటుతో మృతిచెందాడు. మంగళవారం మార్కెట్‌ యార్డుకు పసుపు తెచ్చిన రైతు రాత్రి అక‍్కడే నిద్రపోయాడు. అయితే ఉదయం లేచిన కాసేపటికే గంగారామ్‌ గుండెపోటు రావడంతో మార్కెట్‌ యార్డులోనే కుప‍్పకూలిపోయాడు.

గమనించిన తోటి రైతులు గంగారామ్‌ను కాపాడే ప్రయత‍్నం చేసినా ఉపయోగం లేకపోయింది. కొద్ది సమయంలోనే అతడు మృతిచెందాడని తోటి రైతులు చెబుతున్నారు. మృతిచెందిన రైతు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఎద‍్దండి గ్రామానికి చెందిన వ‍్యక్తిగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement