జోగిపేట (మెదక్) : మెదక్ జిల్లా జోగిపేటలో శుక్రవారం వర్షం కురిసింది. దీంతో స్థానిక వ్యవసాయ మార్కెట్ ఆవరణలో రైతులు ఆరబెట్టుకున్న 200 క్వింటాళ్ల ధాన్యం తడిచిపోయింది. మూడు రోజులుగా కేంద్రం నిర్వాహకులను గన్నీ బ్యాగులు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదని, దీంతో అకాలవర్షానికి ధాన్యం తడిచిపోయిందని రైతులు తెలిపారు. అలాగే రాయికోడ్, అల్లాదుర్గం మండలాల్లో కూడా కొద్దిపాటి వర్షం కురిసింది.