గోధుమ ఊక.. కొబ్బరి పాలు..
బ్యూటిప్స్
అర కప్పు గోధుమ ఊకలో టేబుల్ స్పూన్ తేనె, టేబుల్ స్పూన్ కొబ్బరి పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి, వేళ్లతో సున్నితంగా, వలయాకారంగా ఐదు నిముషాల సేపు రుద్దుతూ ఉండాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల మలినాలు తొలగి, చర్మం కాంతిమంతంగా తయారవుతుంది.
కప్పు కొబ్బరి నూనెలో టీ స్పూన్ బియ్యం, టీ స్పూన్ మిరియాలు కలిపి, వేడి చేయాలి. బియ్యం గోధుమవర్ణంలోకి వచ్చేంత వరకు వేడి చేసి, చల్లార్చి బాటిల్‌లో భద్రపరుచుకోవాలి. కొద్దిగా వేడి చేసి, ఈ నూనెతో తలకు మసాజ్ చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ నూనెను వాడుతుంటే వెంట్రుకలు రాలడం, చుండ్రు సమస్యలు తగ్గుతాయి.