అబిడ్స్: నగరంలో చింతకాయల కొరత ఏర్పడింది. ప్రతి ఏటా వినాయక చవితి ముందు మార్కెట్‌లో చింతకాయలు పుష్కలంగా లభించేవి. ఈసారి చింతకాయలు సకాలంలో పండకపోవడంతో నగరంలో వీటికి కొరత ఏర్పడింది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని చింతకాయలు కొనుగోలు చేయాలంటే కిలోకు రూ.400– 600 చొప్పున పెట్టాల్సి వచ్చింది. నగరంలోని గుడిమల్కాపూర్, మోండా మార్కెట్, మాదన్నపేట్‌లతో పాటు పలు మార్కెట్‌లలో చింతకాయలు నామమాత్రంగా లభ్యమయ్యాయి. వినాయక చవితి రోజు చింతకాయ, ఆకుకూరల పప్పు, చింతకాయ పచ్చడితో ఉండ్రాళ్లు తినడం ఆనవాయితీ. దీంతో చింతకాయల ధర ఎంత భగ్గుమంటున్నా కొనుగోలుదారులు కొంతమేరకు కొనుగోలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment