అచ్చంపేట : అకాల వర్షాలతో రైతన్న విలవిల్లాడుతున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట రూరల్‌లో శుక్రవారం కురిసిన వర్షాలకు మార్కెట్ యార్డులో ఉన్న వేరుశనగ పంట తడిసిపోయింది. దీంతో రైతులు మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ మార్కెట్ యార్డులో ఆందోళనకు దిగారు. విషయం తెలిసిన స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మార్కెట్ అధికారులతో తడిసిన ధాన్యం కొనుగోలు గురించి చర్చించారు.
అకాల వర్షాలతో రైతన్న విలవిల
Published Fri, Apr 10 2015 4:42 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement