న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గోధుమల ధరలు పెరగడంతో దరల్ని కట్టేడి చేసే దిశగా కేంద్రప్రభుత్వం మే 13 నుంచి గోధుమ ఎగుమతులను నిషేధించింది. ఐతే ఆ నిషేధం ఇంకా అమలులోకి రాక మునుపే కస్టమ్స్ అథారిటీ వద్ద నమోదు చేసుకున్న గోధుమ సరుకుల రవాణాను అనుమతించాలని నిర్ణయించినట్లు కేంద్రం పేర్కొంది.
కస్టమ్స్ పరీక్షల కోసం అప్పగించిన గోధుమ సరుకులు మే13 లోపు రిజర్వ్ చేయబడి ఉంటే అటువంటి సరుకులు ఎగుమతి చేయడానికి అనుమతించనున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేగాక ఈజిప్టు ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఈజిప్టుకు వెళ్లే గోధుమ సరుకును కూడా కేంద్రం అనుమతించిందని తెలిపింది.
దేశంలోని మొత్తం ఆహార భద్రతను నిర్వహించడానికే కాకుండా పోరుగు దేశాలకు, ఇతర బలహీన దేశాల అవసరాలకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) పేర్కొంది. అలాగే ఇతర దేశాల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ప్రభుత్వం ఈ ఎగుమతులను అనుమతిస్తున్నట్లు కూడా తెలిపింది.
(చదవండి: మూతపడ్డ 22 గదుల ఫోటోలు విడుదల)
Comments
Please login to add a commentAdd a comment