
సాక్షి, ఢిల్లీ: ఎండబెట్టిన చింతపండుపై జీఎస్టీని మినహాయించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ మేరకు ఎండబెట్టిన చింతపండుపై జీఎస్టీని మినహాయించాని విజ్ఞప్తి చేస్తూ జూలై 24న కేంద్ర ఆర్థిక శాఖకు వైఎస్సార్ సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లేఖ రాశారు. దీనిపై సెప్టెంబర్ 20న పనాజీలో జరిగిన జీఎస్టీ 37వ మండలి సమావేశంలో విస్తృతంగా చర్చించి ఎండబెట్టిన చింతపండుపై జీఎస్టీని మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు వేమిరెడ్డికి అనురాగ్ ఠాకూర్ గురువారం ప్రత్యుత్తరం పంపారు. సెప్టెంబర్ 30 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment