బిహార్‌లో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహ వేడుకలో వధువరుల పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతోంది. బంధవులంతా ఆనందోత్సహాలతో వేడుకను తిలకిస్తున్నారు. ఇక దండలు మార్చుకుంటే పెళ్లి తంతు ముగిసిపోతుందనంగా.. వరుడు అర్థాంతరంగా పెళ్లిని ఆపించేశాడు. తాను ఒకరిని ప్రేమించానంటూ పెద్ద బాంబు పేల్చాడు. దీంతో అక్కడ ఉన్న బంధువులందరికీ ఒక్క క్షణం ఏ జరుగుతుందో అర్థం కాలేదు. తీరా చూస్తే.. తాను వధువు చెల్లిని ఇష్టపడ్డానంటూ ఆమెనే పెళ్లి చేసుకుంటానని మరో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం తలెత్తింది.
అన్నిట్లకంటే బిగ్ ట్విస్ట్ ఏంటంటే వధువు చెల్లికి, వరుడుకి ముందునుంచే పరిచయముందని, ఆమె పరీక్షలు పూర్తి అయ్యాక పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇంకో జుగప్సకరమైన ట్విస్ట్ ఏంటంటే వధువు చెల్లి తన అక్క రింకూని పెళ్లి చేసుకుంటే భవనంపై నుంచి దూకేస్తానని చెప్పిందని, అందువల్ల తననే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు వరుడు. దీంతో అక్కడ వాతావరణమంతా ఒక్కసారిగా ఘర్షణగా మారిపోయింది. బంధువులు పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరుపక్షాలకు సద్ది చెప్పారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను ప్రేమికులను ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు.
(చదవండి: కారు కింద 15 అడుగులు భారీ కింగ్ కోబ్రా..పట్టుకున్న తీరు చూస్తే..)
Comments
Please login to add a commentAdd a comment