నిజామాబాద్ నాగారం న్యూస్‌లైన్ : మే.. ప్రతాపం చూపుతోంది. మొన్నటి వరకు వాతావరణం చల్లగా ఉండడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. హమ్మ య్య ఈసారి వేసవి కాలం అంతగా లేదనుకున్నారు. అయితే ఈ నెలలో ఒక్క సారిగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఉదయం ఎనిమిది గంటలకే వేడెక్కుతోంది. 9 గం టలకు భానుడు మండిపోతున్నాడు. 10 గం టల సమయంలోనైతే జనం రోడ్లమీదకు రావాలంటే జంకుతున్నారు. ఎండ వేడిమి తో పాటు వడగాల్పులు వీస్తున్నాయి.
వారం క్రితం వరకు ఉష్ణోగ్రతలు అంతగా లేవు. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల అకాల వర్షాలు కురిశాయి. చల్లగానే ఉందనుకున్న సయమంలో వేసవి తీవ్రత పెరిగింది.వారం క్రితం 36 డిగ్రీలు ఉన్న గరిష్ట ఉష్టోగ్రత 43 డిగ్రీలకు పెరిగింది. మధ్యాహ్నం వేళ రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రజలు ఉదయం పూటనే పనులు పూర్తిచేసుకుని ఇళ్లకు చేరుకుంటున్నారు. మళ్లీ సాయంత్రం ఏడు గంటలకు గానీ బయటకు రావ డం లేదు.
జిల్లాలో వారం రోజులుగా ఉష్ణోగ్రతలు ఇలా..
తేది గరిష్ట ఉష్ణోగ్రతలు డిగ్రీల్లో
17న 36.5
18న 36.3
19న 43.0
20న 42.0
21న 42.0
22న 42.0
23న 42.5
24న 43.4