
Benefits Of Tamarind Syrup: కూరల్లో పులుపు, రుచికోసం వాడే చింతపండు ఆరోగ్యాన్ని కాపాడడంలో, చర్మాన్ని అందంగా ఉంచడంలో ప్రముఖపాత్ర పోషిస్తుంది. చింతపండులో విటమిన్స్, ఐరన్, పొటాషియం, ఖనిజపోషకాలు, పీచుపదార్థంతోపాటు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
దీనివల్ల చింతపండు రోగాల నుంచి శరీరాన్ని కాపాడడమేగాక, శరీరానికి తగినంత రక్తాన్ని అందించి చర్మాన్ని మెరిపిస్తుంది. చింతపండులోని విటమిన్ సి ముఖం మీద మొటిమలు తొలగించి అందంగా ఉంచుతుంది.
ఇన్ని గుణాలు ఉన్న చింతపండు సిరప్‌ను ముఖానికి రాసుకున్నా, నేరుగా తాగినా ఈ గుణాలన్నీ శరీరానికి పుష్కలంగా అందుతాయి. ఇంకెందుకాలస్యం... చింతపండు సిరప్ తయారీ, వాడకం గురించి తెలుసుకుందాం...
ఇలా చేయండి..
►చింతపండుని నీళ్లలో మరిగించి వడగట్టాలి.
►ఈ నీటిలో కొద్దిగా తేనె లేదా బెల్లం వేసి బాగా కలపాలి.
►దీనిలో నాలుగైదు ఐస్‌ముక్కలు వేస్తే చింతపండు సిరప్ రెడీ! దీనిని నేరుగా తాగేయాలి.
మొటిమలు, మచ్చలు మాయం!
►చింతపండు మరిగించిన నీటిలో కొద్దిగా తేనెవేసి ముఖానికి అప్లై చేయాలి.
►ఇరవైనిమిషాలపాటు మర్దనచేసి ఆరాక కడిగేయాలి.
►వారానికి రెండుమూడుసార్లు ఈ విధంగా చేయడం వల్ల ముఖం మీద మొటిమలు, మచ్చలు పోయి ముఖం కాంతిమంతంగా మారుతుంది.
►సిరప్‌ను తరచూ తాగినా ఆరోగ్యంతోపాటు, చర్మం అందంగా మెరుస్తుంది.
చదవండి: Benefits Of Onion Juice: ఉల్లి రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు పట్టిస్తే! నల్లని, ఒత్తైన కురులు..!
Sonakshi Sinha: అమ్మ చెప్పింది.. ఇలా చేస్తే మొటిమలు, మచ్చలు, ట్యాన్ దరిచేరవు!
Comments
Please login to add a commentAdd a comment