
ప్రభుత్వం కాస్త ధరలు పెంచితే చాలు ధరలు ఆకాశాన్నంటాయి.. సామాన్యుడి నడ్డి విరిచేశారంటూ మనం గగ్గోలు పెట్టేస్తాం. వాస్తవానికి చౌకగా దొరికే కాయగూరలు సైతం ఒక్కోసారి కొనేందకు భారంగా ఉండే విధంగా ధర పలుకుతుంటాయి. అధిక వర్షాల కారణంగానో లేక పెట్రోల్ ధరలు పెరగడం వల్లనో కాయగూరల ధరలు పెరిగిపోతుంటాయి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో సామాన్యుడే కాకుండా ఓ మోస్తారుగా డబ్బున్నవాడు సైతం కాస్త వెనకడుగు వేస్తాడు. అయిన కాయగూరలు మహా అయితే కిలో సుమారు రూ.50 నుంచి 100లోపే పలుకుతుంది. కానీ ఇక్కడొక కాయగూర ధర వింటే కచ్చితంగా నోరెళ్ల బడతారు.
వివర్లాకెళ్తే...ఈ కాయగూరని కొనాలంటే.. ఒక కిలోకి సుమారు రూ.లక్ష రూపాయాల పైనే వెచ్చించాల్సిందే. వాస్తవానికి ఇంత ఖరీదైన కాయగూరలు గురించి ఇప్పటి వరకు ఎవరు విని ఉండే అవకాశం లేదు. ఇంత ధర పలికే కాయగూర సామాన్యుడే కాదు ధనవంతుడు కూడా కొనేందుకు ఆలోచిస్తాడు. ఇంతకీ ఏంటి ఈ కాయగూరలో ఉన్న ప్రత్యేకత? ఎందుకింత ధర అంటే...ఈ కాయగూర పేరు "హాప్ షూట్స్". ఈ కాయగూరల పువ్వులను హాప్ కోన్స్ అంటారు. వీటిని బీర్ తయారీలో ఉపయోగిస్తారు.
మిగిలిని కొమ్మలను కూరగాయాలుగా వాడుకుంటారు.ఈ కాయగూర మొక్క కాండాన్ని కూడా ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఇటీవలే ఇప్పుడిప్పుడే ఈ కాయగూరలను తినేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాదు ఈ కాయగూరని బిహార్‌లోని ఒక యువకుడు పండిస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హాప్ షూట్స్‌ని భారత్‌లోని బిహార్‌కి చెందిన తొలి యువ రైతు అమ్రేష్ సింగ్ దీన్ని సాగు చేస్తుండటం విశేషం.
(చదవండి: ఆ చిన్నారికి నాలుగు చేతులు, నాలుగు కాళ్లు: వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment