దేశవ్యాప్తంగా గోధుమలపై దిగుమతి సుంకాన్ని కేంద్రం రద్దు చేసింది.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గోధుమ దిగుబడి ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కేంద్రం గోధుమలపై దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది. దేశీయ లభ్యతను పెంచి ధరలను అదుపులో ఉంచేందుకే గోధుమలపై 10 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
ఈ అంశం లోక్‌సభలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పరిశీలనలోకి వచ్చింది. గోధుమలపై దిగుమతి సుంకాన్ని నిరవధికంగా రద్దు చేస్తున్నామని, తక్షణం ఇది అమల్లోకి వస్తుందని జైట్లీ ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో సభ వెలుపల నిర్ణయం తీసుకోవడమేంటని ప్రధాని మోదీపై విపక్షాలు విరుచుకుపడ్డాయి.