సాక్షి, పట్నా : సాధారణంగా పెళ్లంటే కొందరికి పెద్ద సంబరం. ముందే అనుకొని చేసుకునే పెళ్లిల్లయితే కాస్త చీకు చింత లేకుండా చేసుకుంటారు.. కానీ, అనూహ్యంగా చేసుకోవాల్సి వచ్చిన పెళ్లిళ్లయితే మాత్రం కొందరికి పట్టరాని సంతోషాన్నివ్వగా మరికొందరికి మాత్రం విషాదంగా కనిపిస్తాయి. బిహార్‌లో ఓ యువకుడి జీవితంలోకి మాత్రం అనుకోని, అనుకోకుండా కాకుండా.. ఓ బుల్లెట్‌లాగా పెళ్లి దూసుకొచ్చింది. సరదాగా పెళ్లికి వెళ్లి తిరుగు పయానమైన అతడు పెళ్లికొడుగ్గా మారాల్సి వచ్చింది. బోరుమని ఏడుస్తూ తన పక్కన తెలిసిన వారే లేకుండా తనపైకి ఎక్కుపెట్టిన తుపాకీని చూస్తూ తాళికట్టాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. వినోద్ కుమార్ అనే యువకుడు బొకారో స్టీల్ ప్లాంట్‌లో జూనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
అతడు డిసెంబర్ 3న పట్నాలో ఓ వివాహానికి హాజరయ్యేందుకు హతియా-పట్నా ఎక్స్‌ప్రెస్‌లో బొకారో నుంచి బయలు దేరాడు. అయితే, సురేంద్ర యాదవ్ (ప్రస్తుతం అతడు బలవంతంగా పెళ్లి చేసుకున్న యువతి సోదరుడు) అనే వ్యక్తి అతడికి ఫోన్ చేసి మోకామాకు రమ్మన్నాడు. అక్కడికి వెళ్లగానే అతడిని కిడ్నాప్ చేసి పండారక్ గ్రామానికి తీసుకెళ్లి తన చెల్లిని పెళ్లి చేసుకోవాలని లేదంటే చంపేస్తామంటూ హెచ్చరించారు. అయితే, తనను విడిచిపెట్టాలని సురేంద్ర ఎంతో బతిమాలుకున్నాడు. అయిన వినకుండా చేయి కూడా చేసుకొని పాయింట్ బ్లాక్‌లో గన్ పెట్టి పెళ్లి జరిపించారు. ఈ తంతు జరుగుతున్నంత సేపు అతడు ఏడుస్తూనే ఉన్నాడు. కొంతమంది అయితే, అతడిని ఓదారుస్తూ 'నీకు పెళ్లే చేస్తున్నారు.. ఉరేయడం లేదు' అంటూ ఆ సమయంలో పరాచికాలు కూడా ఆడారు. దానికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Published Fri, Jan 5 2018 6:03 PM | Last Updated on Fri, Jan 5 2018 8:46 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment