బళ్లారి అర్బన్, న్యూస్‌లైన్ :
ప్రతి రోజు ఆకుకూరలు, కూరగాయలు వంటి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని రాయచూరు, బళ్లారి, కొప్పళ పాల సమాఖ్య వ్యవస్థాపక నిర్దేశకులు సురేష్‌కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక డబుల్ రోడ్డు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాబకొ సమాఖ్య నుంచి పౌష్టిక పాలపై ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. చిన్ననాటి నుంచే నిత్యం ఉదయం గ్లాసు పాలు తాగడం, పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఉత్తమ ఆరోగ్యం పొందవచ్చన్నారు. గతంలో పెద్దలు పౌష్టికాహారం తీసుకోవడంతో సంపూర్ణ ఆరోగ్యంతో జీవించారని అన్నారు.
ప్రస్తుత సమాజంలో సరైన ఆహారం తీసుకోకపోవడంతో అనారోగ్యానికి గురవుతున్నారని విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో రాబకొ సమాఖ్య మార్కెటింగ్ అధికారులు వెంకటేశ్‌రెడ్డి, ఎర్రిస్వామి, మురళీధర్, నాగరాజ్ శర్మ, మల్లికార్జున, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సవితాకుమారి తదితరులు పాల్గొన్నారు.
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
Published Wed, Jan 29 2014 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM
Advertisement