loves
-
పెళ్లి పూర్తయ్యే టైంలో సినిమాని తలపించే సీన్..వరుడు అర్థాంతరంగా పెళ్లిని ఆపేసి..
బిహార్‌లో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహ వేడుకలో వధువరుల పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతోంది. బంధవులంతా ఆనందోత్సహాలతో వేడుకను తిలకిస్తున్నారు. ఇక దండలు మార్చుకుంటే పెళ్లి తంతు ముగిసిపోతుందనంగా.. వరుడు అర్థాంతరంగా పెళ్లిని ఆపించేశాడు. తాను ఒకరిని ప్రేమించానంటూ పెద్ద బాంబు పేల్చాడు. దీంతో అక్కడ ఉన్న బంధువులందరికీ ఒక్క క్షణం ఏ జరుగుతుందో అర్థం కాలేదు. తీరా చూస్తే.. తాను వధువు చెల్లిని ఇష్టపడ్డానంటూ ఆమెనే పెళ్లి చేసుకుంటానని మరో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం తలెత్తింది. అన్నిట్లకంటే బిగ్ ట్విస్ట్ ఏంటంటే వధువు చెల్లికి, వరుడుకి ముందునుంచే పరిచయముందని, ఆమె పరీక్షలు పూర్తి అయ్యాక పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇంకో జుగప్సకరమైన ట్విస్ట్ ఏంటంటే వధువు చెల్లి తన అక్క రింకూని పెళ్లి చేసుకుంటే భవనంపై నుంచి దూకేస్తానని చెప్పిందని, అందువల్ల తననే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు వరుడు. దీంతో అక్కడ వాతావరణమంతా ఒక్కసారిగా ఘర్షణగా మారిపోయింది. బంధువులు పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరుపక్షాలకు సద్ది చెప్పారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను ప్రేమికులను ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. (చదవండి: కారు కింద 15 అడుగులు భారీ కింగ్ కోబ్రా..పట్టుకున్న తీరు చూస్తే..) -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి బైఠాయింపు
అక్కన్నపేట(హుస్నాబాద్): పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఆమె కథనం ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి మండలానికి చెందిన కాదాసు కీర్తన, అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన బత్తుల సతీశ్ తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి గర్భవతిని చేశాడు. గర్భం పోయేందుకు అబార్షన్ చేయించాడు. అనంతరం వారి ఇరువురి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటానని సతీశ్ ఒప్పకున్నాడు. అయితే పెళ్లి చేసుకోకుండా ఏదో ఒక సాకు చూపుతూ పెళ్లిని దాటవేస్తున్నాడు. 2020 సెప్టెంబర్ 12 తేదీన సతీశ్ తల్లిదండ్రులు గ్రామ పెద్దల సమక్షంలో కొడుకుతో పెళ్లి చేస్తామని ఒప్పంద ప్రతం రాసి ఇచ్చారు. ఆ మేరకు రెండు నెలల క్రితం రుదంగ్రి గ్రామంలోని లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయంలో వరపూజ జరిగింది. నెలలోపు పెళ్లి ఏర్పాటు చేస్తామని ప్రియుడు, అతడి తల్లిదండ్రులు అంగీకరించారు. అయితే వరకట్నంగా కారు, డబ్బులు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానంటూ ప్రియుడు, అతడి తల్లిదండ్రులు వేధిస్తున్నారని కీర్తన కన్నీటి పర్యతమైంది. ప్రియుడు, అతడి తల్లిదండ్రులు బత్తుల కొమురయ్య, ఎల్లవ్వ, వారిని ప్రోత్సహిస్తున్న మల్లేశ్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం జరగకుంటే ప్రియుడి ఇంటి ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని కీర్తన హెచ్చరించింది. -
గౌతమ్ మామయ్య ఇక లేరా.. ఆ చిన్నారులు కంటతడి
సంగం(నెల్లూరు జిల్లా): మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి చిన్న పిల్లలంటే ఎంతో ఇష్టం. వారు అడిగితే ఎంతటి పనైనా చేస్తారని జనం ప్రశంసలు కురిపిస్తుంటారు. ఇటీవల తరుణవాయి ఉన్నత పాఠశాలను సందర్శించిన మంత్రి విద్యార్థులతో ముచ్చటించారు. వసతులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రీడాస్థలం సక్రమంగా లేదని చెప్పగా రోజుల వ్యవధిలోనే చదును చేయించారు. తమ కోరికను తీర్చిన గౌతమ్ మామయ్య ఇక లేరా అంటూ ఆ చిన్నారులు కంటతడి పెట్టారు. చదవండి: హైదరాబాద్‌తో ఎంతో అనుబంధం.. పలువురు టాలీవుడ్ ప్రముఖులతోనూ.. -
గోంగూర పచ్చడి, నెయ్యి అంటే ప్రాణం
న్యూఢిల్లీ ఎప్పుడూ విద్యార్థులతో సందడి సందడిగా ఉండే భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు నెయ్యి, గోంగూర పచ్చడి అంటే ప్రాణం. దక్షిణ భారతదేశ వంటకాలనుఎక్కువగా ఇష్టపడే కలాం ఇడ్లీలు లను చాలా ఇష్టంగా తినేవారట. దేశానికి విశిష్ట సేవలందించి ప్రజల రాష్ట్రపతిగా పేరుగాంచిన ఆయన రాష్ట్రపతిగా ఆయన అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. గొప్పమానవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. అన్నిసుగుణాలు ఉన్నపరిపూర్ణ వ్యక్తి కలాం. దేశ విశిష్ట పురస్కారం భారతరత్నను అందుకున్న మూడో రాష్ట్రపతి కలాం. ఆయనకు ప్రకృతి అంటే ప్రాణం. చెట్లు పెంచడం ద్వారా ప్రకృతి సమతుల్యతను కాపాడాలని ఆయన అనేక సందర్భాల్లో ప్రజలకు పిలుపునిచ్చేవారు. ప్రతి ఇల్లూ పచ్చగా కళకళలాడాలని ఆయన కోరుకునేవారు. ఇంటి చుట్టూ చెట్లు పెంచి ప్రశాంతమైన వాతావరణాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించేవారు. పిల్లలంటే వల్లమాలిన అభిమానం. నిత్యం వారికోసం పరితపించేవారు. జీవితంలో ఎన్నడూ క్రమశిక్షణను ఉల్లఘించలేదు. నిత్యం వ్యాయాయం చేసేవారు. చాలా క్రమబద్ధమైన, నియమబద్ధమైన జీవితాన్ని గడిపారు. తద్వారా యువతకు ఉన్నతమైన సందేశాన్నందించారు. ఆయనకు పుస్తకాలు, సంగీతం అన్నా మక్కువ ఎక్కువే. ఈ నేపథ్యంలోనే ఆయన వీణ కూడా నేర్చుకున్నారు.