Beauty Tips In Telugu: Benefits Of Tamarind Leaf And Papaya Pack For Acne Free Face - Sakshi
Sakshi News home page

Beauty Tips In Telugu: చింతాకు, బొప్పాయి గుజ్జు.. మచ్చలు, ముడతలు మాయం!

Published Wed, Jun 1 2022 10:33 AM | Last Updated on Wed, Jun 1 2022 12:27 PM

Beauty Tips In Telugu: Tamarind And Papaya Pack For Acne Free Face - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

Tamarind Leaf And Papaya Pack : కప్పు చింత ఆకుల్లో పావు కప్పు బొప్పాయి పండు గుజ్జు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా అప్లై చేసి ఇరవై నిమిషాలపాటు ఆరనివ్వాలి. తరువాత చల్లటి నీటితో కడిగేయాలి.

వారానికి రెండు సార్లు ఈ పుల్లటి ప్యాక్‌ వేసుకోవడం వల్ల చర్మానికి మాయిశ్చర్‌ అందుతుంది. ఇందులోని యాంటీసెఫ్టిక్‌ గుణాలు చర్మాన్ని సూక్ష్మజీవుల నుంచి కాపాడతాయి. క్రమం తప్పకుండా ఈ ప్యాక్‌ను వేసుకుంటే ముఖం మీద మచ్చలు, ముడతలు, చర్మసంబంధ సమస్యలు తగ్గుముఖం పడతాయి.  

►ఇక బియ్యప్పిండి, బొప్పాయి గుజ్జుని మఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గుముఖం పడతాయి.
►అదే విధంగా బొప్పాయిగుజ్జులో పసుపు, పచ్చిపాలు, తేనె,  తులసి ఆకుల పొడి కలిపిముఖానికి పట్టిస్తే, మొటిమలు, తెల్లమచ్చలు మాయమవతాయి.
►బొప్పాయి పండు గుజ్జు, అర స్పూన్‌ అలోవెరా జ్యూస్, కొంచెం తేనె కలిపి రాసుకుంటే చర్మానికి కావలసిన తేమ, పోషక పదార్థాలు అందుతాయి. మీరు యవ్వనంగా కనిపిస్తారు.
►నిమ్మరసం, కొద్దిగా పెసరపిండి కలిపి అందులో కొద్దిగా బొప్పాయి గుజ్జును కలిపి రాసుకొంటే తెల్లని ఛాయ వస్తుంది.
►బొప్పాయి పండుకి ముఖం మీద ముడతలు పోగొట్టే అద్భుత గుణం కూడా ఉంది.

చదవండి: టీనేజ్‌లో కాకుండా... యుక్తవయసు దాటాకా మొటిమలు వస్తున్నాయా? అయితే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement