
కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న ఎస్.ఐ. రాజశేఖర్
తాడికొండ: మైనర్ బాలిక వివాహాన్ని పోలీసులు అడ్డుకున్న ఘటన తాడికొండ బీసీ కాలనీలో ఆదివారం చోటు చేసుకుంది. నకరికల్లు మండలం చేజర్ల గ్రామానికి చెందిన సీహెచ్. శిరీషను తాడికొండకు చెందిన మేనమామ ప్రసాద్‌కు ఇచ్చి వివాహం చేసేందుకు ఆదివారం ఏర్పాట్లు చేస్తుండగా 100 డయల్‌కు ఫిర్యాదు అందింది. స్పందించిన తాడికొండ ఎస్.ఐ. రాజశేఖర్ సిబ్బందితో వరుడు ఇంటికి వెళ్లి ఇద్దరు పెద్దలతో చర్చించారు. మైనర్ వివాహం జరిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో పెద్దలు నిలిపేందుకు అంగీకరించారు.