సాక్షి, న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టు మాసంలో కొద్దిగా శాంతించింది. టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) జూలైలో ఇది 5.09 శాతంతో పోలిస్తే ఆగస్టు నెలలో 4.53 శాతానికి తగ్గింది. జూలై నాటి నాలుగేళ్ల గరిష్టంనుంచి నాలుగు నెలల కనిష్టానికి చేరింది. అయితే గత ఏడాది ఇదే కాలంలో 3.24శాతంగా ఉంది.
శుక్రవారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఆగస్టు 2018 నాటికి ఆహార ద్రవ్యోల్బణం 4.04 శాతంగా నమోదైంది. ప్రాథమిక వస్తువుల ద్రవ్యోల్బణం గత నెలలో 1.73 శాతం నుంచి ఆగస్టు మాసంలో 0.1 శాతానికి తగ్గింది. ఇంధన, విద్యుత్ రంగాల ద్రవ్యోల్బణం ఆగస్టులో 17.73శాతంగా నమోదైంది. 64 శాతం మెజారిటీ వాటా ఉండే ఆహార పదార్థాలు, పొగాకు, కెమికల్స్, ఔషధ ఉత్పత్తులు, టోకు ధరల సూచీ 0.3 శాతంగా నమోదైందని గణాంకాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా కూరగాయల ధరలు క్షీణించడంతో ద్రవ్యోల్బణం దిగి వచ్చిందిని తెలిపింది. కాగా గత ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణ రేటు 1.18 శాతంగా నమోదు కాగా ఈ ఏడాది ఇదే కాలంలో ఈ ద్రవ్యోల్బణం రేటు 3.18 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment