శాకాహారమైనా, మాంసాహారమైనా కూరలు వండే విధానాన్ని బట్టి రుచి మారుతుంటుంది. కూరల్లో వేసే మసాలాలతోపాటు, కూరగాయ ముక్కలను బట్టి కూడా రుచి పెరగడం, తగ్గడం జరుగుతుంది. పెద్దపెద్ద ముక్కలకంటే చిన్నగా ఉండే ఖీమా ముక్కల రుచి బావుంటుంది. కమ్మని ఖీమా వంటలు ఎలా వండాలో చూద్దాం...
వెజ్ ఖీమా
కావల్సిన పదార్థాలు
►క్యాలీఫ్లవర్ ముక్కలు – ఎనిమిది
►బీన్స్ – ఎనిమిది
►పుట్టగొడుగులు – ఎనిమది
►క్యారెట్ – ఒకటి
►ఉడికించిన బఠానీ – ముప్పావు కప్పు
►టొమోటోలు – రెండు
►ఉల్లిపాయ – ఒకటి
►పచ్చిమిర్చి – ఒకటి
►అల్లం – అరంగుళం ముక్క
►వెల్లుల్లి రెబ్బలు – మూడు
►యాలకులు – ఒకటి
►దాల్చిన చెక్క – అంగుళం ముక్క
►ధనియాలు – టీస్పూను
►పసుసు – అరటీస్పూను
►గరం మసాలా పొడి – అరటీస్పూను
►కారం – అరటీస్పూను
►ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు
►ఉప్పు రుచికి సరిపడా
తయారీ విధానం
►ముందుగా క్యాలీఫ్లవర్, బీన్స్, పుట్టగొడుగులు, క్యారెట్ టొమోటో, పచ్చిమిర్చిని సన్నగా తరుక్కోవాలి.
►తరువాత అల్లం, వెల్లుల్లిని పేస్టు చేసుకోవాలి.
►వేడెక్కిన బాణలిలో ఆయిల్ వేసి యాలకులు, దాల్చిన చెక్క, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి.
►ఇవన్నీ వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు వేసి నిమిషం వేగిన తరువాత టొమోటో ముక్కలు, మసాలా పొడులు వేసి ఆయిల్ పైకి తేలేంతవరకు వేయించాలి.
►ఇప్పుడు తరిగిన కూరగాయ ముక్కలన్నింటిని, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మూతపెట్టి మగ్గనివ్వాలి.
►కూరగాయ ముక్కలు ఉడికిన తరువాత బఠానీ వేసి నీరంతా అయిపోయేంత వరకు ఉడికిస్తే వెజ్ ఖీమా రెడీ.
చదవండి: Foods For Bone Health: అరటి, పాలకూర, డ్రై ఫ్రూట్స్, చేపలు, బొప్పాయి.. ఇవి తింటే..
సోయా మసాలా
కావల్సిన పదార్థాలు
►మీల్ మేకర్ – 150 గ్రాములు
►ఆయిల్ – మూడు టేబుల్ స్పూన్లు
►బఠానీ – 200 గ్రాములు
►అల్లం పేస్టు – టీస్పూను
►వెల్లుల్లి పేస్టు – టీస్పూను
►టొమోటోలు – రెండు (సన్నగా తరగాలి)
►ఉల్లిపాయలు – రెండు (సన్నగా తరగాలి)
►కొత్తిమీర తరుగు – మూడు టేబుల్ స్పూన్లు
►గరం మసాలా – అరటీస్పూను
►ధనియాలపొడి – టీస్పూను
►ఉప్పు – టీస్పూను
►పసుపు – అర టీస్పూను
►కారం – అరటీస్పూను
►కసూరీ మేథి – టీస్పూను
తయారీ విధానం
►ముందుగా మీల్‌మేకర్‌ను నీళ్లలో వేసి ఉడికించి, చల్లారాక ఖీమాలా తరగాలి.
►బాణలి వేడెక్కిన తరువాత ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి.
►తరువాత వెల్లుల్లి పేస్టు వేసి బ్రౌన్ కలర్‌లోకి మారేంత వరకు వేయించి, అల్లం పేస్టు వేయాలి
►ఇవన్నీ వేగాక టొమోటో ముక్కలు వేసి మగ్గనిచ్చి, బఠానీ వేయాలి.
►బఠానీ మగ్గాక మీల్‌మేకర్ ఖీమా, కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు వేసి మూతపెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి.
►తరువాత గరం మసాలా, కారం, పసుపు, కసూరీ మేథి, ధనియాల పొడి వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికిస్తే సోయామసాలా రెడీ.
చదవండి: స్టీల్ కత్తి కంటే 3 రెట్లు పదునైందట! దేనితో తయారు చేశారో తెలుసా..
Comments
Please login to add a commentAdd a comment