SOYA
-
మీల్ మేకర్ ఆరోగ్యానికి మంచి 'గేమ్ ఛేంజర్'..!
బిర్యానీలో వేసే సోయా చంక్స్ లేదా మీల్ మేకర్(Soya chunks) ఆరోగ్యానికి ఎంతో మంచివట. వీటిని మన ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఇవి మొక్కల ఆధారిత ప్రోటీన్గా పిలుస్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్యానికి మంచి గేమ్ ఛేంజర్(Game-changer)గా చెబుతున్నారు. అదెలాగో సవివరంగా చూద్దాం..!.సోయా ముక్కలు (సోయా చంక్స్) సోయాబీన్స్ నుంచి తయారైన మొక్కల ఆధారిత ప్రోటీన్ మూలం. కొవ్వు శాతం తక్కువ, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. శాకాహారులకు ప్రత్యామ్నాయమైన సాంప్రదాయ మాంసం ఆధారిత ప్రోటీన్గా పనిచేస్తుంది. తినేందుకు రుచిగానూ, శరీరానికి అవసరమైన విటమిన్లను అందిస్తుంది. తృప్తికరమైన భోజనానికి చిహ్నంగా ఉంటుంది. ఆరోగ్య స్ప్రుహ ఉన్న వ్యక్తులకు ఇది బెస్ట్ సూపర్ ఫుడ్. ఆహార ప్రియలు ఈ మీల్ మేకర్ని పలు విధాల రెసిపీలతో ఆస్వాదిస్తున్నారు. వంట చేసే నేర్పు లేనివారైనా..సులభంగా వండుకోగలరు. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటంటే..గుండె ఆరోగ్యానికి మంచిది..మీల్ మేకర్లో ప్రొటీన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా, సంతృప్త కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ పోషకాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరగుతుంది.బరువు తగ్గుతారు..మీల్ మేకర్లో ప్రొటీన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మిమ్మల్ని చాలా కాలం పాటు నిండుగా ఉంచుతాయి. మీరు తరచుగా తినాలనే కోరికలను తగ్గిస్తుంది. మీల్ మేకర్‌లోని ప్రొటీన్‌కు శరీరం కొవ్వు, బరువును తగ్గించే లక్షణాలు ఉంటాయి. మనం శరీరంలో కార్బోహైడ్రేట్ల కంటే సోయా చంక్స్‌ను జీర్ణం చేయడానికి ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది. ఫలితంగా శరీరంలో కొవ్వు ఈజీగా కరుగుతుంది, బరువు కూడా సులభంగా తగ్గుతారు.మెనోపాజ్ లక్షణాలను తగ్గిస్తుంది..మెనోపాజ్ దశలో మహిళలు యోని పొడిబారడం, వేడి ఆవిర్లు, మూడ్ స్వింగ్స్, నిద్రాభంగం, రాత్రిపూట చెమటలు పట్టడం వంటి లక్షణాలతో ఇబ్బంది పడుతుటుందారు. సోయా చంక్స్‌లో ఐసోఫ్లేవోన్స్ అనే ఫైటోఈస్ట్రోజెన్ ఉంటుంది, ఇది మెనోపాజ్ లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది.హార్మోన్ల సమతుల్యతవీటిలోని ఫైటోఈస్ట్రోజెన్ కంటెంట్ పీరియడ్స్ సక్రమంగా వచ్చేలా చేస్తుంది. ముఖ్యంగా PCOS, పోస్ట్ మెనోపాజ్ లక్షణాలతో బాధపడేవారికి మీల్ మేకర్ మేలు చేస్తాయి.యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి..మీల్ మేకర్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, కొన్ని రకాల కేన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.జీర్ణక్రియకు..మీల్ మేకర్ పేగులలో లాక్టోబాసిల్లి, బైఫిడోబాక్టీరియా పరిమాణం పెంచుతుంది. ఈ రెండు సూక్ష్మజీవులు జీర్ణక్రియకు సహాయపడతాయి.మధుమేహ రోగులకు మంచిది..మీల్ మేకర్లో ఐసోఫ్లేవోన్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. ఇలా రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటే గుండె సమస్యల ప్రమాదం కూడా తగ్గుతుంది.(చదవండి: జపాన్‌లో ఇంత క్లీన్‌గా ఉంటుందా..!) -
సోయా ఆకుతో బరువు తగ్గొచ్చు.. ఇంకా ఆశ్చర్యకర ప్రయోజనాలు
ఆకుకూరల్లో చాలారకాలు ఉన్నాయి. కొన్ని ప్రజాదరణ పొందినవి అయితే.. మరికొన్ని చాలామందికి తెలియదు. అలాంటిదే సోయకూర. సోయా ఆకు తినడం ద్వారా మంచి పోషకాలు శరీరానికి అందుతాయి. చిన్నగా, సన్నగా పొడవుగా చూడటానికి కొత్తిమీరలా కనిపించే ఆ ఆకు కూరను సోయ, సావా, సోవా లేదా దిల్ లీవ్స్ అని పిలుస్తారు. సోయకూరతో లభించే పోషకాల గురించి తెలుసుకుందాం.సోయా మొక్క కూడా సోంఫ్ మొక్కలాగా కనిపిస్తుంది. సోయా ఆకు, గింజలను సువాసన కోసం ఉపయోగిస్తారు కూడా. ఆయుర్వేదంలో ఒక బలవర్ధకమైన ఆకుగా వాడుకలో ఉంది. విటమిన్ సీ, ఏ, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు మెండుగా లభిస్తాయి. సోయా ఆకు అనేక వ్యాధులకు ఔషధంగా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. చక్కెర వ్యాధిని అదుపు చేస్తుంది. ముఖ్యంగా నెలసరి, ప్రసవ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు. విటమిన్ సీ, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. విటమిన్ ఏ కంటిచూపును మెరుగుపరుస్తుంది. కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. ఇందులోని మాంగనీస్ నాడీ వ్యవస్థను బలోపేతం చేసి, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అల్జీమర్స్, ఆర్థరైటిస్ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.సోయా ఆకుల్లోని యాంటీ ఇన్ల్ఫమేషన్, యాంటీ ఫ్లాట్యులెన్స్ గుణాలు జీర్ణక్రియకు మంచిది. అజీర్తిని దూరం చేసి, ఎసిడిటీ, గ్యాస్ సమస్యలను నిరోధిస్తుంది. అంతేకాదు మలబద్ధకం, కడుపు ఉబ్బరం, అల్సర్, ఇతర పొట్ట సమస్యలను నివారించడంలో దీనికి కీలక పాత్ర. గాయాలను నయం చేయడంలో సాయపడుతుంది. బరువు నియంత్రణలోసోయా ఆకులో కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ కాబట్టి, ఊబకాయాన్ని నియంత్రించవచ్చు. చెడు కొలెస్ట్రాల్‌తో పాటు, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను కూడా తగ్గించడంలో చక్కగా పనిచేస్తుంది. తద్వారా బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. రోజూ ఉదయం గ్రీన్ టీలాగా లేదా సోయా ఆకులను నీటిలో మరిగించి వడకట్టి తాగితే శరీరంలోని కొవ్వు వేగంగా కరిగిపోతుంది.సోయా ఆకుకూరతో పప్పు చేసుకోవచ్చు. పకోడీ, బజ్జీ, పరాటా తయారీలో వాడుకోవచ్చు. పలావ్లో సోయా ఆకులను వాడితే మంచి సువాసన వస్తుంది. ఇంకా సోయా ఆకును కూరల్లో, పచ్చళ్లలో వేసుకోవచ్చు , పిజ్జా, బర్గర్, సలాడ్స్‌లో కూడా వాడతారు. -
నారు ఎండుతోంది... నాట్లు వేసేందుకు భయపడుతున్న రైతులు
డొంకేశ్వర్(ఆర్మూర్)/మాక్లూర్: నేలను చల్లబరిచే తొలకరి వానలు ముఖం చాటేశాయి. జూన్ నెల పూర్తి కావస్తున్నా చినుకు నేలను తాకడం లేదు. దీంతో ఖరీఫ్ సాగు పనులు నెమ్మదించాయి. ముఖ్యంగా భూమిలో వేడి కారణంగా వరినారుకు ప్రమాదం ఏర్పడింది. బోర్ల సాయంతో నీటిని ఎంత పెట్టినా రంగుమారుతోంది. ఎదుగుదల కనిపించడం లేదు. వేర్లు, కొనలు వాడిపోయి ఎండుముఖం పడుతున్నాయి. నారు చనిపోయి చేతికిరాని ప్రాంతాల్లో మళ్లీ నార్లు పోస్తున్నారు. అయితే, వాతావరణ పరిస్థితులను చూసి రైతులు నాట్లు వేసేందుకు భయపడుతున్నారు. వర్షాలు పడ్డప్పుడే చూద్దామని ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే, మొక్కదశలో ఉన్న మొక్కజొన్న, సోయా, పసుపు పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. వీటికి నీరందించినా తీవ్రమైన ఎండలు, వడగాల్పులకు ఆకులు వాడిపోతున్నాయి. పారకం చేసిన కొద్ది గంటలకే నేల పూర్తిగా పొడిబారుతోంది. ఒక్కరోజు అరుపిచ్చినా పొలంలో నెర్రలు ఏర్పడుతున్నాయి. భూమి లోపలి వేడికి విత్తనాలు సైతం ఉడికిపోయి చనిపోయితున్నాయి. అయితే, వర్షాల్లేక వ్యవసాయానికి ఏర్పడిన గడ్డు పరిస్థితులను చూసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్న చేతికొచ్చిన యాసంగి పంటలపై దాడిచేసి తీవ్రంగా నష్టం చేసిన వానలు, ఇప్పుడేమో సమయానికి రాకుండా దెబ్బతీస్తున్నాయని వాపోతున్నారు. దమ్ము చేసి నారు పోయడంతోనే.. నేల లోపలి భూభాగం చల్లబడాలంటే అది వర్షాలతోనే సాధ్యమవుతుంది. తొలకరి చినుకులతో నేలలో కొంత తేమశాతం కనిపిస్తే నార్లు పోయడానికి, విత్తనాలు విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ, నేల పొడిగా ఉండగానే రైతులు పొలంలో కొంత భాగాన్ని దమ్ముచేసి అందులో వరినార్లు పోశారు. దీనికి తోడు వర్షాలు రాకపోవడంతో నేలలోని వేడికి నార్లు మాడిపోతున్నాయి. ఇలాంటి సమయంలో దమ్ము చేయకుండా వెదజల్లే పద్ధతిలో నార్లు పోసుకోవాలని వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ ఏడాది వర్షాకాలం సీజన్లో 5.13లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని, ఇందులో 4.17 ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వర్షాల లేమి కారణంగా వరిసాగు ఇప్పటి వరకు 2శాతం కూడా మించలేదు. బోధన్ డివిజన్‌లోనే నాట్లు ప్రారంభమయ్యాయి. మొక్కజొన్న సాగు సైతం ఐదుశాతం దాటలేదు. నారు పెరుగుతలేదు మూడెకరాల కోసం బీపీటీ రకం విత్తనాలు కొని ఇరవై రోజుల క్రితం నారు పోసినం. వర్షాల్లేక ఎండల ప్రభావానికి నారు వాడిపోయి రంగుమారుతోంది. ఎంత నీళ్లు పెట్టినా ఎదగడం లేదు. వాతావరణం అనుకూలించక పసుపు, సోయా, మక్క సాగుకు సాహసించడం లేదు. – కృష్ణయాదవ్, యువరైతు, నికాల్పూర్ రోగం వస్తే మందులు కొట్టినం తొమ్మిది బస్తాల బీపీటీ విత్తనాలు చల్లినం. ఎండలకు నారుకు రోగం వచ్చింది. మొగిపురుగు ఆశించింది. వెంటనే మందులు కొట్టినం. పరిస్థితులు చూస్తేంటే నాట్లు వేయాలంటే భయంగా ఉంది. వ్యవసాయాధికారులు సలహాలు, సూచనలు అందించాలి. – శ్రీనివాస్, రైతు, నికాల్పూర్ -
Health Tips: టొమోటాలు, సోయా, బెర్రీలు.. ఇంకా.. ఇవి తినండి... వయసు తగ్గించుకోండి!
సాధారణంగా చాలామంది స్త్రీలు ముఖ్యంగా గృహిణులు కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ తమ గురించి తాము ఏమాత్రం పట్టించుకోరు. ఫలితంగా నిండా నాలుగు పదులు కూడా రాకుండానే వయసు మీద పడ్డట్టు కనిపిస్తారు. అయితే కొన్ని రకాల పదార్థాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అందంగా... ఆరోగ్యంగా.. ఉన్న వయసు కంటే తక్కువగా కూడా కనిపిస్తారు. అవేంటో తెలుసుకుందాం.. పాలు స్త్రీలు పాలు తాగడం ఎంతో మంచిది. ఎందుకంటే పాలలో ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అయితే కొవ్వు శాతం తక్కువగా ఉండే పాలనే తాగాలి. పాలలో ఎముకలను బలంగా ఉంచే కాల్షియం, విటమిన్ డి, విటమిన్ సి లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. పెరుగు కొవ్వు తక్కువగా ఉండే పెరుగు స్త్రీలకు ఎంతో హితకరమైనది. ఈ రకమైన పెరుగును తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడేవారికి పెరుగు ఔషధంలా పనిచేస్తుంది. స్త్రీలకు వచ్చే కొన్నిరకాల ఇన్ఫెక్షన్లను, అల్సర్‌ను కూడా తగ్గిస్తుంది. టొమోటాలు స్త్రీలకు టమాటాలు ఔషధంతో సమానం. ఎందుకంటే దీనిలో పుష్కలంగా ఉండే లైకోపీన్ రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని చాలా అధ్యయనాలు నిరూపించాయి. ఇక టొమాటాల్లో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెజబ్బులను తగ్గించడానికి సహాయపడతాయి. టొమోటాలను రోజూ తినడం వల్ల ఎంత వయసు వచ్చినా యవ్వనంగానే కనిపిస్తారు. ఎందుకంటే ఇవి చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. పోషకాల సోయా పోషకాలు పుష్కలంగా ఉండే సోయాను తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఎన్నోరకాల పోషకాలు అందుతాయి. వీటిలో విటమిన్స్, ఐరన్ వంటి పోషకాలకు కొదవే ఉండదు. ఇవి అతివలను అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంచుతాయి. బలాన్నిచ్చే డ్రై ఫ్రూట్స్ రోజూ గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరానికి అవసరమైన ఎన్నోరకాల పోషకాలు అందుతాయి. అందుకే వీటిని స్త్రీలు తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో విటమిన్ బి12, విటమిన్ ఇ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. రోజూ డ్రై ఫ్రూట్స్‌ను తింటే బలంగా ఉంటారు. క్యాన్సర్‌ను అడ్డుకునే బెర్రీలు బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, రాస్ బెర్రీలు, స్ట్రాబెర్రీలు, క్రాన్ బెర్రీలను రోజూ తింటే మీరు ఎలాంటి రోగాల బారిన పడే అవకాశమే రాదంటారు నిపుణులు. ఎందుకంటే వీటిలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల పెద్దపేగు క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. ఎందుకంటే వీటిలో క్యాన్సర్‌తో పోరాడే ఔషధ గుణాలుంటాయి. వీటితో పాటు గ్రీన్ టీ, డార్క్ చాకొలెట్, అవిసె గింజెలు సైతం యవ్వనంగా కలినపించడంలో దోహందం చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చూశారుగా... ఎక్కువ వయసు ఉన్నవారిలా కనిపిస్తున్నామని బాధపడకుండా పైన చెప్పుకున్న వాటిని రోజువారీ తీసుకుంటూ అందంగా.. ఆరోగ్యంగా... యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నించడం మంచిది కదా! -
Health Tips: ట్యూనా, సాల్మన్, గుడ్లు, పాలు.. విటమిన్- డి పుష్కలం!
మన శరీరానికి అవసరమైన అత్యంత ముఖ్యమైన విటమిన్లలో.. విటమిన్- డి కూడా ఒకటి. ఈ ‘సన్‌షైన్ విటమిన్’ లోపిస్తే ముఖ్యంగా ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. పిల్లల్లో రికెట్స్ వంటి సమస్యలు వస్తాయి. మరి ఈ లోపాలను అధిగమించేందుకు ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే సరి! వీటిలో విటమిన్- డి పుష్కలం. ఈ ఆహారాల్లో లభిస్తుందం’డి’ ►పుట్టగొడుగుల్లో ‘విటమిన్–డి’ ఎక్కువగా ఉంటుంది. ►గుడ్లను ఆహారంగా తీసుకుంటే ‘విటమిన్–డి’ లభిస్తుంది. ►పాలు, సోయా పాలు లేదా నారింజ రసంలో సైతం విటమిన్లు, ఖనిజాలు సమద్ధిగా ఉంటాయి. ►ట్యూనా, సాల్మన్ చేపలు వంటి సముద్రపు ఆహారంలో కూడా విటమిన్–డి సమృద్ధిగా ఉంటుంది. ►జున్ను, పాలు, టోఫు, పెరుగు, గుడ్లు వంటి పాల ఉత్పత్తులు ‘విటమిన్–డి’కి మంచి వనరులు. ►చలికాలంలో వీలైనంత ఎక్కువసేపు ఎండలో ఉన్నట్లయితే శరీరానికి కావలసినంత విటమిన్ డి లభిస్తుంది. ►అలాగని ఎండాకాలంలో ఎప్పుడూ ఏసీగదుల్లోనే ఉండిపోకుండా అప్పుడప్పుడు శరీరానికి ఎండ తగలనివ్వడం చాలా మంచిది. ఎందుకంటే ఇది ఎండలోనే ఉందండీ మరి! చదవండి👉🏾Vitamin D Deficiency: విటమిన్- డి లోపిస్తే అంతే ఇక..! ఆ హార్మోన్ ఉత్పత్తికి ఇది అవసరం! Vitamin C Deficiency: విటమిన్ ‘సి’ లోపిస్తే జరిగేది ఇది.. ఇవి తింటే మేలు! -
Milk Maker: కొబ్బరి, బాదం, సోయా పాలు.. ఇలా తయారు చేసుకోండి.. ధర ఎంతంటే!
కొబ్బరి, బాదం, సోయా పాలు వంటివి వంటల్లో చవులూరించే రుచినే కాదు ఒంట్లో ఆరోగ్యాన్నీ పెంపొందిస్తాయి. అలాంటి శ్రద్ధ, ఆసక్తి ఉన్న వారికోసమే ఈ డివైజ్. ఇది గింజలు, నట్స్ నుంచి పాలు తీసి పెడుతుంది. దీంట్లో బాదం లేదా కొబ్బరి లేదా సోయా(రాత్రి నానబెట్టి) వంటివి వేసుకుని.. సరిపడా నీళ్లు పోసుకుంటే.. జ్యూస్‌లా చేసిపెట్టేస్తుంది. చివరిగా టీ వడకట్టుకునే తొట్టెతో వడకట్టుకుంటే సరిపోతుంది. పైగా ఇందులో బ్రెడ్ రెసిపీ తయారు చేసుకోవడం, కాఫీ గింజలను పౌడర్ చేసుకోవడం.. వంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇది మగ్ మాదిరి ఉండే డివైజ్ కావడంతో వినియోగించడం చాలా సులభం. ధర 109 డాలర్లు- (రూ.8,347) చదవండి: Trendy Toaster: ఎన్నో రుచులను నిమిషాల్లో టోస్ట్ చేసుకోవచ్చు.. ధర రూ.3,733! -
వంట నూనెల ధరలు తగ్గాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంట నూనెల ధరలు తగ్గాయి. బ్రాండ్, నూనె రకాన్నిబట్టి గరిష్ట ధరపై 10–15 శాతం తగ్గిందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) సోమవారం ప్రకటించింది. ధరలు సవరించిన కంపెనీల జాబితాలో అదానీ విల్మర్ (ఫార్చూన్ బ్రాండ్), రుచి సోయా (మహాకోష్, సన్‌రిచ్, రుచి గోల్డ్, న్యూట్రెల్లా), ఇమామీ (హెల్తీ అండ్ టేస్టీ), జెమిని (ఫ్రీడమ్), బాంజ్ (డాల్డా, గగన్, చంబల్ బ్రాండ్స్) వంటివి ఉన్నాయి. అంతర్జాతీయంగా అధిక ధరల కారణంగా గత కొన్ని నెలలుగా దేశీయంగా వంట నూనెలు ప్రియం కావడం వినియోగదార్లతోపాటు ప్రభుత్వాలను కలవరపెడుతోంది. ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అనేకసార్లు శుద్ధి, ముడి వంట నూనెల దిగుమతి సుంకాలను తగ్గించింది. సరఫరాను పెంచడానికి లైసెన్స్ లేకుండా శుద్ధి చేసిన పామాయిల్‌ను దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం డిసెంబర్ 2022 వరకు వ్యాపారులను అనుమతించింది. ముడి పామాయిల్, కొన్ని ఇతర వ్యవసాయ వస్తువుల కొత్త డెరివేటివ్ ఒప్పందాలను ప్రారంభించడాన్ని మార్కెట్ నియంత్రణ సంస్థ నిషేధించింది. భారత్‌లో ఏటా 2.25 కోట్ల టన్నుల వంట నూనెల వినియోగం అవుతోంది. ఇందులో దిగుమతుల వాటా ఏకంగా 65 శాతం దాకా ఉంది. -
వెజ్ ఖీమా ఎప్పుడైనా ట్రై చేశారా? వెరైటీగా ఇలా చేయండి!
శాకాహారమైనా, మాంసాహారమైనా కూరలు వండే విధానాన్ని బట్టి రుచి మారుతుంటుంది. కూరల్లో వేసే మసాలాలతోపాటు, కూరగాయ ముక్కలను బట్టి కూడా రుచి పెరగడం, తగ్గడం జరుగుతుంది. పెద్దపెద్ద ముక్కలకంటే చిన్నగా ఉండే ఖీమా ముక్కల రుచి బావుంటుంది. కమ్మని ఖీమా వంటలు ఎలా వండాలో చూద్దాం... వెజ్ ఖీమా కావల్సిన పదార్థాలు ►క్యాలీఫ్లవర్ ముక్కలు – ఎనిమిది ►బీన్స్ – ఎనిమిది ►పుట్టగొడుగులు – ఎనిమది ►క్యారెట్ – ఒకటి ►ఉడికించిన బఠానీ – ముప్పావు కప్పు ►టొమోటోలు – రెండు ►ఉల్లిపాయ – ఒకటి ►పచ్చిమిర్చి – ఒకటి ►అల్లం – అరంగుళం ముక్క ►వెల్లుల్లి రెబ్బలు – మూడు ►యాలకులు – ఒకటి ►దాల్చిన చెక్క – అంగుళం ముక్క ►ధనియాలు – టీస్పూను ►పసుసు – అరటీస్పూను ►గరం మసాలా పొడి – అరటీస్పూను ►కారం – అరటీస్పూను ►ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు ►ఉప్పు రుచికి సరిపడా తయారీ విధానం ►ముందుగా క్యాలీఫ్లవర్, బీన్స్, పుట్టగొడుగులు, క్యారెట్ టొమోటో, పచ్చిమిర్చిని సన్నగా తరుక్కోవాలి. ►తరువాత అల్లం, వెల్లుల్లిని పేస్టు చేసుకోవాలి. ►వేడెక్కిన బాణలిలో ఆయిల్ వేసి యాలకులు, దాల్చిన చెక్క, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ►ఇవన్నీ వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు వేసి నిమిషం వేగిన తరువాత టొమోటో ముక్కలు, మసాలా పొడులు వేసి ఆయిల్ పైకి తేలేంతవరకు వేయించాలి. ►ఇప్పుడు తరిగిన కూరగాయ ముక్కలన్నింటిని, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మూతపెట్టి మగ్గనివ్వాలి. ►కూరగాయ ముక్కలు ఉడికిన తరువాత బఠానీ వేసి నీరంతా అయిపోయేంత వరకు ఉడికిస్తే వెజ్ ఖీమా రెడీ. చదవండి: Foods For Bone Health: అరటి, పాలకూర, డ్రై ఫ్రూట్స్, చేపలు, బొప్పాయి.. ఇవి తింటే.. సోయా మసాలా కావల్సిన పదార్థాలు ►మీల్ మేకర్ – 150 గ్రాములు ►ఆయిల్ – మూడు టేబుల్ స్పూన్లు ►బఠానీ – 200 గ్రాములు ►అల్లం పేస్టు – టీస్పూను ►వెల్లుల్లి పేస్టు – టీస్పూను ►టొమోటోలు – రెండు (సన్నగా తరగాలి) ►ఉల్లిపాయలు – రెండు (సన్నగా తరగాలి) ►కొత్తిమీర తరుగు – మూడు టేబుల్ స్పూన్లు ►గరం మసాలా – అరటీస్పూను ►ధనియాలపొడి – టీస్పూను ►ఉప్పు – టీస్పూను ►పసుపు – అర టీస్పూను ►కారం – అరటీస్పూను ►కసూరీ మేథి – టీస్పూను తయారీ విధానం ►ముందుగా మీల్‌మేకర్‌ను నీళ్లలో వేసి ఉడికించి, చల్లారాక ఖీమాలా తరగాలి. ►బాణలి వేడెక్కిన తరువాత ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ►తరువాత వెల్లుల్లి పేస్టు వేసి బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించి, అల్లం పేస్టు వేయాలి ►ఇవన్నీ వేగాక టొమోటో ముక్కలు వేసి మగ్గనిచ్చి, బఠానీ వేయాలి. ►బఠానీ మగ్గాక మీల్మేకర్ ఖీమా, కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు వేసి మూతపెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. ►తరువాత గరం మసాలా, కారం, పసుపు, కసూరీ మేథి, ధనియాల పొడి వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికిస్తే సోయామసాలా రెడీ. చదవండి: స్టీల్ కత్తి కంటే 3 రెట్లు పదునైందట! దేనితో తయారు చేశారో తెలుసా.. -
యార్డుకు కళొచ్చింది.
జైనథ్: మండలకేంద్రంలో మార్కెట్‌యార్డు ప్రా రంభమై మూడు దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు పత్తి కొనుగోలు చేయలేదు. గడిచిన నాలుగైదేళ్ల వరకూ కనీసం సోయా కొనుగోలు చేయలేని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం సోయాతోపాటు శనగలు, కందులు కూడా మార్కెట్లో కొనుగోలు చేస్తుండడంతో మార్కెట్‌కు ఓ కళ వచ్చింది. గతంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ అంతగా విజయవంతం కాలేదు. మండలకేంద్రంలో జిన్నింగ్‌లు లేకపోవడం, ట్రేడర్లు ఆసక్తి చూపకపోవడంతో కొనుగోలు జరగలేదు. ప్రస్తుతం చిన్న, సన్నకారు రైతుల నుంచి పత్తి కొనుగోళ్లు చేపడుతుండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పీఏసీఎస్ ద్వారా కొనుగోళ్లు.. మండలకేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం(పీఏసీఎస్), మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో యార్డులో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయితే కేవలం సన్నకారు, చిన్నకారు రైతులను ఉద్దేశించి మాత్రమే ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. చిన్న రైతులు తమ పత్తిని రోడ్ల వెంబడి ఉండే వ్యాపారుల వద్ద అమ్ముకొని మోసపోవద్దనే ఉద్దేశంతో ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో రైతులకు మార్కెట్ ధర లభించడమే కాకుండా రవాణా ఖర్చులు తగ్గడంతో ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ఇక్కడ పత్తి అమ్మేందుకు వచ్చిన రైతుల హమాలీ, దళారీ, రవాణా ఖర్చుల పేరిట ఎలాంటి అదనపు వసూళ్లు ఏవీ లేకపోవడంతో కలిసొస్తుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇవీ నిబంధనలు.. రైతులు పట్టాదార్ పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంక్ జిరాక్స్ పత్రాలు తీసుకు రావాలి. ఒక రోజు ఒక రైతు నుంచి 10 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతుంది. రోజువారీగా 100 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయబడుతుంది. చిన్న, సన్నకారు రైతుల నుంచి మాత్రమే కొనుగోలు చేయబడును. కౌలు రైతులు సంబంధిత ఏఈవో నుంచి పంట ధ్రువీకరణపత్రం తీసుకు రావాలి. తేమ 8శాతానికి మించకుండా ఉండాలి. -
రుచి సోయా రేసులో టాప్ బిడ్డర్‌గా అదానీ
న్యూఢిల్లీ: దివాళా ప్రక్రియను ఎదుర్కొంటున్న వంట నూనెల కంపెనీ రుచి సోయాను దక్కించుకునే రేసులో అదానీ గ్రూప్ టాప్ బిడ్డర్‌గా నిలిచిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రూ.6,000 కోట్లకు బిడ్ వేసిన అదానీ విల్మర్ అత్యధిక బిడ్ వేసిన కంపెనీగా నిలిచిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. రుచి సోయాను దక్కించుకోవడానికి పోటీ పడిన మరో కంపెనీ పతంజలి గ్రూప్ రూ.5,700 కోట్లకు బిడ్‌ను దాఖలు చేసింది. అయితే స్విస్ చాలెంజ్ పద్థతిలో పతంజలి గ్రూప్‌కు తన ఆఫర్‌ను మరింతగా పెంచే హక్కు ఉంటుంది. రుచి సోయా రుణ దాతల కమిటీ మంగళవారం బిడ్లను ఓపెన్ చేసింది. రుచి సోయా మొత్తం రూ.12,000 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. -
సో...యమ్మీ
శాకాహారులకు హై ప్రొటీన్ ఫుడ్ ఏదైనా ఉందంటే... అది సోయానే. రుచికి రుచి...శక్తికి శక్తి. సోయా వీట్ కుకీస్ కావలసినవి సోయాబీన్ పిండి – 1/2 కప్పు, గోధుమపిండి – 1/2 కప్పు, బటర్ – 1/2 కప్పు, పంచదార పొడి – 6 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా – 1/4 టీ స్పూన్, పిస్తా పలుకులు – 2 టేబుల్ స్పూన్స్. తయారి ఒక గిన్నెలో పంచదార పొడి, బటర్ వేసి 3, 4 నిమిషాల సేపు బాగా కలపాలి ∙మరొక గిన్నెలో సోయా పౌడర్, గోధుమ పిండి, యాలకుల పొడి, బేకింగ్ సోడా అన్నింటిని కలిపి బటర్, పంచదార కలిపిన మిశ్రమంలో వేసి బాగా కలపాలి ∙పిండిని ఉసిరికాయ సైజులో ఉండలుగా చేసుకొని అరచేతిలో ఒత్తుకోవాలి ∙రకరకాల షేప్స్‌లో కావాలంటే పిండిని మందపాటి చపాతీలా చేసుకుని బిస్కట్ మౌల్డ్‌తో షేప్ చేసుకోవచ్చు ∙ఈ కుకీస్ పైన తరిగిన పిస్తా పలుకులను అద్దుకోవాలి ∙ప్లేట్‌పై కొంచెం బటర్ రాసి తయారు చేసుకున్న కుకీస్‌ను పెట్టుకోవాలి ∙స్టౌ పైన మందపాటి పెనం పెట్టి వేడయ్యాక కుకీస్ ప్లేట్‌ను పెనంపై పెట్టి, వాటిపైన మూతపెట్టి 20 నిమిషాలు సిమ్‌లో ఉంచాలి ∙టూత్‌పిక్‌తో కుకీస్ మధ్యలో చెక్ చేయాలి. పిక్కు పిండి అంటుకోకుండా ఉంటే కుకీస్ రెడీ అయినట్టే. సోయా కుకుంబర్ పాన్కేక్ కావలసినవి తురిమిన కీరా – 1 కప్పు, సోయా పిండి – 1 కప్పు, బొంబాయి రవ్వ – 1/2 కప్పు, జీలకర్ర – 1 టీ స్పూన్, పచ్చిమిర్చి తరుగు – 2 టీ స్పూన్స్, కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్స్, వెన్న – 2 టేబుల్ స్పూన్స్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – రుచికి సరిపడా. తయారి ఒక గిన్నెలోకి తురిమిన కీరా, సోయాపిండి, బొంబాయి రవ్వ, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, సరిపడా ఉప్పు, గ్లాసు నీళ్లు పోసి మరీ పలుచగా కాకుండా గరిటె జారుగా కలుపుకోవాలి ∙స్టౌ పైన నాన్‌స్టిక్ పాన్ పెట్టి 1/2 టీ స్పూన్ వెన్న వేసి వేడయ్యాక గరిటెతో పిండిని వేసి చుట్టూ కొంచెం నూనె వేసి, తిప్పి రెండువైపులా బాగా సిమ్‌లో కాల్చుకోవాలి ∙గ్రీన్ చట్నీతో వేడిగా వేడిగా సర్వ్ చేస్తే బాగుంటుంది. సోయా చంక్ బిర్యానీ కావలసినవి బాస్మతి రైస్ – 1 కప్పు, నీరు – 2 కప్పులు, సోయా చంక్స్ – 1/2 కప్పు, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు తరుగు – 3 టేబుల్ స్పూన్స్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోట, బంగాళదుంప, క్యారెట్ – ఒక్కొక్కటి, బీన్స్ – 5, పచ్చి బఠానీ – 1/4 కప్పు, ఉప్పు – రుచికి సరిపడ, కారం – 3/4 టీ స్పూన్, పసుపు – 1/4 టీ స్పూన్, గరం మసాలా – 1 టీ స్పూన్, ధనియాల పొడి – 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి – 1/2 టీ స్పూన్, నిమ్మరసం – 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర, పుదీనా తరుగు – 4 టేబుల్ స్పూన్స్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – 1/2 అంగుళం ముక్క, లవంగాలు – 4, యాలకులు – 2, బిర్యానీ ఆకు – 1. తయారి బాస్మతి రైస్, సోయా చంక్స్‌ను విడివిడిగా కడిగి కనీసం 15 నిమిషాలు నానబెట్టుకోవాలి ∙స్టౌ పైన కుక్కర్ పెట్టి నూనె వేసి వేడయ్యాక లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోట, ఉప్పు వేసి బాగా వేగనివ్వాలి ∙ఇప్పుడు తరిగిన బంగాళ దుంప, క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ, పసుపు, కారం, గరం మసాలా, ధనియాలపొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకోవాలి ∙ముందుగా నానబెట్టుకున్న సోయా చంక్స్‌ను కూడా వేసి బాగా వేగనివ్వాలి ∙కూరగాయ ముక్కలు అన్నీ వేగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసి 2 నిమిషాలు వేగనివ్వాలి ∙ఉప్పు అడ్జస్ట్ చేసుకుని నీరు పోసి మూత పెట్టి 1 లేదా 2 విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి ∙కుక్కర్ ప్రెజర్ పోయాక మూత తీసి పైన నెయ్యి వేసి వేడివేడిగా సర్వ్ చేయండి. సోయా కీమా మటర్ కావలసినవి సోయా పలుకులు (గ్రాన్యూల్స్) – 1 కప్పు, పాలు – 2 కప్పులు, ఉల్లిపాయలు – 2, పచ్చిమిర్చి – 2, టమోట – 1, బఠానీ – 1/4 కప్పు, అల్లం తరుగు – 1 టీ స్పూన్, వెల్లుల్లి – 2 టీ స్పూన్స్, ఉప్పు – రుచికి సరిపడ, పసుపు – 1/4 టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, జీలకర్ర పొడి – 1 టీ స్పూన్, గరం మసాలా – 1/2 టీ స్పూన్, కొత్తిమీర తరుగు – గుప్పెడు, పుదీనా తరుగు – గుప్పెడు, నూనె – 6 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం – 1 టీ స్పూన్. తయారి సోయా గ్రాన్యూల్స్ గోరువెచ్చని నీటిలో లేదా పాలలో అరగంటసేపు నానబెట్టుకోవాలి ∙స్టౌ పైన మందపాటి బాణలి పెట్టి నూనె వేసి వేడయ్యాక అల్లం, వెల్లుల్లి తరుగు వేసి పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చేలా వేయించుకోవాలి కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసి కాసేపు వేగిన తర్వాత ఉడికిన బఠానీ కూడా వేసి వేయించుకోవాలి ∙ఇప్పుడు వరుసగా పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి చివరిగా సన్నగా తరిగిన టమోటా వేసి పచ్చి వాసన పోయేలా వేయించుకోవాలి ∙చివరగా పాలల్లో నానబెట్టిన సోయా క్రంచెస్ను వేసి బాగా కలిపి మూతపెట్టి పది నిమిషాలు ఉడికించుకుంటే వేడి వేడి సోయా కీమా మటర్ రెడీ! ∙ఉల్లిపాయ, పచ్చిమిర్చి, నిమ్మకాయ ముక్కలతో గార్నిష్ చేసి రోటీతో వడ్డించండి. – సేకరణ: జ్యోతి గొడవర్తి -
సోయా పంటలో పొంచి ఉన్న చీడపీడలు
తగు సమయంలో గుర్తిస్తేనే దిగుబడులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకోసం ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో సోయా పంటను ఖరీఫ్ ఆరంభంలో కురిసిన వర్షాలతో దాదాపుగా లక్ష హెక్టార్ల వీస్తీర్ణంలో రైతులు పంట విత్తుకున్నారు. 35 రోజుల నుంచి 45 రోజుల దశలో ఉంది ప్రస్తుతం ఎదిగే దశకు చేరుకుంది. ఈ పంటలో వివిధ రకాల చీడపురుగులు ఆశించి దిగుబడులను నష్టపర్చే ప్రమాదం ఉంది. దీనికోసం సరైన సమయంలో సస్యరక్షణ చర్యలను చేపట్టి దిగుబడులను కాపాడుకోవాల్సిన అసవరం ఉందని ఏరువాక కోర్డినేటర్ శాస్త్రవేత్త రాజశేఖర్ వివరిస్తున్నారు. అయితే ముందుగా పంటను ఆశించే వివిధ రకాల చీడపీడల గురించి తెలుసుకుందాం. పల్లాకు తెగులు.. ఆకు పచ్చని రంగులో కళకళలాడాల్సిన సోయా పంట పసుపు రంగులోకి మారుతుంది. పల్లాకు తెగులు సోకిన సోయా పంట ఆకుల మీద పసుపు పచ్చని పొర ఏర్పడి మొత్తం ఆకులు పసుపు రంగులోకి మారతాయి. ఈ తెగులు సోకిన మొక్కలలో కాయలు ఏర్పడవు. తెగులు కారక వైరస్ తెల్ల దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. – దీన్ని నివారించేందుకు ముందుస్తుగా రైతులు 15 గ్రాముల కార్బోనల్ఫాన్ లేదా 3 గ్రాముల మిడా క్రోసిన్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. – వ్యాధి సోకిన మొక్కలకు వెంటనే పొలంలో నుంచి తీసి వేసి కాల్చివేయాలి. – 40 శాతం తెగులు సోకిన పంటకు తెగులు మరింత వ్యాప్తి చెందకుండా, ఉన్న వరకు కాపాడుకునేందుకు పంపునకు 5 గ్రాముల ఎసిటిమిఫ్రైడ్ లేదా 24 మి.లీ ట్రైజోఫాస్ను పిచికారీ చేసుకోవాలి. + పంటకు సోకే పల్లాకు తెగులు(ఎల్లో మొజాయిక్) తెల్లదోమ అను వైరస్ కారణంతో సోకుతుంది. విత్తన శుద్ధి చేయకపోవడం వంటి కారణాలతో సోయా పంటను నాశనం జరుగుతుంది. రసం పీల్చు పురుగులు (తామర పురుగులు, తెల్ల, పచ్చదోమలు, పేనుబంక) చిన్న పరిమాణంలో ఉండి ఆకుల నుంచి, లేత చిగురుల నుంచి లేత కాండం నుంచి రసాన్ని పీల్చి పంటకు నష్టం కలిగిస్తాయి. ఆకుల అడుగు భాగం నుంచి రసం పీల్చడం వలన ఆకులు పసుపు, గోధుమ రంగుకు మారి, మొక్క ఎదుగుదల లోపిస్తుంది. నివారణ.. తామర పురుగుల ద్వారా మొవ్వ కుళ్లు, తెల్ల దోమల వల్ల మొజాయిక్ తెగుళ్లు వ్యాప్తి చెందుతాయి. రసం పీల్చు పురుగుల నివారణకు పొలంలో పసుపు, నీలి రంగు జిగురు ఆకర్షక ఎరలను ఉంచాలి. వీటికి పురుగులు ఆకర్షించబడి జిగురుకు అతుక్కుని చనిపోతాయి. ఉధతి ఎక్కువగా ఉంటే ఎసిఫేట్ 1.5గ్రా. (లేదా) డైమిథోయేట్ 2 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఆకుతినే పరుగులు దాసరి పురుగు/ నామాల పురుగు.. వీటి రెక్కల పురుగు వెనక జత రెక్కల మధ్యలో తెల్లని చారలు ఉండి, ముదురు గోధుమల రంగు చుక్కలు వెలుపలి అంచువెండి ఉంటాయి. మీద రెక్కలు లేత గోధుమ రంగులో ఉంటాయి. ఇవి ఆకులపై గుడ్లను ఉంచుతాయి. ఇవి పొదిగి లద్దె పురుగులుగా మారి ఆకులను గీకి తింటాయి. ముదిరిన లద్దె పురుగులు ఆకులకు రంధ్రాలు చేసి తింటాయి. బాగా పెరిగిన పురుగులు భూమిలో గాని, ఆకులలో గాని కోశస్థ దశలుగా రూపాంతరం చెందుతాయి. నివారణ మొదటి దశ లార్వాలను గుర్తించిన వెంటనే వేపనూనె 5 మి.లీ/లీ పిచికారీ చేయాలి – బాక్టీరియా సంబంధిత మందులు (డైపెల్)ను 400 గ్రామ/ఎకరానికి పిచికారీ చేయాలి. – పెద్ద పురుగులను ఏరి తినేందుకు వీలుగా పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. ఎకరానికి 10 చొప్పున అమర్చాలి. – పురుగు ఉధతి ఎక్కువగా ఉంటే మోనోక్రోటోఫాస్ 1.6మీ.లీ./లీ. లేదా క్లోరిపైరిఫాస్ 2.0 మి.లీ/లీ. మందును పిచికారి చేయాలి. పొగాకు లద్దె పురుగు వీటి రెక్కల పురుగులు ఆకుల మీద సమూహాలుగా గుడ్లను ఉంచుతాయి. వీటి నుంచి పిల్ల పురుగులు పొదిగి ఆకుల మీద పత్ర హరితాన్ని గోకి తింటాయి. ముదిరిన లద్దె పురుగులు ఆకులకు రంధ్రాలు చేసి ఆకులను పూర్తిగా జల్లెడగా మారుస్తాయి. లేత ఆకులను పూర్తిగా తినేస్తాయి. పువ్వులను, కాయలను కూడా ఇవి నష్టపరుస్తాయి. ఇవి తెలుపు నుంచి బూడిద వర్ణంలో ఉండి నల్లటి మచ్చలను కలిగి ఉంటాయి. ఇవి రాత్రిపూట మాత్రమే పంట మీద తింటూ, పగటి వేళల్లో మొక్క మొదళ్ల వద్ద లేదా భూమి నెర్రెలలో దాక్కొని ఉంటాయి. బాగా ఎదిగిన లద్దె పురుగలు కోశస్థ దశలోకి మారతాయి. నివారణ: – గుడ్ల సముదాయం కనిపించిన ఆకులను గుడ్లతో సహా నాశనం చేయాలి. – లేత లార్వాల సముదాయం ఉన్న ఆకులను గమనించి కత్తిరించి దూరంగా నాశనం చేయాలి – తొలి దశలో వేపనూనె 5 మి.లీ/ లీ లేదా బ్యాక్టీరియా సంబంధిత మందులు (బి.టి) డైపెల్ను 2 గ్రా/లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి. – పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి ‘‘ఖీ’’ ఆకారపు కర్రలను ఎకరానికి 10 చొప్పున ఉంచాలి. – మూడో దశ దాటిన పురుగు (10–12సెం.మీ.) అదుపు చేయడానికి విషపు ఎరలను పొలంలో ఉంచాలి. (ఎకరానికి 10 కిలోలు తవుడు, 2కిలోలు బెల్లం, 500–750 మి.లీ. క్లోరిౖఫైరిఫాస్ మందు కలిపిన మిశ్రమానికి ఉండలు చేసి సాయంత్రం వేళల్లో పొలమంతా వెదజల్లాలి. – పురుగు ఉధతి బాగా ఎక్కువగా ఉంటే– థయోడికార్డ్ 1.5 గ్రా/లీ. లేదా నొవాల్యురాన్ 1.0 మి.లీ./లీ లేదా ఎమమెక్టిన్బెంజోయేట్ 0.5 గ్రా/లీ. మందును పిచికారి చేయాలి. – పురుగు మందులను సాయంత్రం వేళల్లో పిచికారి చేస్తే నివారణ తొందరగా జరిగి మంచి ఫలితం ఉంటుంది. కాండం తినే పురుగులు: కాండపు ఈగ తల్లి ఈగలు నలుపు రంగులో మెరుస్తూ చురుగ్గా తిరుగుతూ ఉంటాయి. ఇవి లే ఆకుల మీద, చిన్న గుంటలు చేసి గుడ్లను ఉంచుతాయి. వీటి నుండి పొదిగిన లార్వాలు దగ్గరలోని ఆకు కాడల ద్వారా కాండలంలోనికి రంధ్రం చేసి ప్రవేశిస్తాయి. కాండం లోపలి పదార్థాన్ని మొత్తం తినడం వల్ల మొక్కలు వడలి ఎండి చనిపోతాయి. ఇవి కాండం నుండి వేర్ల వరకూ కూడా తింటాయి. లార్వా నుండి తల్లి పురుగు కాండానికి రంధ్రం చేసి బయటకు వస్తుంది. వడలిన మొక్కల కాండాలను కత్తిరించి చూస్తే లోపల చిన్న పసుపు రంగు లార్వా కనిపిస్తుంది. లార్వా వదలిన వ్యర్థ పదార్థం కూడా కాండంలో ఉండడం గమనించవచ్చు. ఈ పురుగు వల్ల పంటకు కనీసం 20–25శాతం నష్టం వాటిల్లుతంది. నివారణ: తొలి దశలో రక్షణ కోసం ఫోరేట్ 10గ్రా. లేదా కార్థోప్యూరాన్ 3 గ్రా. గుళికలను పొలంలో చల్లుకోవాలి. పైరుపై ఆశించినపుడు నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ./లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా/లీ. లేదా డైమిథోయేట్ 2 మి.లీ./లీ. నీటికి కలిపి పిచికారీ చేయాలి. పెంకు పురుగు/ కాండం తొల్చే పురుగు.. దీని వల్ల పంటకు సుమారుగా 40–50 శాతం నష్టం వాటిల్లుతుంది. ఈ పురుగు జూలై నుంచి అక్టోబర్ వరకు ఆశిస్తుంది. ముందుగా ఆడ పెంకు పురుగు కాండం మీద 10 సెం.మీ. దూరంలో కాండం చుట్టూ రంధ్రాలు చేస్తుంది. దీనివల్ల చిగురు భాగానికి పోషకాలు, నీరు అందక వడలి ఎండిపోతుంది. ఇలా చేసిన రంధ్రాల ద్వారా గుడ్లను కాండంలో ఉంచుతుంది. ఈ గుడ్లు పొదిగి లార్వాలు కాండాన్ని తొలిచి తినడం మొదలు పెడతాయి. నివారణ – చిగురులు ఎండిపోతున్న మొక్కలను పీకి నాశనం చేయడం వల్ల పురుగు వ్యాప్తిని కొంతవరకు అరికట్టవచ్చు. – తొలి దశలో కార్థోఫ్యూరాన్గుళికలు చల్లుకోవడం వల్ల కొంతవరకు తల్లి పురుగులను అదుపులో ఉండవచ్చు. – పైరుపై పురుగు ఆశించినట్లయితే, క్లోరిఫైరిఫాస్ 2 మి.లీ./లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ./లీ. లేదా ట్రైజోఫాస్ 2.0 మి.లీ./లీ. నీటిని కలిపి పిచికారీ చేయాలి.