ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హుజూరాబాద్‌రూరల్: సాంకేతిక పరిజ్ఞానంతో మానవుడి కష్టాలు తీరుతాయనుకుంటే.. కొత్త సమస్యలు తెచ్చి పెడుతుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సెల్‌ఫోన్ లేని మనిషి ఉండరంటే అతిశయోక్తి కాదు. సెల్ఫీలు దిగడం యూత్ ట్రెండ్‌గా మారింది. సెల్ఫీ దిగుతూ సోషల్‌మీడియాలో పెట్టి లైక్‌ల కోసం ఎదురుచూస్తున్న యువతనే చూస్తున్నాం. అయితే సరదాగా దిగిన ఓ సెల్ఫీ ఓ పెళ్లి ఆగిపోయేలా చేసింది. ఈ సంఘటన ఆదివారం కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన ఓ యువతి హైదరాబాద్‌లోని ఓ సూపర్ మార్కెట్‌లో మూడేళ్లుగా పనిచేస్తుంది. అదే సూపర్‌మార్కెట్‌లో క్యాషియర్‌గా నల్లబోయిన ప్రశాంత్ పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరు సెల్ఫీ దిగారు. సదరు యువతికి మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లోని కనుకదుర్గకాలనీకి చెందిన ఆడెపు అనిల్‌తో పెళ్లి కుదిరింది. ఈనెల 1న పట్టణంలోని బీఎస్‌ఆర్ గార్డెన్‌లో వివాహం జరుగుతున్న సమయంలో వరుడు ఆడెపు అనిల్ సెల్‌ఫోన్‌లోని వాట్సాప్‌కు నల్లబోయిన ప్రశాంత్ యువతితో దిగిన సెల్ఫీ ఫొటోలను పంపించాడు. ఈ విషయాన్ని వరుడు కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. తమను మోసం చేసి పెళ్లి చేస్తున్నారంటూ వధువు కుటుంబ సభ్యులపై వరుడి కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా పెళ్లి ఆగడానికి కారణమైన సదరు యువకుడు ప్రశాంత్‌పై చర్య తీసుకోవాలని యువతి తల్లి నర్మద ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ దామోదర్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment