బిర్యానీలో వేసే సోయా చంక్స్ లేదా మీల్ మేకర్(Soya chunks) ఆరోగ్యానికి ఎంతో మంచివట. వీటిని మన ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఇవి మొక్కల ఆధారిత ప్రోటీన్‌గా పిలుస్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్యానికి మంచి గేమ్ ఛేంజర్(Game-changer)గా చెబుతున్నారు. అదెలాగో సవివరంగా చూద్దాం..!.
సోయా ముక్కలు (సోయా చంక్స్) సోయాబీన్స్ నుంచి తయారైన మొక్కల ఆధారిత ప్రోటీన్ మూలం. కొవ్వు శాతం తక్కువ, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. శాకాహారులకు ప్రత్యామ్నాయమైన సాంప్రదాయ మాంసం ఆధారిత ప్రోటీన్‌గా పనిచేస్తుంది. తినేందుకు రుచిగానూ, శరీరానికి అవసరమైన విటమిన్లను అందిస్తుంది.
తృప్తికరమైన భోజనానికి చిహ్నంగా ఉంటుంది. ఆరోగ్య స్ప్రుహ ఉన్న వ్యక్తులకు ఇది బెస్ట్ సూపర్ ఫుడ్. ఆహార ప్రియలు ఈ మీల్ మేకర్‌ని పలు విధాల రెసిపీలతో ఆస్వాదిస్తున్నారు. వంట చేసే నేర్పు లేనివారైనా..సులభంగా వండుకోగలరు. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటంటే..
గుండె ఆరోగ్యానికి మంచిది..
మీల్ మేకర్‌లో ప్రొటీన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా, సంతృప్త కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ పోషకాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరగుతుంది.
బరువు తగ్గుతారు..
మీల్ మేకర్‌లో ప్రొటీన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మిమ్మల్ని చాలా కాలం పాటు నిండుగా ఉంచుతాయి. మీరు తరచుగా తినాలనే కోరికలను తగ్గిస్తుంది. మీల్ మేకర్‌లోని ప్రొటీన్‌కు శరీరం కొవ్వు, బరువును తగ్గించే లక్షణాలు ఉంటాయి. మనం శరీరంలో కార్బోహైడ్రేట్ల కంటే సోయా చంక్స్‌ను జీర్ణం చేయడానికి ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది. ఫలితంగా శరీరంలో కొవ్వు ఈజీగా కరుగుతుంది, బరువు కూడా సులభంగా తగ్గుతారు.
మెనోపాజ్ లక్షణాలను తగ్గిస్తుంది..
మెనోపాజ్ దశలో మహిళలు యోని పొడిబారడం, వేడి ఆవిర్లు, మూడ్ స్వింగ్స్, నిద్రాభంగం, రాత్రిపూట చెమటలు పట్టడం వంటి లక్షణాలతో ఇబ్బంది పడుతుటుందారు. సోయా చంక్స్‌లో ఐసోఫ్లేవోన్స్ అనే ఫైటోఈస్ట్రోజెన్ ఉంటుంది, ఇది మెనోపాజ్ లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది.
హార్మోన్ల సమతుల్యత
వీటిలోని ఫైటోఈస్ట్రోజెన్ కంటెంట్ పీరియడ్స్ సక్రమంగా వచ్చేలా చేస్తుంది. ముఖ్యంగా PCOS, పోస్ట్ మెనోపాజ్ లక్షణాలతో బాధపడేవారికి మీల్ మేకర్ మేలు చేస్తాయి.
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి..
మీల్ మేకర్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, కొన్ని రకాల కేన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
జీర్ణక్రియకు..
మీల్ మేకర్ పేగులలో లాక్టోబాసిల్లి, బైఫిడోబాక్టీరియా పరిమాణం పెంచుతుంది. ఈ రెండు సూక్ష్మజీవులు జీర్ణక్రియకు సహాయపడతాయి.
మధుమేహ రోగులకు మంచిది..
మీల్ మేకర్‌లో ఐసోఫ్లేవోన్‌లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. ఇలా రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటే గుండె సమస్యల ప్రమాదం కూడా తగ్గుతుంది.
(చదవండి: జపాన్‌లో ఇంత క్లీన్‌గా ఉంటుందా..!)
Comments
Please login to add a commentAdd a comment