హైదరాబాద్: అకాల వర్షాలకు రాష్ట్రంలో 9 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ప్రకాశం జిల్లా నలుగురు, మహబూబ్‌నగర్‌లో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, వరంగల్ జిల్లాలో ఒకరి మృతి చెందారు. 9,988 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 35, 910 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం సంభవించింది.
రాష్ట్రవ్యాప్తంగా 10 వేల హెక్టార్లలో వరి పంటకు నష్టం జరిగిందని అంచనా. వరంగల్ జిల్లాలో 3, 491 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లింది. ఖమ్మంలో 36 పశువులు మృతి చెందాయి. వర్షాలకు మహబూబ్‌నగర్‌లో 8 ఇళ్లు నేలకూలాయి. ఖమ్మం జిల్లా కూనవరంలో అత్యధికంగా 208 మీల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అశ్వరావుపేటలో 186 మీ.మీటర్ల వర్షపాతం నమోదయింది.
అకాలవర్షాలకు 9 మంది మృతి
Published Sat, May 10 2014 8:19 PM | Last Updated on Sat, Sep 2 2017 7:11 AM
Advertisement
Advertisement