బ్యూటిప్స్
రెండు చెంచాల ఉసిరి రసంలో రెండు చెంచాల నిమ్మరసాన్ని కలిపి మాడుకు మర్దనా చేసి... ఓ గంట తర్వాత తలంటుకోవాలి. అప్పుడప్పుడూ ఇలా చేస్తుంటే జుత్తు బలంగా అవుతుంది. రాలడం ఆగుతుంది.ఉల్లిపాయను మెత్తగా దంచి, రసం తీయాలి. దీన్ని మాడుకు పట్టించి తలకు బట్ట చుట్టేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలంచుకోవాలి. వారానికోసారైనా ఇలా చేస్తే జుత్తు రాలడం తగ్గుతుంది. ఒకటిన్నర కప్పు బంగాళాదుంప రసంలో... చెంచాడు తేనె, కొంచెం నీళ్లు, గుడ్డు తెల్లసొన కలిపి మాడుకు, జుత్తుకు పట్టించాలి. అరగంట తర్వాత కుంకుడురసంతో కానీ షీకాయ పొడితో కానీ తలంటుకోవాలి. వారానికి ఒక్కసారైనా ఇలా చేస్తే... జుత్తు రాలడం, చుండ్రు లాంటి సమస్యలు దరి చేరవు. పైగా కుదుళ్లు బలపడి జుత్తు ఒత్తుగా పెరుగుతుంది.
నువ్వుల నూనె, బాదం నూనె, కొబ్బరి నూనె సమపాళ్లలో తీసుకుని, కొద్దిగా వేడి చేసి తలకు, జుత్తుకు పట్టించాలి. పది నిమిషాల తర్వాత తలంటుకోవాలి. వారినికి రెండు మూడు సార్లు ఇలా చేసినా ఫర్వాలేదు. జుత్తు రాలడాన్ని అరికట్టడానికి, జుత్తు పట్టులా మెరవడానికి ఇది మంచి చిట్కా