
రాచర్ల బూదవ్వ
చందుర్తి(వేములవాడ) : తెల్లవారితే తనయుడి పెళ్లి జరగాల్సిన ఇంట్లో తల్లి హఠాన్మరణంతో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఘటన చందుర్తి మండలం మూడపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాచర్ల బూదవ్వ(42) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ మధ్య తన కొడుకు ప్రశాంత వివాహం నిశ్చయమైంది. ఈ నెల 15న ఉదయం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన యువతితో జరగాల్సి ఉంది.
మంగళవారం పెళ్లి పనుల్లో నిమగ్నమైన బూదవ్వ కళ్లు తిరుగుతున్నాయని పడుకుంది. కొద్దిసేపటికి కుటుంబ సభ్యులు బూదవ్వను నిద్ర లేపేందుకు యత్నించగా అప్పటికే మరణి చింది. దీంతో పెళ్లింట విషాదం అలుముకుంది.కాగా బూదవ్వ మహిళా రైతు కావడంతో వ్యవసాయాధికారులు వచ్చి వివరాలు తెలుసుకున్నారు.