మన చుట్టూ ఉండే ప్రకృతిలో వింత వింత జీవులు సంచరిస్తుంటాయి. కొన్ని రకాల జీవులను ఎప్పుడు చూసి ఉండం. అలాంటి జీవులు ఉన్నాయనేది కూడా మనకు తెలిసి ఉండదు. సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడిప్పుడు కొన్ని వింత జీవులను మనం చూడగల్గుతున్నాయి. తాజాగా ఓ వింత సీతాకొకచిలుకకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇప్పటివరకు సీతాకోక చిలుక అంటే రంగురంగులతో చూడముచ్చటగా ఉంటుందనే తెలుసు. కానీ ఇది మాత్రం కాస్త భిన్నంగా ఉంది. రెక్కలు ముడుచుకొని ఉన్నప్పుడు చూస్తే ఎండిపోయిన ఆకు వలె కనిపిస్తుంది. ఎగురుతోన్న సమయంలో మాత్రం రంగురంగులతో కనపడుతూ అలరిస్తోంది. తన వద్దకు ఏదైనా పక్షి వచ్చి చంపాలని చూస్తే దాన్ని మభ్యపెట్టేలా ఈ సీతాకోకచిలుక తన రెక్కలను మూసుకుంటుంది. దీంతో అది ఒక ఆకుగా భావించి ఇతర పక్షులు దానికి హాని తలపెట్టకుండా వెళ్లిపోతాయి. తన ఈ సీతాకోకచిలుక తనను తాను రక్షించుకుంటోంది.
(చదవండి : పారిపోయిన తాబేలు..74 రోజుల తిరిగొచ్చింది)
18 సెకండ్ల నిడివి గల ఈ వీడియోను బటర్‌ఫ్లై కన్జర్వేషన్ ట్విటర్‌లో షేర్ చేయగా దీనికి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ ప్రవీణ్ అంగుస్వామి రీట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ‘అద్భుతం.. ఇలాంటి సీతాకొకచిలుకను ఎప్పుడు చూడలేదు’, ‘వావ్.. ఇవి ప్రకృతి అద్భుతం’, ‘బ్యూటీపుల్ బటర్‌ఫ్లై.. ఆకర్షనీయంగా ఉంది’అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment