vegitable
-
అత్యంత ఖరీదైన వెజిటేబుల్ ఇదే...ధర తెలిస్తే కళ్లు చెదరాల్సిందే
ప్రభుత్వం కాస్త ధరలు పెంచితే చాలు ధరలు ఆకాశాన్నంటాయి.. సామాన్యుడి నడ్డి విరిచేశారంటూ మనం గగ్గోలు పెట్టేస్తాం. వాస్తవానికి చౌకగా దొరికే కాయగూరలు సైతం ఒక్కోసారి కొనేందకు భారంగా ఉండే విధంగా ధర పలుకుతుంటాయి. అధిక వర్షాల కారణంగానో లేక పెట్రోల్ ధరలు పెరగడం వల్లనో కాయగూరల ధరలు పెరిగిపోతుంటాయి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో సామాన్యుడే కాకుండా ఓ మోస్తారుగా డబ్బున్నవాడు సైతం కాస్త వెనకడుగు వేస్తాడు. అయిన కాయగూరలు మహా అయితే కిలో సుమారు రూ.50 నుంచి 100లోపే పలుకుతుంది. కానీ ఇక్కడొక కాయగూర ధర వింటే కచ్చితంగా నోరెళ్ల బడతారు. వివర్లాకెళ్తే...ఈ కాయగూరని కొనాలంటే.. ఒక కిలోకి సుమారు రూ.లక్ష రూపాయాల పైనే వెచ్చించాల్సిందే. వాస్తవానికి ఇంత ఖరీదైన కాయగూరలు గురించి ఇప్పటి వరకు ఎవరు విని ఉండే అవకాశం లేదు. ఇంత ధర పలికే కాయగూర సామాన్యుడే కాదు ధనవంతుడు కూడా కొనేందుకు ఆలోచిస్తాడు. ఇంతకీ ఏంటి ఈ కాయగూరలో ఉన్న ప్రత్యేకత? ఎందుకింత ధర అంటే...ఈ కాయగూర పేరు "హాప్ షూట్స్". ఈ కాయగూరల పువ్వులను హాప్ కోన్స్ అంటారు. వీటిని బీర్ తయారీలో ఉపయోగిస్తారు. మిగిలిని కొమ్మలను కూరగాయాలుగా వాడుకుంటారు.ఈ కాయగూర మొక్క కాండాన్ని కూడా ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఇటీవలే ఇప్పుడిప్పుడే ఈ కాయగూరలను తినేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాదు ఈ కాయగూరని బిహార్‌లోని ఒక యువకుడు పండిస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హాప్ షూట్స్‌ని భారత్‌లోని బిహార్‌కి చెందిన తొలి యువ రైతు అమ్రేష్ సింగ్ దీన్ని సాగు చేస్తుండటం విశేషం. (చదవండి: ఆ చిన్నారికి నాలుగు చేతులు, నాలుగు కాళ్లు: వీడియో వైరల్) -
వెజ్ ఖీమా ఎప్పుడైనా ట్రై చేశారా? వెరైటీగా ఇలా చేయండి!
శాకాహారమైనా, మాంసాహారమైనా కూరలు వండే విధానాన్ని బట్టి రుచి మారుతుంటుంది. కూరల్లో వేసే మసాలాలతోపాటు, కూరగాయ ముక్కలను బట్టి కూడా రుచి పెరగడం, తగ్గడం జరుగుతుంది. పెద్దపెద్ద ముక్కలకంటే చిన్నగా ఉండే ఖీమా ముక్కల రుచి బావుంటుంది. కమ్మని ఖీమా వంటలు ఎలా వండాలో చూద్దాం... వెజ్ ఖీమా కావల్సిన పదార్థాలు ►క్యాలీఫ్లవర్ ముక్కలు – ఎనిమిది ►బీన్స్ – ఎనిమిది ►పుట్టగొడుగులు – ఎనిమది ►క్యారెట్ – ఒకటి ►ఉడికించిన బఠానీ – ముప్పావు కప్పు ►టొమోటోలు – రెండు ►ఉల్లిపాయ – ఒకటి ►పచ్చిమిర్చి – ఒకటి ►అల్లం – అరంగుళం ముక్క ►వెల్లుల్లి రెబ్బలు – మూడు ►యాలకులు – ఒకటి ►దాల్చిన చెక్క – అంగుళం ముక్క ►ధనియాలు – టీస్పూను ►పసుసు – అరటీస్పూను ►గరం మసాలా పొడి – అరటీస్పూను ►కారం – అరటీస్పూను ►ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు ►ఉప్పు రుచికి సరిపడా తయారీ విధానం ►ముందుగా క్యాలీఫ్లవర్, బీన్స్, పుట్టగొడుగులు, క్యారెట్ టొమోటో, పచ్చిమిర్చిని సన్నగా తరుక్కోవాలి. ►తరువాత అల్లం, వెల్లుల్లిని పేస్టు చేసుకోవాలి. ►వేడెక్కిన బాణలిలో ఆయిల్ వేసి యాలకులు, దాల్చిన చెక్క, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ►ఇవన్నీ వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు వేసి నిమిషం వేగిన తరువాత టొమోటో ముక్కలు, మసాలా పొడులు వేసి ఆయిల్ పైకి తేలేంతవరకు వేయించాలి. ►ఇప్పుడు తరిగిన కూరగాయ ముక్కలన్నింటిని, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మూతపెట్టి మగ్గనివ్వాలి. ►కూరగాయ ముక్కలు ఉడికిన తరువాత బఠానీ వేసి నీరంతా అయిపోయేంత వరకు ఉడికిస్తే వెజ్ ఖీమా రెడీ. చదవండి: Foods For Bone Health: అరటి, పాలకూర, డ్రై ఫ్రూట్స్, చేపలు, బొప్పాయి.. ఇవి తింటే.. సోయా మసాలా కావల్సిన పదార్థాలు ►మీల్ మేకర్ – 150 గ్రాములు ►ఆయిల్ – మూడు టేబుల్ స్పూన్లు ►బఠానీ – 200 గ్రాములు ►అల్లం పేస్టు – టీస్పూను ►వెల్లుల్లి పేస్టు – టీస్పూను ►టొమోటోలు – రెండు (సన్నగా తరగాలి) ►ఉల్లిపాయలు – రెండు (సన్నగా తరగాలి) ►కొత్తిమీర తరుగు – మూడు టేబుల్ స్పూన్లు ►గరం మసాలా – అరటీస్పూను ►ధనియాలపొడి – టీస్పూను ►ఉప్పు – టీస్పూను ►పసుపు – అర టీస్పూను ►కారం – అరటీస్పూను ►కసూరీ మేథి – టీస్పూను తయారీ విధానం ►ముందుగా మీల్‌మేకర్‌ను నీళ్లలో వేసి ఉడికించి, చల్లారాక ఖీమాలా తరగాలి. ►బాణలి వేడెక్కిన తరువాత ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ►తరువాత వెల్లుల్లి పేస్టు వేసి బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించి, అల్లం పేస్టు వేయాలి ►ఇవన్నీ వేగాక టొమోటో ముక్కలు వేసి మగ్గనిచ్చి, బఠానీ వేయాలి. ►బఠానీ మగ్గాక మీల్మేకర్ ఖీమా, కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు వేసి మూతపెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. ►తరువాత గరం మసాలా, కారం, పసుపు, కసూరీ మేథి, ధనియాల పొడి వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికిస్తే సోయామసాలా రెడీ. చదవండి: స్టీల్ కత్తి కంటే 3 రెట్లు పదునైందట! దేనితో తయారు చేశారో తెలుసా.. -
ఆకుకూరలు అమ్ముతున్న సర్పంచ్
సాక్షి, మహబూబ్‌నగర్: ఈ చిత్రంలో ఆకుకూరలు విక్రయిస్తున్న మహిళ మహబూబాబాద్ జిల్లా రేగడి తండా గ్రామ పంచాయతీకి ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ గుగులోతు లక్ష్మీ రామచంద్రు. జీవనోపాధికోసం తమ కుటుంబానికున్న భూమిలో ఆకుకూరలను పండించి ప్రతీరోజు ఉదయం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌కు వాటిని తీసుకొచ్చి విక్రయిస్తోంది. ఇదేమిటని అడిగితే ఊరికి పెదై్దతేనేం ఉపాధికి ఢోకా లేదని రూలేమీ లేదుగా!..ప్రభుత్వం నుంచి అందే అరకొర జీతం బండి పెట్రోల్ ఖర్చులకు కూడా సరిపోవడం లేదయ్యా.. అందుకే మన పని మనం చేసుకుంటే తప్పేముందని బదులిచ్చింది. శ్రమ జీవన సౌందర్యమంటే ఇదేనేమో కదూ!! -
శ్రీవారి అన్నదానానికి కూరగాయల వితరణ
లబ్బీపేట : స్వరాజ్య మైదానంలో తిరుమల తిరుపతి దేవస్థానం నమూనా దేవాలయంలో ప్రతిరోజూ లక్ష మంది భక్తులకు స్వామివారి అన్నప్రసాదం అందిస్తున్నామని, వాటికి అవసరమైన కూరగాయలను దాతలు ఉచితంగా అందించడం శుభసూచికమని రాష్ట్ర సమాచార ఫౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునా«థరెడ్డి అన్నారు. మండవ కుటుంబరావు ఆధ్వర్యంలో అరవపల్లి శేషసాయివర్మ, కావ్య, అరవపల్లి ఆధిత్య, మండవ సస్య, మండవ కాళీ అన్నపూర్ణ ఆధ్వర్యంలో రూ. 3లక్షల విలువైన కూరగాయలను గురువారం సరఫరా చేశాారు. ఈ లారీని బృందావన కాలనీలోని ఎ కన్వెన్షన్ సెంటర్లో మంత్రి పల్లె రఘునాథరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో తీతీదే∙ఆలయ నమూనా ఏర్పాటు చేసామని, ఆ ఆలయంలో ప్రతిరోజూ లక్ష మంది భక్తులకు అన్నదానం చేస్తున్నామన్నారు. అన్నదానానికి దాతలు కూరగాయలు ఉచితంగా అందచేయడం అభినందనీయమని, దీనిని మిగిలిన వారు స్పూర్తిగా తీసుకోవాలని కోరారు. అధికారులకు కూరగాయలు అందచేతః దాతలు అందించిన కూరగాయలను తితిదే కల్యాణ మండపంలోని అన్నప్రసాదం ట్రస్ట్ ప్రత్యేక అధికారిణి పి.చెంచులక్ష్మికి మండవ కుటుంబరావు అందించారు. ఈ సందర్భంగా చెంచులక్ష్మి మాట్లాడుతూ స్వామివారి ప్రసాదంలో భాగంగా టమాటా రైస్, పులిహోర అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీటీడీ క్యాటరింగ్ ఆఫీసర్ జీఎల్ఎన్ శాస్త్రి పాల్గొన్నారు. ఫొటో 11 విఐఇ 41– తితిదే అన్నదానానికి కూరగాయల లారీని జెండా ఊపి ప్రారంభిస్తున్న పల్లె రఘునాథరెడ్డి , మండవ కుటుంబరావు తదితరులు