Viral: Bride Refuses To Marry At Last Minute, Says She Looks Older In Bihar Bhagalpur - Sakshi
Sakshi News home page

నా కలర్‌ ఏంటి.. ఆయన ఏజ్‌ ఎంత.. లాస్ట్‌లో ట్విస్ట్‌ ఇచ్చిన వధువు

May 17 2023 8:02 PM | Updated on May 17 2023 8:26 PM

Bride Refuses To Marry At Last Minute In Bihar Bhagalpur - Sakshi

వారిద్దరికీ పెళ్లి నిశ్చయమైంది. కాసేపట్లో పెళ్లి మండపంలో వివాహం జరుగనుంది. వందల సంఖ్యలో బంధువులు వేడుకకు హాజరయ్యారు. తీరా.. తాళికట్టే సమయానిక వరుడికి వధువు ఊహించని షాకిచ్చింది. వరుడు నల్లగా ఉన్నాడని, వయసులో తనకంటే చాలా పెద్దవాడిలా కనిపిస్తున్నాడని చెప్పి వివాహానికి నిరాకరించింది. దీంతో, అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ షాకింగ్‌ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. భగల్‌పూర్‌లోని కహల్గావ్‌లో స్థానికంగా నివసించే వినోద్ మండల్ కుమార్తె కిట్టూ కుమారి(20)కి.. ధనౌరా ప్రాంతానికి చెందిన డాక్టర్ వీరేంద్ర సింగ్ తనయుడు నీలేశ్ కుమార్ సింగ్‌(38)తో పెద్దలు వివాహం నిశ్చయించారు. వీరికి మే 15వ తేదీన పెళ్లి ముహుర్తం ఫిక్స్‌ చేశారు. ఈ క్రమంలో పెళ్లి రోజురానే వచ్చింది. వివాహానికి ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు వచ్చారు. వరుడు ఊరేగింపుగా వివాహ వేదిక ఉన్న ప్రాంతానికి వచ్చాడు. కొద్దిసేపట్లో దండలు మార్చుకునే కార్యక్రమం జరగాల్సి ఉండగా.. వరుడు వివాహ వేదిక పైకి విచ్చేశాడు.

ఇంతలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. కాబోయే భర్తను చూడగానే వధువు ముఖం చాటేసింది. ఈ పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. వరుడి మెడలో దండ వేసేందుకు నిరాకరించింది. అతడికి తిలకం పెట్టేందుకు ససేమిరా అంది. ఈ క్రమంలో వధువలిద్దరి పేరెంట్స్‌ ఆమెను ప్రశ్నించారు. దీంతో, ఆమె మాట్లాడుతూ వరుడు నల్లగా ఉన్నాడని, తన కన్నా వయసులో చాలా పెద్దవాడని బదులిచ్చింది. అందుకే ఈ పెళ్లి తనకు ఇష్టంలేదని చెప్పుకొచ్చింది. ఈ సమాధానం విని అక్కడున్న వారంతా మరోసారి షాకయ్యారు. 

అనంతరం.. వధువు పేరెంట్స్‌ ఆమెతో పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేశారు. అయినా యువతి వినలేదు. కుటుంబ సభ్యులు ఆమెను మందలించే ప్రయత్నం చేశారు. కొందరైతే గట్టిగా బెదిరించారు. వధువు వెనక్కి తగ్గడం అటుంచితే.. మరింత మొండిగా ప్రవర్తించింది. వెంటనే వేదిక నుంచి దూరంగా వచ్చేసింది. తన గదికి వెళ్లిపోయింది. దీంతో, పెళ్లి కాస్తా పెటాకులు అయ్యింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

ఇది కూడా చదవండి: భార్య కోసం చిన్నారిని నిద్రలోనే గొంతు నులిమి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement