చింత గింజలు అంటే చింతపండు వాడుకుని, పులుసు తీసుకున్న తరువాత తీసిపారేసే వేస్ట్ గింజలనుకునేరు. వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చింతపండు గింజల్లో ఉండే ప్రోటీన్‌లోయాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయని, చికున్ గున్యా కోసం యాంటీవైరల్ మందులను అభివృద్ధి చేయడానికి సమర్థ వంతంగా ఉపయోగించవచ్చని నిపుణుల మాట. దీంతో పాటు వివిధ ప్రయోజనాలూ ఉన్నాయి. అవేంటో తెలియాంటే..ఈ కథనాన్ని చదవాల్సిందే..!
చింత చెట్టును భారత దేశపు ఖర్జూర చెట్టు అంటారు. గతంలోనే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) బయోటెక్నాలజీ విభాగానికి చెందిన రూర్కీ ప్రొఫెసర్‌లు చింతగింజలపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలు ఎల్సెవియర్ జర్నల్, వైరాలజీలో ప్రచురించబడ్డాయి కూడా. దీని ప్రకారం మధుమేహ నిర్వహణలో ఉపయోగ పడతాయి. చింత గింజల పొడితో దంత సమస్యలను దూరం చేసుకోవచ్చు. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి చింతగింజలు దివ్యౌషధంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మధుమేహం: చింతపండు గింజలు ప్యాంక్రియాస్‌ను రక్షిస్తాయి. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల పరిమాణాన్ని పెంచుతుంది.చింతపండు గింజల నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా నియంత్రించుకోవచ్చు.
దంతాలకు మేలు చేస్తుంది: చింతపండు గింజల పొడితో చిగుళ్ళు ,దంతాలను తోముకుంటే మంచిది. ఎక్కువగా పొగ త్రాగే వారికి. శీతల పానీయాలు, ధూమపానం వల్ల పళ్లు గారపట్టిపోతాయి. ఇందుకోసం చింత గింజలను పొడి చేసి అందులో నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసి రోజూ దంతాలను తోముకోవాలి. దీంతో దంతాలు తెల్లగా మారడంతోపాటు దంతాలపై ఉండే గార, పాచి వదిలిపోతుంది.
జీర్ణక్రియ: చింతపండు గింజల రసం అజీర్ణాన్ని నయం చేయడానికి, పిత్తానికి సహజ నివారణగా ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా, ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.ఇది కొలెస్ట్రాల్‌ను మరింత తగ్గిస్తుంది.
ఇన్ఫెక్షన్లను నివారణలో: యాంటీ బాక్టీరియల్ లక్షణాలుతో చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షించుకోవచ్చు. అంతేకాకుండా, ఇది పేగు , మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల నుండి కూడా కాపాడుతుంది.
గుండెకూ మంచిదే: చింతపండు విత్తనాలలో పొటాషియం ఉంటుంది. పొటాషియం బీపీని తగ్గిస్తుంది. రక్తపోటు, ఇతర హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఉపయోగపడుతుంది.
ఇన్ఫెక్షన్ల నివారణలో: చింత గింజల్లో యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఈ గింజల పొడిలో నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని గాయాలు, పుండ్లపై రాసుకోవచ్చు. అలాగే మంగు మచ్చల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. చింత గింజలను పొడిలా తయారుచేసి, ఆ పొడిలో తేనె కలిపి మచ్చల ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. చింతగింజల పొడిని రోజూ ఓ అర టీస్పూన్ మేర రోజుకు రెండు సార్లు నీటితో కలిపి తీసుకోవాలి. పాలు లేదా నెయ్యిని కూడా వాడొచ్చు. దీనివల్ల మోకాళ్ల నొప్పులు దూరమవుతాయి.
వీర్యకణాల వృద్ధిలో
ఆవుపాలు, చింతగింజల పొడిని కలిపి రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల పురుషుల్లో వచ్చే లైంగిక సమస్యలు తగ్గుతాయి. వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. ఇలా
నోట్: చిట్కాలు అందరికీ ఒకేలా పనిచేస్తాయన్న గ్యారంటీ లేదు. నిపుణులతో సంప్రదించి చింతగింజల పొడిని వాడుకోవాలి. దీని ప్రయోజనానలు వైద్యుడిని సంప్రదించి నిర్ధారించుకోండి.
Comments
Please login to add a commentAdd a comment