Commerce Ministry
-
వర్క్ ఫ్రమ్ హోంపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు
వర్క్ ఫ్రం హోంపై కేంద్ర వాణిజ్య శాఖ కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది. స్పెషల్ ఎకనమిక్ జోన్స్(సెజ్)లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఏడాది పాటు వర్క్ ఫ్రం హోం చేసుకునే అవకాశాన్ని కల్పించ్చింది. మొత్తం ఉద్యోగుల్లో గరిష్టంగా 50 శాతం మందికి ఈ అవకాశం కల్పిచ్చింది. ఏడాది పూర్తయినా సరే కొన్ని సందర్భాలలో ఉద్యోగులకు మరో ఏడాది పాటు వర్క్ ఫ్రం హోం కొనసాగించే వెసులు బాటు కల్పిచ్చింది. 50 శాతానికి మించి ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పనిచేయాలంటే..సంబంధిత కారణాల్ని వ్రాతపూర్వకంగా వివరిస్తూ సెజ్‌ల డెవలప్మెంట్ కమిషనర్ (డీసీ) అనుమతి తీసుకోవాలని పేర్కొంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు సైతం ఈ కొత్త పని దినాలు కేంద్రం తెలిపింది. . స్పెషల్ ఎకనామిక్స్ జోన్స్ రూల్స్-2006 ప్రకారం..కేంద్రం విడుదల చేసిన విడుదల చేసిన ఈ కొత్త మార్గదర్శకాలతో ఫ్లెక్సిబులిటీ కోరుకునే ఉద్యోగుల్ని ఆకట్టుకునేందుకు దోహదం చేస్తుందని భావిస్తోంది. ఇక ఈ కొత్త పనిదినాలు సెజ్ ఉద్యోగులతో పాటు ఐటీ/ఐటీఈఎస్ రంగాల్లో విధులు నిర్వహించే వారికి సైతం ఈ కొత్త పని విధానం వర్తిస్తుంది. అంటే కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించలేని ఉద్యోగులకు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లి పనిచేసే వారికి, ఆఫ్‌సైట్‌లో వర్క్ చేస్తున్న ఉద్యోగులకు ఇంటి వద్ద నుంచి పని చేసుకోవచ్చు. కాగా, ఇప్పటికే వర్క్ ఫ్రం హోం చేస్తున్న సెజ్ యూనిట్లకు సంబంధించిన ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు అమలు చేసేందుకు 90 రోజుల సమయం ఇచ్చింది. -
స్టార్టప్ ర్యాంకులు: కమింగ్ సూన్
సాక్షి, న్యూఢిల్లీ: స్టార్టప్ వ్యవస్థకు దన్నుగా నిబంధనల వాతావరణాన్ని సులభతరం చేసే బాటలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ర్యాంకింగ్స్ విడుదల చేయనుంది. ఈ ఏడాది 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం స్టార్టప్ ఎకో సిస్టమ్‌లో రాష్ట్రాలవారీగా సోమవారం(4న) ర్యాంకులను ప్రకటించ నుంది. ఇది మూడో ఎడిషన్ కాగా.. అంతక్రితం 2020 సెప్టెంబర్‌లో ర్యాంకులను ప్రకటించింది. గుజరాత్ టాప్ ర్యాంకులో నిలిచిన సంగతి తెలిసిందే. వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్.. స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు అండగా నిలిచిన రాష్ట్రాలు, ప్రాంతాలవారీగా ర్యాంకులను విడుదల చేయనున్నారు. పోటీ, సహకార సమాఖ్య విధానాల ద్వారా దేశీ విజన్‌ను ప్రోత్సహించేందుకు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) ర్యాంకింగ్‌ను చేపట్టింది. స్టార్టప్‌ల వృద్ధికి అనుగుణంగా సరళతర నియంత్రణల అమలుతోపాటు వ్యవస్థ పటిష్టతకు మద్దతుగా నిలిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో తొలుత 2018లో ర్యాంకింగ్ విధానానికి తెరతీసింది. -
గోధుమల ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గోధుమల ధరలు పెరగడంతో దరల్ని కట్టేడి చేసే దిశగా కేంద్రప్రభుత్వం మే 13 నుంచి గోధుమ ఎగుమతులను నిషేధించింది. ఐతే ఆ నిషేధం ఇంకా అమలులోకి రాక మునుపే కస్టమ్స్ అథారిటీ వద్ద నమోదు చేసుకున్న గోధుమ సరుకుల రవాణాను అనుమతించాలని నిర్ణయించినట్లు కేంద్రం పేర్కొంది. కస్టమ్స్ పరీక్షల కోసం అప్పగించిన గోధుమ సరుకులు మే13 లోపు రిజర్వ్ చేయబడి ఉంటే అటువంటి సరుకులు ఎగుమతి చేయడానికి అనుమతించనున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేగాక ఈజిప్టు ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఈజిప్టుకు వెళ్లే గోధుమ సరుకును కూడా కేంద్రం అనుమతించిందని తెలిపింది. దేశంలోని మొత్తం ఆహార భద్రతను నిర్వహించడానికే కాకుండా పోరుగు దేశాలకు, ఇతర బలహీన దేశాల అవసరాలకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) పేర్కొంది. అలాగే ఇతర దేశాల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ప్రభుత్వం ఈ ఎగుమతులను అనుమతిస్తున్నట్లు కూడా తెలిపింది. (చదవండి: మూతపడ్డ 22 గదుల ఫోటోలు విడుదల) -
పసిడి దిగుమతులు జూమ్..
న్యూఢిల్లీ: దేశీయంగా డిమాండ్ పెరగడంతో ఈ ఏడాది ఏప్రిల్ – సెప్టెంబర్ మధ్య కాలంలో పసిడి దిగుమతులు భారీగా పెరిగాయి. ఏకంగా 24 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది ఇదే వ్యవధిలో బంగారం దిగుమతుల విలువ సుమారు 6.8 బిలియన్ డాలర్లు. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. నెలవారీగా చూస్తే గతేడాది సెపె్టంబర్లో 601.4 మిలియన్ డాలర్లుగా ఉన్న పసిడి దిగుమతులు ఈ ఏడాది సెపె్టంబర్లో 5.11 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. మరోవైపు, ఏప్రిల్ – సెప్టెంబర్ మధ్య కాలంలో వెండి దిగుమతులు 15.5 శాతం తగ్గి 619.3 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అయితే, కేవలం సెప్టెంబర్ నెలే పరిగణనలోకి తీసుకుంటే 9.23 మిలియన్ డాలర్ల నుంచి 552.33 మిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి దిగుమతులు ఎగియడంతో దేశ వాణిజ్య లోటు సెప్టెంబర్ లో (దిగుమతులు, ఎగుమతుల మధ్య వ్యత్యాసం) 2.96 బిలియన్ డాలర్ల నుంచి 22.6 బిలియన్ డాలర్లకు చేరింది. భారత్ ఏటా 800–900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా పండుగ సీజన్, భారీ డిమాండ్ తదితర అంశాలు పసిడి దిగుమతులు పెరగడానికి కారణమని రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) చైర్మన్ కొలిన్ షా తెలిపారు. -
భారీగా పెరిగిన వాణిజ్యలోటు!
న్యూఢిల్లీ: ఎగుమతులు–దిగుమతుల మధ్య వాణిజ్యలోటు సెప్టెంబర్‌లో భారీగా పెరిగింది. 22.63 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెలలో ఈ లోటు 2.96 బిలియన్ డాలర్లు. ఎకానమీ రికవరీ, క్రియాశీలతకు వాణిజ్యలోటు పెరుగుదల సంకేతంగా భావించవచ్చని కొందరు ఆర్థికవ్తేతలు భావిస్తుండగా, వాణిజ్యలోటు భారీగా పెరిగిపోవడమూ మంచిదికాదని మరికొందరి వాదన. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ గురువారం గణాంకాలను విడుదల చేసింది. ఎగుమతులు–దిగుమతులు ఇలా... సెప్టెంబర్‌లో ఎగుమతులు 2020 ఇదే నెలతో పోల్చి 22.63 శాతం పెరిగి 33.79 డాలర్లుగా నమోదయ్యింది. ఇక దిగుమతుల విలువ 84.77 శాతం పెరిగి 56.39 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి వాణిజ్యలోటు 22.60 బిలియన్ డాలర్లుగా ఉంది. మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. బంగారం దిగుమతులు 2020 సెప్టెంబర్‌లో 601 మిలియన్ డాలర్లయితే, 2021 ఇదే నెల్లో 5.11 బిలియన్ డాలర్లకు చేరింది. - చమురు దిగుమతుల విలువ 5.83 బిలియన్ డాలర్ల నుంచి 17.44 బిలియన్ డాలర్లకు ఎగసింది. - సెప్టెంబర్‌లో సానుకూల వృద్ధిని నమోదు చేసిన ఎగుమతి రంగాలలో కాఫీ, జీడిపప్పు, పెట్రోలియం ఉత్పత్తులు, చేనేత, ఇంజనీరింగ్, రసాయ నాలు, తయారీ నూలు–దుస్తులు, రత్నాలు, ఆభరణాలు, ప్లాస్టిక్, సముద్ర ఉత్పత్తులు ఉన్నాయి. ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య.. ఇక ఎగుమతుల విలువ 2020 ఇదే కాలంతో పోల్చితే 57.53 శాతం పెరుగుదలతో 125.62 బిలియన్ డాలర్ల నుంచి 197.89 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు విలువ 81.67 శాతం ఎగసి 151.94 బిలియన్ డాలర్ల నుంచి 276 బిలియన్ డాలర్లకు ఎగశాయి. వెరసి వాణిజ్యలోటు 26.31 బిలియన్ డాలర్ల నుంచి 78.13 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య చమురు దిగుమతుల విలువ గత ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే, 32.01 డాలర్ల నుంచి 72.99 బిలియన్ డాలర్లకు ఎగసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. ఈ లక్ష్యాలు సాధించగల విశ్వాసాన్ని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ వ్యక్తం చేస్తున్నారు. పలు దేశాలతో ఎఫ్‌టీఏ చర్చలు: గోయెల్ ఇదిలావుండగా, బ్రిటన్, యూరోపి యన్ యూనియన్, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, ఆస్ట్రేలియాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (ఎఫ్‌టీఏ) భారత్ కీలక చర్చలు జరుపుతున్నట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయెల్ గురువారం పేర్కొన్నారు. మరో రెండు దేశాలు భారత్‌లో ఎఫ్టీఏకు అంగీకరించాయని కూడా వెల్లడించారు. అయితే ఆ దేశాల పేర్లను మంత్రి వెల్లడించలేదు. ఈ ఒప్పందం కింద సంబంధిత రెండు దేశాలూ తమ మధ్య వస్తు దిగుమతులపై కస్టమ్స్ సుంకాలను తగ్గించుకుంటాయి లేదా పూర్తిగా ఎత్తివేస్తాయి. సేవల రంగంలో వాణిజ్యాన్ని పెంపొందించుకుంటాయి. పరస్పరం ఒకదేశంలో మరొకటి భారీగా పెట్టుబడుల ప్రణాళికలను రూపొందించుకుంటాయి. ప్రధాని గతి శక్తి–నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్ (ఎన్‌ఐఎంపీ)న వల్ల పరిశ్రమల్లో ఉత్పాదకత పెరిగుతుందని పేర్కొన్నారు. స్థానిక తయారీదారులకు తోడ్పాటు అందించేందుకు, పరిశ్రమలో పోటీతత్వం పెంచేందుకు అలాగే భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక మండళ్లను తీర్చిదిద్దేందుకు ఇది ఉపయోగపడనుందని వివరించారు. మౌలిక రంగంలో చక్కటి పురోగతికి ఈ ప్లాన్ దోహదపడుతుందని వివరించారు. చైనాతో సరిహద్దు వివాదాలో ఆ దేశంతో ఉన్న వాణిజ్య సంబంధాలపై ఎటువంటి ప్రభావం చూపబోవని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చదవండి :భారత్‌లో అపార అవకాశాలు -
చైనా నుంచి దిగుమతులకు చెక్!
సాక్షి, న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన, పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో డ్రాగన్‌పై నలువైపులా ఒత్తిడి పెంచేందుకు భారత్ సిద్ధమవుతోంది. టిక్‌టాక్ సహా చైనాకు చెందిన 50 యాప్‌లను ఇప్పటికే బహిష్కరించిన ప్రభుత్వం బీజింగ్ నుంచి దిగుమతులను నియంత్రించేందుకు అవసరమైన చర్యలను సూచించాలని పీఎంఓ వాణిజ్య మంత్రిత్వ శాఖను కోరింది. గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డ్రాగన్‌పై పెంచుతున్నదౌత్య, ఆర్థిక ఒత్తిళ్లలో భాగంగా ఈ ప్రక్రియ సాగుతోంది. చైనా నుంచి దిగుమతులను వీలైనంతగా తగ్గించేందుకు సూచనలు ఇవ్వాలని పీఎంఓ అధికారులు వాణిజ్య మంత్రిత్వ శాఖను కోరినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ)ను సైతం పీఎంఓ సమీక్షిస్తోంది. ఎఫ్‌టీఏ పేరుతో భారత్‌కు చవకైన వస్తువులను గుమ్మరిస్తున్న దేశాలకు చెక్ పెట్టేందుకు కూడా ప్రభుత్వం సంసిద్ధమైంది. స్వయం సమృద్ధ భారత్ నినాదం కింద చైనా సహా ఇతర దేశాల నుంచి దిగుమతులను గణనీయంగా తగ్గించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. దక్షిణ కొరియా, మలేషియా, సింగపూర్ సహా ఆసియాన్ దేశాల దిగుమతులపై కూడా ప్రభుత్వం సమీక్షించనుంది. ఆత్మనిర్భర్ మిషన్ కింద దేశీయంగా తయారీని ప్రోత్సహించడంతో పాటు చైనా నుంచి వచ్చే తక్కువ నాణ్యతతో కూడిన దిగుమతులను నిరోధించేందుకు ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. చదవండి : కోవిడ్-19 : చైనాను దాటేసిన ముంబై -
పుంజుకున్న ఎగుమతులు
సాక్షి, న్యూఢిల్లీ: గత జనవరిలో భయపెట్టిన భారత వాణిజ్యలోటు కొద్దిగా చల్లబడింది. ఫిబ్రవరి మాసానికి సంబంధించి వాణిజ్య లోటు 12బిలియన్ డాలర్లుగా ఉందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గురువారం వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం ఎగుమతులు 4.5 శాతం దిగుమతులు 10.4 శాతం పెరిగాయి. ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరగడంతో దిగుమతులు పెరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 4.5 శాతం పెరుగుదలతో 25.8 బిలియన్ల డాలర్ల ఎగుమతులను సాధించామని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రీటా తియోతియా వెల్లడించారు. ఫిబ్రవరి వాణిజ్య లోటు గత మాసంలోని 16.3 బిలియన్ డాలర్లతో పోలిస్తే 12 బిలియన్ డాలర్లుగా ఉంది. అలాగే జనవరి 24.3 బిలియన్ డాలర్ల ఎగుమతులతో పోలిస్తే ఫిబ్రవరి ఎగుమతులు 25.8 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో దిగుమతులు 37.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పెట్రోలియం, రసాయనాలు, వెండి, ముత్యాల దిగుమతి పెరగడంతో వాణిజ్య లోటు జనవరిలో 56 నెలల గరిష్ఠానికి (16.3 బిలియన్ డాలర్లు) ఎగబాకింది. -
ఎగుమతులు ఓకే, కానీ..
► ఆగస్టులో 10% పైగా వృద్ధి ► ఆందోళనలో వాణిజ్య లోటు 11.65 బిలియన్ డాలర్లుగా నమోదు న్యూఢిల్లీ: భారత్ ఎగుమతుల వృద్ధి ఆగస్టులో 10.29 శాతంగా నమోదయ్యింది. ఈ స్థాయి వృద్ధి రేటు నాలుగు నెలల్లో ఇదే తొలిసారి. ఆగస్టులో ఎగుమతుల విలువ 23.81 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. పెట్రోలియం ప్రొడక్టులు, ఇంజ నీరింగ్, కెమికల్స్ ఎగుమతులు ఇందుకు సానుకూలంగా నిలిచాయని వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి. అయితే హస్తకళలు, రత్నాలు ఆభరణాలు, పండ్లూ, కూరగాయల ఎగుమతులు తగ్గాయి. దిగుమతుల్లో భారీ వృద్ధి... ఇక ఆగస్టు నెలలో దిగుమతులూ భారీగా పెరిగాయి. ఈ విలువ 21.02 శాతం పెరుగుదలతో 35.46 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు 11.65 బిలియన్ డాలర్లకు చేరింది. జూలైలో ఈ విలువ 11.40 బిలియన్ డాలర్లుకాగా, గత ఏడాది ఇదే నెలలో 7. 71 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. పసిడి దెబ్బ... దిగుమతులు భారీగా పెరిగి, వాణిజ్యలోటు కొంత ఆందోళన కలిగించడానికి బంగారం అధిక దిగుమతులూ కారణంగా నిలిచాయి. పసిడి దిగుమతులు దాదాపు 69 శాతం పెరిగి 1.88 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక మొత్తం దిగుమతుల వాటాలో చమురు దిగుమతులు 14.22 శాతం పెరిగి 7.75 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017–18) ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ ఎగుమతులు 8.57 శాతం పెరిగి 118.57 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇదే కాలంలో దిగుమతులు 26.63 శాతం పెరిగి 181.71 బిలియన్ డాలర్లకు చేరాయి. దీనితో వాణిజ్యలోటు ఈ కాలంలో 63.14 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. క్యాడ్ భారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం– కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 2.4 శాతంగా నమోదయ్యింది. విలువ రూపంలో భారీగా 14.3 బిలియన్ డాలర్లు. దిగుమతులు పెరిగి ఏర్ప డిన అధిక వాణిజ్యలోటు దీనికి కారణం. గత ఏడాది ఇదే కాలంలో క్యాడ్ 0.4 శాతం. గడచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి–మార్చి)లో కూడా క్యాడ్ ఇప్పటికన్నా తక్కువగా 0.6 శాతంగా (3.4 బిలియన్ డాలర్లు) నమోదయ్యింది. ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ నిధుల మధ్య నికర వ్యత్యాసమే క్యాడ్. క్యాడ్ ఎంత పెరిగితే అంతమేర ఆ దేశం ఇతర దేశాలకు రుణగ్రస్త దేశంగా మారుతుంది. ఇది ఆ దేశం మారక విలువ పతనం, ద్రవ్యోల్బణం పెరుగుదల వంటి ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది. నాలుగేళ్లక్రితం ఇలాంటి సమస్యే వచ్చినప్పుడు కేంద్రం పసిడి దిగుమతులపై కఠిన నియంత్రణలు విధించిన సంగతి తెలిసిందే. -
అమరావతి నిర్మాణం ఓ పెద్ద కుంభకోణం
పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్ : అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో జరుగుతున్న అవినీతి ప్రపంచంలోనే ఓ పెద్ద కుంభకోణమని, సింగపూర్ సంస్థల కోసం చంద్రబాబునాయుడు ప్రభుత్వం అడ్డగోలుగా నిబంధనలు, చట్టాలు మార్చేస్తోందని శాసనసభ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పారిశ్రామికవేత్తలకు వేగవంతంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం తెచ్చిన ‘ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనేబ్లింగ్ యాక్ట్ -2001’ను ఇష్టానుసారం మార్పులు చేసి సింగపూర్ సంస్థలకు మేలు చేయడానికి మంగళవారం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని అన్నారు. రాజధాని నిర్మాణంపై ఇటీవల హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యల నుంచి తప్పించుకునేందుకే ఈ చట్టానికి మార్పులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు మేరకు వ్యవహరించాల్సిందిపోయి ప్రభుత్వం మళ్లీ డివిజన్ బెంచ్‌కు వెళ్లడం గర్హనీయం అన్నారు. చంద్రబాబు చెబుతున్నట్లు అమరావతిలో సింగపూర్, లండన్, న్యూయార్క్ లాంటి మహానగరాలేమీ నిర్మించడం లేదన్నారు. అక్కడ ప్రభుత్వం పెట్టే రూ.12 వేల నుంచి 15 వేల కోట్లకు 42 శాతం వాటానా..? ఇది కుంభకోణం కాదా? అని ఆయన ప్రశ్నించారు. అంతా పథకం ప్రకారమే అప్పగింత.. అమరావతిలో రాజధాని నిర్మాణం అంటూ 2015 సెప్టెంబర్ 3న ప్రకటన, సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో చంద్రబాబు సింగపూర్ వెళ్లి ఒప్పందం చేసుకోవడం, ఏపీ రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని అక్కడి ప్రభుత్వంలోని వాణిజ్య శాఖలో ముఖ్య అధికారి ఫ్రాన్సిస్ ఛాంగ్.. అసెండాస్, సిమ్కార్ప్ కంపెనీలకు లేఖ రాయడం.. తిరిగి ఏపీ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఏ.గిరిధర్ ఆ కంపెనీలను ఆహ్వానించడం.. ఇలా అంతా ఓ పథకం చేశారన్నారు. వీటన్నింటిపై ఎవరైనా కోర్టుకు వెళితే భారీ కుంభకోణం వెలుగులోకి వస్తుందన్నారు. లోకేశ్ ఆస్తులు ఏడాదికేడాది తగ్గిపోతుండటం అంతా డ్రామా అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బంజారాహిల్స్‌లోని చంద్రబాబు ఇంటి విలువను గతంలో రూ.40 లక్షలుగా చూపించడమే అపహాస్యమన్నారు. చంద్రబాబుది స్పీడు కాదని, కన్ఫ్యూజన్ అని ఎద్దేవా చేశారు. -
పసిడి దిగుమతులు వెలవెల..!
న్యూఢిల్లీ: భారత్ పసిడి దిగుమతులు ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో (ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య) గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 60.5 శాతం తగ్గాయి. విలువ రూపంలో 15.42 బిలియన్ డాలర్ల నుంచి 6.08 బిలియన్ డాలర్లకు తగ్గినట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాలు పేర్కొన్నాయి. విదేశీ మారకద్రవ్య చెల్లింపుల అవసరం తగ్గడం వల్ల ఇది కరెంట్ అకౌంట్ (ఎఫ్‌డీఐ, ఎఫ్ఐఐ, ఈసీబీలు మినహా దేశానికి వచ్చీ-పోయే విదేశీ కరెన్సీ మధ్య వ్యత్యాసం)కు లాభించే పరిణామమని అధికార వర్గాలు భావిస్తున్నాయి. తొమ్మిది సంవత్సరాల తరువాత మొట్టమొదటిసారి మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) కరెంట్ అకౌంట్ మిగులు నమోదయ్యే అవకాశం ఉందన్న అంచనాలూ వెలువడుతున్నాయి. -
ఎగుమతులు 8వ నెలా డీలా!
♦ 10 శాతం క్షీణత నమోదు ♦ దిగుమతులూ తగ్గాయ్ ♦ వాణిజ్యలోటు 13 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ : ఎగుమతులు వరుసగా ఎనిమిది నెల జూలైలోనూ క్షీణించాయి. 2014 జూలై విలువతో పోల్చితే 2015 జూలైలో ఎగుమతుల విలువలో అసలు వృద్ధిలేకపోగా- 10.3 శాతం క్షీణించింది. విలువ 23 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. అంతర్జాతీయ మందగమనం, క్రూడ్ ఆయిల్ ధరల పతనం వల్ల... ఆ ఎగుమతుల విలువ పెద్దగా లేకపోవడం వంటి కారణాలు దిగుమతుల తిరోగమనానికి కారణం. మొత్తం దేశ ఎగుమతుల్లో పెట్రోలియం ప్రొడక్టుల వాటా దాదాపు 18 శాతం. వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. దిగుమతులూ అంతే... దేశానికి దిగుమతులు కూడా 10 శాతం తగ్గాయి. విలువ 36 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. చమురు దిగుమతులు బిల్లు తగ్గడం దీనికి ప్రధాన కారణం. దీనితో ఎగుమతి-దిగుమతుల వ్యత్యాసానికి సంబంధించి వాణిజ్యలోటు 13 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. కాగా చమురు దిగుమతుల విలువ 34.91 శాతం తగ్గి, 9.48 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. మొత్తం దిగుమతుల్లో ఈ విభాగం వాటా 31 శాతం. చమురు యేతర దిగుమతుల విలువ 3.8 శాతం పెరిగి 26.46 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. విభాగాల వారీగా: పెట్రోలియం ప్రొడక్టులు (-43 శాతం), తోలు, తోలు ఉత్పత్తులు (-10 శాతం), సముద్ర ఉత్పత్తులు (-18 శాతం), రసాయనాల (-6 శాతం) ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణించాయి. పసిడి దిగుమతులు 62 శాతం అప్ పసిడి దిగుమతులు జూలైలో 62 శాతం ఎగశాయి. జూలైలో ఈ విలువ దాదాపు 3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.