marriage stopped
-
నా కలర్ ఏంటి.. ఆయన ఏజ్ ఎంత.. లాస్ట్‌లో ట్విస్ట్ ఇచ్చిన వధువు
వారిద్దరికీ పెళ్లి నిశ్చయమైంది. కాసేపట్లో పెళ్లి మండపంలో వివాహం జరుగనుంది. వందల సంఖ్యలో బంధువులు వేడుకకు హాజరయ్యారు. తీరా.. తాళికట్టే సమయానిక వరుడికి వధువు ఊహించని షాకిచ్చింది. వరుడు నల్లగా ఉన్నాడని, వయసులో తనకంటే చాలా పెద్దవాడిలా కనిపిస్తున్నాడని చెప్పి వివాహానికి నిరాకరించింది. దీంతో, అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ షాకింగ్ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. భగల్పూర్లోని కహల్గావ్లో స్థానికంగా నివసించే వినోద్ మండల్ కుమార్తె కిట్టూ కుమారి(20)కి.. ధనౌరా ప్రాంతానికి చెందిన డాక్టర్ వీరేంద్ర సింగ్ తనయుడు నీలేశ్ కుమార్ సింగ్(38)తో పెద్దలు వివాహం నిశ్చయించారు. వీరికి మే 15వ తేదీన పెళ్లి ముహుర్తం ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో పెళ్లి రోజురానే వచ్చింది. వివాహానికి ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు వచ్చారు. వరుడు ఊరేగింపుగా వివాహ వేదిక ఉన్న ప్రాంతానికి వచ్చాడు. కొద్దిసేపట్లో దండలు మార్చుకునే కార్యక్రమం జరగాల్సి ఉండగా.. వరుడు వివాహ వేదిక పైకి విచ్చేశాడు. ఇంతలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. కాబోయే భర్తను చూడగానే వధువు ముఖం చాటేసింది. ఈ పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. వరుడి మెడలో దండ వేసేందుకు నిరాకరించింది. అతడికి తిలకం పెట్టేందుకు ససేమిరా అంది. ఈ క్రమంలో వధువలిద్దరి పేరెంట్స్ ఆమెను ప్రశ్నించారు. దీంతో, ఆమె మాట్లాడుతూ వరుడు నల్లగా ఉన్నాడని, తన కన్నా వయసులో చాలా పెద్దవాడని బదులిచ్చింది. అందుకే ఈ పెళ్లి తనకు ఇష్టంలేదని చెప్పుకొచ్చింది. ఈ సమాధానం విని అక్కడున్న వారంతా మరోసారి షాకయ్యారు. అనంతరం.. వధువు పేరెంట్స్ ఆమెతో పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేశారు. అయినా యువతి వినలేదు. కుటుంబ సభ్యులు ఆమెను మందలించే ప్రయత్నం చేశారు. కొందరైతే గట్టిగా బెదిరించారు. వధువు వెనక్కి తగ్గడం అటుంచితే.. మరింత మొండిగా ప్రవర్తించింది. వెంటనే వేదిక నుంచి దూరంగా వచ్చేసింది. తన గదికి వెళ్లిపోయింది. దీంతో, పెళ్లి కాస్తా పెటాకులు అయ్యింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: భార్య కోసం చిన్నారిని నిద్రలోనే గొంతు నులిమి.. -
ఫొటోగ్రాఫర్ రాలేదా? గిట్లయితే ఎట్ల! నమ్మకం పోయింది.. పెళ్లి బంద్!
ఈ మధ్య పెళ్లిళ్లన్నీ పీటల మీద ఆగిపోతున్నాయి. బట్టతల ఉందని ఒకరు, తాగుతున్నాడని మరొకరు అబ్బాయిలను తిరస్కరిస్తే, ఈ అమ్మాయి మాత్రం... పెళ్లికి అబ్బాయి వాళ్లు ఫొటోగ్రాఫర్‌ను పెట్టలేదని పీటల మీదనుంచి వెళ్లిపోయింది. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ దేహత్ జిల్లాలోని ఓ అమ్మాయికి అదే జిల్లాకు చెందిన భోగ్నిపూర్‌కు చెందిన అబ్బాయితో పెళ్లి కుదిరింది. ఏర్పాట్లు పూర్తయిపోయాయి. పెళ్లి వేడుక మొదలైంది. అబ్బాయి బరాత్‌తో వేడుకగా వచ్చాడు. వేదిక కూడా ఎక్కాడు. ఇక పూల మాల వేయడమే తరువాయి. ఆ క్షణాలను పట్టి బంధించడానికి ఫొటోగ్రాఫర్ లేడన్న విషయాన్ని వధువు గుర్తించింది. వెంటనే వేదిక దిగి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఎవ్వరు ఎంత చెప్పినా ససేమిరా అంది. ‘పెళ్లి వేడుకనే సరిగ్గా పట్టించుకోనివాడు... రేపు పెళ్లయ్యాక తనను బాగా చూసుకుంటాడన్న నమ్మకమేంటి’ అంటూ తిరస్కరించింది. ఇక చేసేదేం లేక అప్పటిదాకా ఇచ్చిపుచ్చుకున్న డబ్బు, నగలు, వస్తువులు ఎవరివి వాళ్లకు ఇచ్చేసి... రెండు కుటుంబాలు వెనుదిరిగాయి. తరువాత తేలిందేమంటే అబ్బాయివాళ్లు ముందే మాట్లాడి పెట్టినా... ఫొటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ మధ్య పొసగక ఇద్దరూ రాలేదు. చదవండి👉🏼మూడొంతుల మందికి మంచి తిండి కలే -
Jharkhand Radha Pandey: హ్యాపీ న్యూస్.. రాధ పెళ్లి ఆగింది
ఇప్పటి వరకు బాల్యవివాహాలను అడ్డుకున్న ఎంతో మంది సామాజిక కార్యకర్తలను చూశాం. ఇప్పుడు తన వివాహాన్ని తానే అడ్డుకున్న ఓ బాలికను చూస్తున్నాం. ఇటీవల జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ బాలిక తన పెళ్లిని తనే స్వయంగా ఆపి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తున్న ఆ బాలిక పేరు రాధాపాండే. రాధను అభినందిస్తున్న జిల్లా డిప్యూటీ కమిషనర్ రమేశ్ ఘోలప్ కొడెర్మా జిల్లా మధుబన్ గ్రామానికి చెందిన 16 ఏళ్ల రాధాపాండేకు.. ఆమె తల్లిదండ్రులు పక్క ఊరి వరుడితో వివాహం నిశ్చయించారు. ఈ పెళ్లి జూన్ 23 జరగాల్సింది. అయితే మే నెలలో ఆ విషయం తెలుసుకున్న రాధ ‘ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని, పెళ్లి ఆపేయమని తల్లిదండ్రులు, బంధువులను కోరింది’. కానీ పెద్దలు ఎవరూ తనకు సహకరించకపోగా పెళ్లికి సిద్ధపడు అని బెదిరించారు. తన తల్లిదండ్రులను ఒప్పించలేక, వరుడి తండ్రి దగ్గరకు వెళ్లి ‘తనకు చదువుకోవాలని ఉందని, ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదని, పెళ్లిచేసుకుంటే తన కలలన్నీ చెదిరిపోతాయని’ చెప్పి... ఈ గండం నుంచి గట్టెక్కించమని వేడుకుంది. కానీ ఆయన మనసు కూడా రాధ వేడుకోలుకు కరగలేదు. కేఎస్‌సీఎఫ్.. ఇదే సమయంలో మధుబన్ పంచాయితీలో బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ వివిధ కార్యక్రమాలతో యాక్టివ్‌గా ఉండే కైలాష్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ (కేఎస్‌సీఎఫ్) గురించి రాధ తెలుసుకుంది. వెంటనే వాళ్లను కలిసి తన బాధ వెళ్లబోసుకుని, ఎలాగైనా ఈ పెళ్లిని ఆపించమని అభ్యరి్థంచింది. దీంతో కేఎస్‌సీఎఫ్ బృందం రాధ తల్లిదండ్రులను కలిసి వారు తలపెట్టిన బాల్యవివాహాన్ని ఆపాలని చెప్పారు. మొదట్లో రాధ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. పద్దెనిమిదేళ్లు రాకుండా పెళ్లి చేయడం చట్టరీత్యా నేరం అని చెప్పడంతో, పోలీసులకు భయపడి ఎట్టకేలకు ఒప్పుకున్నారు. వరుడి కుటుంబంతో చర్చించి పెళ్లి రద్దు చేశారు. అంతేగాక రాధకు మైనారిటీ తీరేంత వరకు పెళ్లి చేయబోమని కూడా మాట ఇచ్చారు. దీంతో రాధ పెళ్లి ఆగిపోయింది. జిల్లాకు అంబాసిడర్... రాధ పెళ్లి విషయం, ఆమెకు బాలల హక్కులు, బాల్యవివాహాలపై ఉన్న అవగాహనతో ధైర్యంగా ఎదుర్కొన్న తీరు తెలుసుకున్న జిల్లా డిప్యూటీ కమిషనర్ రమేశ్ఘోలప్ ఎంతో సంతోషించారు. ఆయన రాధను అభినందించి, ఆమెను జిల్లాలో బాల్యవివాహాలకు వ్యతిరేకంగా పోరాడే అంబాసిడర్‌గా నియమించారు. ‘ముఖ్యమంత్రి సుకన్య’ ప్రభుత్వ పథకం కింద నెలకు రెండు వేల రూపాయలను కూడా జారీ చేయించారు. అంతేగాక రాధ కుటుంబానికి రేషన్ కార్డు, ఉచిత వైద్య సదుపాయం, పెన్షన్ వంటి సదుపాయాలను కలి్పంచారు. ప్రభుత్వ ప్రోత్సాహం, కేఎస్‌సీఎఫ్ ఆధ్వర్యంలో రాధ ఇప్పుడు బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ తనలాంటి ఎంతో మంది అమ్మాయిలను కాపాడుతోంది. బాగా చదువుకుని భవిష్యత్‌లో మంచి టీచర్‌ను అవుతానని రాధ చెప్పడం విశేషం. ప్రతి బాలికలోనూ రాధలాంటి తెగువ, అవగాహన ఉంటే బాల్యవివాహాలు కనుమరుగు కావడానికి ఎక్కువ సమయం పట్టదు. చదవండి: "Kidnap And Wed": ఆ దీవిలో జరిగేవన్నీ దాదాపుగా రాక్షస వివాహాలే! -
అబ్బాయి అబద్ధం చెప్పాడు.. ‘ఈ పెళ్లి నాకొద్దు’
సాక్షి, కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గురువారం(నేడు) తెల్లవారుజామున జరగాల్సిన ఓ వివాహం పెళ్లి కుమార్తె అయిష్టంతో నిలిచిపోయింది. వివరాల్లోకి వెళితే.. ధర్మవరం పట్టణానికి చెందిన ఓ యువకునికి ముదిగుబ్బ మండల కేంద్రానికి చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఇరువైపులా పెళ్లి పత్రికలను బంధువులందరికీ పంచిపెట్టారు. కదిరిలో నృసింహుని సన్నిధిలో 6వ తేదీన చైత్ర బహుళ దశమి గురువారం తెల్లవారు జామున జరగాల్సి ఉంది. ఇరువైపుల పెళ్లి కుటుంబ సభ్యులు, బంధువులు ఆలయం చేరుకున్నారు. ఈలోగా పెళ్లి కుమార్తె తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, అబ్బాయి ఐటీఐ చదివి ఎంటెక్ అని అబద్ధం చెప్పాడని, తాను బీటెక్ చదివానని తన మనసులో మాట చెప్పింది. దీనికి తోడు తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, పెళ్లి వాయిదా వేసుకుందామని చెప్పినా బలవంతంగా తాళి కడతానని బెదిరిస్తున్నాడని కదిరి పట్టణ ఎస్ఐ మహమ్మద్ రఫి ఎదుట వాపోయింది. పెళ్లి ఇష్టం లేదని ముందే ఎందుకు చెప్పలేదని.. తమకు అవమానంగా ఉందని పెళ్లికుమారుడితో పాటు అతని తరపు బంధువులు అన్నారు. పెళ్లి కోసం ముందుగానే రూ.1.50 లక్షలు పెళ్లి కుమార్తె బ్యాంకు ఖాతాకు ఫోన్‌పే ద్వారా జమ చేశానని, ఆ డబ్బు ఇస్తే తన దారిన తాను వెళ్లిపోతానని ఆ యువకుడు తేల్చిచెప్పాడు. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని, పెళ్లి కోసం ఇచ్చిన డబ్బులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి పరిష్కరించుకోండని కదిరి టౌన్ ఎస్ఐ చెప్పడంతో చివరకు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. చదవండి: జలమార్గంలో చేరుకున్న ఆక్సిజన్ ట్యాంకర్లు -
పేరు తేడా.. పెళ్లి ఆపేసింది!
కృష్ణాజిల్లా, క్రోసూరు(పెదకూరపాడు): వధువు తమ కులానికి చెందినది కాదంటూ ముహూర్త సమయంలో వివాహం రద్దు చేసుకున్న వరుడిపై క్రోసూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్ఐ పి.జనార్ధన్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని గాదెవారిపాలెం గ్రామానికి చెందిన వధువు (బీసీ) తో సత్తెనపల్లి మండలంలోని గుడిపూడి గ్రామానికి చెందిన అగ్రవర్ణానికి చెందిన వరుడికి వివాహం నిశ్చయమైంది. ఇద్దరికీ ఇది రెండో వివాహం. ఈనెల 22 న పెదకాకాని శివాలయంలో వివాహం జరగాల్సి ఉండగా, ముహూర్త సమయంలో వధువు తండ్రి ఆధార్ కార్డులోని పేరు, పెండ్లి పత్రికల్లో ఉన్న పేరు తేడా ఉండటాన్ని గుర్తించి.. వరుడు, వరుడి బంధువులు.. వధువు తమ సామాజిక వర్గానికి చెందినది కాదంటూ వివాహం రద్దు చేసుకుని వెళ్లిపోయారు. దీనిపై వధువు తండ్రి ఆదివారం పెదకాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, క్రోసూరులో ఫిర్యాదు చేయమని చెప్పి పంపారు. దీంతో వధువు తండ్రి సోమవారం క్రోసూరు స్టేషన్లో ఫిర్యాదుచేశారు. సీఐ వెంకట్రావు ఇరు కుటుంబాలను కౌన్సెలింగ్‌కు పంపించాలని ఆదేశించినట్లు ఎస్ఐ తెలిపారు. అయితే వరుడు పరారీలో ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. -
తల్లి మరణంతో ఆగిన తనయుడి వివాహం
చందుర్తి(వేములవాడ) : తెల్లవారితే తనయుడి పెళ్లి జరగాల్సిన ఇంట్లో తల్లి హఠాన్మరణంతో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఘటన చందుర్తి మండలం మూడపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాచర్ల బూదవ్వ(42) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ మధ్య తన కొడుకు ప్రశాంత వివాహం నిశ్చయమైంది. ఈ నెల 15న ఉదయం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన యువతితో జరగాల్సి ఉంది. మంగళవారం పెళ్లి పనుల్లో నిమగ్నమైన బూదవ్వ కళ్లు తిరుగుతున్నాయని పడుకుంది. కొద్దిసేపటికి కుటుంబ సభ్యులు బూదవ్వను నిద్ర లేపేందుకు యత్నించగా అప్పటికే మరణి చింది. దీంతో పెళ్లింట విషాదం అలుముకుంది.కాగా బూదవ్వ మహిళా రైతు కావడంతో వ్యవసాయాధికారులు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. -
పెళ్లి ఆపిన ‘సెల్ఫీ’
సాక్షి, హుజూరాబాద్‌రూరల్: సాంకేతిక పరిజ్ఞానంతో మానవుడి కష్టాలు తీరుతాయనుకుంటే.. కొత్త సమస్యలు తెచ్చి పెడుతుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సెల్‌ఫోన్ లేని మనిషి ఉండరంటే అతిశయోక్తి కాదు. సెల్ఫీలు దిగడం యూత్ ట్రెండ్‌గా మారింది. సెల్ఫీ దిగుతూ సోషల్‌మీడియాలో పెట్టి లైక్‌ల కోసం ఎదురుచూస్తున్న యువతనే చూస్తున్నాం. అయితే సరదాగా దిగిన ఓ సెల్ఫీ ఓ పెళ్లి ఆగిపోయేలా చేసింది. ఈ సంఘటన ఆదివారం కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన ఓ యువతి హైదరాబాద్‌లోని ఓ సూపర్ మార్కెట్లో మూడేళ్లుగా పనిచేస్తుంది. అదే సూపర్మార్కెట్లో క్యాషియర్‌గా నల్లబోయిన ప్రశాంత్ పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరు సెల్ఫీ దిగారు. సదరు యువతికి మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లోని కనుకదుర్గకాలనీకి చెందిన ఆడెపు అనిల్‌తో పెళ్లి కుదిరింది. ఈనెల 1న పట్టణంలోని బీఎస్ఆర్ గార్డెన్లో వివాహం జరుగుతున్న సమయంలో వరుడు ఆడెపు అనిల్ సెల్‌ఫోన్‌లోని వాట్సాప్‌కు నల్లబోయిన ప్రశాంత్ యువతితో దిగిన సెల్ఫీ ఫొటోలను పంపించాడు. ఈ విషయాన్ని వరుడు కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. తమను మోసం చేసి పెళ్లి చేస్తున్నారంటూ వధువు కుటుంబ సభ్యులపై వరుడి కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా పెళ్లి ఆగడానికి కారణమైన సదరు యువకుడు ప్రశాంత్‌పై చర్య తీసుకోవాలని యువతి తల్లి నర్మద ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ దామోదర్‌రెడ్డి తెలిపారు. -
మైనర్ బాలిక వివాహం నిలిపివేత
తాడికొండ: మైనర్ బాలిక వివాహాన్ని పోలీసులు అడ్డుకున్న ఘటన తాడికొండ బీసీ కాలనీలో ఆదివారం చోటు చేసుకుంది. నకరికల్లు మండలం చేజర్ల గ్రామానికి చెందిన సీహెచ్. శిరీషను తాడికొండకు చెందిన మేనమామ ప్రసాద్‌కు ఇచ్చి వివాహం చేసేందుకు ఆదివారం ఏర్పాట్లు చేస్తుండగా 100 డయల్‌కు ఫిర్యాదు అందింది. స్పందించిన తాడికొండ ఎస్.ఐ. రాజశేఖర్ సిబ్బందితో వరుడు ఇంటికి వెళ్లి ఇద్దరు పెద్దలతో చర్చించారు. మైనర్ వివాహం జరిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో పెద్దలు నిలిపేందుకు అంగీకరించారు. -
పెళ్లింట విషాదం
సాక్షి, గోదావరిఖని(రామగుండం): వారం రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగింది. పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో ఆ ఇంటికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న వ్యక్తి అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. వివరాల్లోకి వెళితే.. గోదావరిఖని ఎల్బీనగర్లో నివాసముండే సమ్మయ్య సింగరేణిలో పనిచేసి చాలా ఏళ్ళ క్రితమే పదవీ విరమణ పొందాడు. ఈయనకు కుమారులు ప్రసన్నకుమార్ (35), రాహూల్‌తో పాటు కుమార్తె ఉన్నారు. ప్రసన్నకుమార్ స్థానికంగా వీడియోగ్రాఫర్‌గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి కేబుల్ నెట్వర్క్ నిర్వహించేవాడు. పదేళ్ళక్రితం కెమెరామెన్‌గా టీవీ చానెల్‌కు పనిచేసి ఆ తర్వాత మెదక్‌జిల్లాకు ఓ టీవీకి రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. రాహూల్ స్థానికంగా ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. మే 6వ తేదీన సోదరుడు రాహూల్ వివాహానికి సంబంధించి పెళ్లి కార్డులు పంచేందుకు హైదరాబాద్ వెళ్ళిన ప్రసన్నకుమార్ తిరుగుప్రయాణంలో సిద్దిపేట జిల్లా కొండపాక వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తల్లిదండ్రులు వృద్ధులు కావడంతో ఆ కుటుంబానికి ప్రసన్నకుమార్ పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నాడు. సోదరుడి వివాహాన్ని సైతం ఆయన స్వయంగా దగ్గరుండి చేసే క్రమంలో మృత్యువాత పడడం ఆ కుటుంబాన్ని తీరని విషాదంలోకి నెట్టింది. శనివారం తెల్లవారుజామున మృతదేహాన్ని గోదావరిఖనికి తీసుకురాగా వివిధ పత్రికలు, టీవీ చానెళ్ళకు చెందిన జర్నలిస్టులు, జర్నలిస్ట్ సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, క్రీడాకారులు, ప్రముఖులు తరలివచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. గోదావరినది ఒడ్డున అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. -
గుండెపోటుతో తండ్రి మృతి... ఆగిన కుమార్తె పెళ్లి
మదనపల్లె: తెల్లవారితే తన కుమార్తె పెళ్లి... ఇంతలోనే పెళ్లి కుమార్తె తండ్రి గుండెపోటుతో మృత్యు ఒడికి చేరాడు. దీంతో ఆ యువతి వివాహం ఆగిపోయింది. ఈ ఘటన గురువారం చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో చోటుచేసుకుంది. గుండ్లూరు వీధికి చెందిన సత్యప్రసాద్ స్థానిక ప్రభుత్వ జీఆర్టీ హైస్కూల్లో సీనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య కృష్ణవేణి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మొదటి కుమార్తె సత్యప్రియకు శుక్రవారం ఉదయం ఆరు గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది. ఇల్లంతా పెళ్లిసందడితో కళకళలాడుతోంది. వంటావార్పు పనులు జోరుగా సాగుతున్నాయి. ఇంతలోనే గురువారం సాయంత్రం సత్యప్రసాద్ గుండెపోటుతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే సత్యప్రసాద్ కన్నుమూశారు. దీంతో పెళ్లి వేడుక తాత్కాలికంగా నిలిచిపోయింది. -
పెళ్లికి గంట ముందు పారిపోయిన వరుడు
-
పెళ్లికి గంట ముందు పారిపోయిన వరుడు
సికింద్రాబాద్: వరుడు పారిపోవడంతో పీటల మీద పెళ్లి ఆగిపోయిన ఘటన సికింద్రాబాద్ లో శుక్రవారం చోటుచేసుకుంది. పెళ్లి ముహూర్తానికి గంట ముందు పెళ్లికొడుకు సతీశ్ పారిపోయాడు. తనకు పెళ్లి ఇష్టంలేదని చెప్పి అతడు పరారయ్యాడు. దీంతో పీటల మీద పెళ్లి ఆగిపోయింది. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు నిరాశగా వెనుదిరిగారు. తమ పరువు తీశారంటూ పెళ్లికొడుకు తరపు వారిపై వధువు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సతీశ్ ఎందుకు పారిపోయాడో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
కాసేపట్లో పెళ్లి... ప్రియురాలితో వరుడు జంప్
కామేపల్లి(ఖమ్మం): కాసేపట్లో పెళ్లి..కల్యాణ మండపం..బాజాభజంత్రీలు.. బంధుమిత్ర పరివారంతో అమ్మాయి ఇంట్లో హడావుడి..ఇంతలోనే షాక్. తన ప్రియురాలితో కలిసి పెళ్లి కొడుకు పరారయ్యాడన్న సమాచారం వధువు ఇంటికి చేరింది. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ తిన్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గరిడేపల్లిలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... గరిడేపల్లికి చెందిన భూక్యా మౌనికకు వరంగల్ జిల్లా కొరవి మండలం ఉప్పరిగూడెం పంచాయతీ మంజ్యాతండాకు చెందిన మాళోత్ శ్రీనివాస్‌తో పది రోజుల క్రితం వివాహం నిశ్చయమైంది. వరకట్నంగా వరుడి కుటుంబసభ్యులు రూ.4 లక్షలు మాట్లాడుకున్నారు. దీనిలో రూ.3 లక్షలు వివాహానికి ముందే వధువు తల్లిదండ్రులు ముట్టజెప్పారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది. వరుడు తెల్లవారుజామునే వధువు ఇంటికి రావాల్సి ఉంది. కానీ రాలేదు. ఆరా తీయగా ప్రేమించిన అమ్మాయితో పెళ్లికొడుకు పరారయ్యాడని వధువు కుటుంబానికి తెలిసింది. ఈ విషయం తెలిసిన వధువు కుటుంబసభ్యులు వరుడిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.