
అజిత్, తమన్
అభిమాన హీరోను అనుకోకుండా కలిస్తే ఆ ఆనందం ఇచ్చే కిక్కే వేరు. ఆ కిక్‌ను డబుల్ టైమ్ ఎంజాయ్ చేసే అదృష్టం సంగీత దర్శకుడు ఎస్.ఎస్ తమన్‌కు దక్కింది. ఇంతకీ.. విషయం ఏంటంటే.. అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విశ్వాసం’. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో అజిత్‌ను కలిశారు తమన్. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకుని చెన్నై వెళ్తున్న అజిత్‌ను ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ కలిసి సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘అజిత్‌తో కలిసి మళ్లీ ఫ్లైట్‌లో వెళ్తున్నాను. అలా కుదిరిందంతే’’ అని తమన్ పేర్కొన్నారు. ఇంకా అజిత్ ఫాలోయింగ్ గురించి తమన్ మాట్లాడుతూ–‘‘దాదాపు 100 నుంచి 200 మంది వరకు అజిత్‌సార్‌తో సెల్ఫీలు తీసుకున్నారు. కెప్టెన్స్ టు ప్యాజింజర్స్ కూడా. అజిత్ డౌన్ టు ఎర్త్’’ అని అన్నారు. ప్రస్తుతం తమన్ సంగీత దర్శకునిగా టాలీవుడ్‌లో మాంచి ఊపుమీద ఉన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment