
సాక్షి, న్యూఢిల్లీ: టోకు ధరల ద్రవ్యోల్బణం మరోసారి దిగి వచ్చింది. వరుసగా రెండో నెలలో కూడా తగ్గిన టోకు ధరల సూచీ ఆధారిత(డబ్ల్యూపీఐ) జూన్ నెలలో2.45 శాతం నుంచి 2.02 శాతానికి దిగి వచ్చింది. దీంతో ఇది 23 నెలల కనిష్టానికి చేరింది. జూన్ 2018 లో ఇది 5.68 శాతంగా ఉంది.
ఆహార ద్రవ్యోల్బణం కూడా 5.01 శాతం నుంచి 5.04 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 6.99 శాతం 6.98 శాతంగా ఉంది. ఏప్రిల్‌లో 7.37శాతంగా ఉంది. కూరగాయల ద్రవ్యోల్బంణం మే నెలలోని 24.76తో పోలిస్తే..33.16 శాతానికి ఎగగిసింది. ఆహార పదార్థాలు, కూగాయల ధరలు, ఇంధన, విద్యుత్ ధరలు తగ్గుముఖం పట్టడంతో ద్రవ్యోల్బణం చల్లబడింది.
Comments
Please login to add a commentAdd a comment