బ్యూటిప్స్
జుట్టు నల్లగా నిగనిగలాడాలంటే గోరువెచ్చని ఆలివ్ ఆయిల్‌తో మర్దన చేయాలి. క్రమం తప్పకుండా వారానికి రెండు సార్లు చొప్పున చేస్తుంటే ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనెతో కూడా ఇలాగే మర్దన చేసుకోవచ్చు. మరీ పొడిబారి నిర్జీవంగా ఉంటే ఆలివ్ ఆయిల్ వాడితే త్వరగా ఫలితం ఉంటుంది. భృంగరాజ్, మహా భృంగరాజ్ నూనెలతో మర్దన చేస్తే కేశాలు నల్లగా మెరుస్తాయి.
జుట్టు రాగి రంగులో ఉండే వాళ్లు దీనిని ప్రయత్నించవచ్చు. ఈ నూనెలు ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి. చుండ్రుతో బాధపడుతుంటే కరక్కాయ పొడిలో మామిడి టెంకలోని జీడిని పొడి వేసి తగినంత నీటితో పేస్టులా కలుపుకుని జుట్టుకు పట్టించాలి. కరక్కా య, మామిడి జీడి తాజావి దొరికితే రెండింటినీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకుని వాడితే పొడి కంటే బాగా పని చేస్తాయి.