Work From Home-India: Commerce Ministry Allowed One Year WFH For Sez Employees - Sakshi
Sakshi News home page

WFH Rules In India: ఉద్యోగులకు బంపరాఫర్‌, వర్క్‌ ఫ్రమ్‌ హోంపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

Published Wed, Jul 20 2022 8:13 AM | Last Updated on Wed, Jul 20 2022 9:01 AM

Commerce Ministry Allowed One Year Work From Home For Sez Employees - Sakshi

వర్క్‌ ఫ్రం హోంపై కేంద్ర వాణిజ్య శాఖ కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది. స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్స్‌(సెజ్‌)లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఏడాది పాటు వర్క్‌ ఫ్రం హోం చేసుకునే అవకాశాన్ని కల్పించ్చింది.

మొత్తం ఉద్యోగుల్లో గరిష్టంగా 50 శాతం మందికి ఈ అవకాశం కల్పిచ్చింది. ఏడాది పూర్తయినా సరే కొన్ని సందర్భాలలో ఉద్యోగులకు మరో ఏడాది పాటు వర్క్‌ ఫ్రం హోం కొనసాగించే వెసులు బాటు కల్పిచ్చింది. 50 శాతానికి మించి ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పనిచేయాలంటే..సంబంధిత కారణాల్ని వ్రాతపూర్వకంగా వివరిస్తూ సెజ్‌ల డెవలప్‌మెంట్ కమిషనర్ (డీసీ) అనుమతి తీసుకోవాలని పేర్కొంది. కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు సైతం ఈ కొత్త పని దినాలు కేంద్రం తెలిపింది. .
  
స్పెషల్‌ ఎకనామిక్స్‌ జోన్స్‌ రూల్స్‌-2006 ప్రకారం..కేంద్రం విడుదల చేసిన విడుదల చేసిన ఈ కొత్త మార్గదర్శకాలతో ఫ్లెక్సిబులిటీ కోరుకునే ఉద్యోగుల్ని ఆకట్టుకునేందుకు దోహదం చేస్తుందని భావిస్తోంది. ఇక ఈ కొత్త పనిదినాలు సెజ్‌ ఉద్యోగులతో పాటు ఐటీ/ఐటీఈఎస్‌ రంగాల్లో విధులు నిర్వహించే వారికి సైతం ఈ కొత్త పని విధానం వర్తిస్తుంది. అంటే కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించలేని ఉద్యోగులకు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లి పనిచేసే వారికి, ఆఫ్‌సైట్‌లో వర్క్‌ చేస్తున్న ఉద్యోగులకు ఇంటి వద్ద నుంచి పని చేసుకోవచ్చు. కాగా, ఇప్పటికే వర్క్‌ ఫ్రం హోం చేస్తున్న సెజ్ యూనిట్లకు సంబంధించిన ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు అమలు చేసేందుకు 90 రోజుల సమయం ఇచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement