
మంగళగిరిటౌన్: మంగళగిరి పట్టణ పరిధిలోని ఇందిరానగర్‌లో ప్రేమ వ్యవహారం నేపథ్యంలో 15 ఏళ్ల మైనర్ బాలిక ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్న కోలా దుర్గారావు, రేవతిల కుమార్తె కోలా లిఖిత పట్టణంలోని ద్వారకానగర్‌లో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. గత రెండు రోజుల నుంచి స్కూలుకు వెళ్లడం లేదు.
లిఖిత ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు తెలిసి కూతురును మందలించడంతో మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి లిఖిత బాత్రూంలోకి వెళ్లి గడియ వేసుకొని చున్నీతో ఉరివేసుకుంది. ఎంత సేపటికీ బాత్రూంలోంచి బయటకు రాకపోవడంతో ఇంట్లోనే ఉన్న తల్లి రేవతి తలుపులను పగలగొట్టి చూడగా బాత్రూంలో లిఖిత వేలాడుతూ కనిపించింది. హుటాహుటిన కిందకు దించి చూసేసరికి అప్పటికే కూతురు మృతి చెంది ఉండడంతో తల్లిదండ్రులు భోరుమన్నారు. పట్టణ ఎస్‌ఐ బాలకృష్ణ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment