సాక్షి, న్యూఢిల్లీ: టోకు ధరల ద్రవ్యోల్బణం 22నెలల కనిష్టానికి దిగి వచ్చింది. మే నెల టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) గణాంకాలను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఆహార ద్రవ్యోల్బణం, ఇంధనం, విద్యుత్ వస్తువుల ధరలు పడిపోవడంతో ద్రవ్యోల్బణం మే నెలలో 2.45 శాతానికి తగ్గింది. ఇది ఏప్రిల్ నెలలో 3.07 శాతంగా నమోదైంది. గత ఏడాది మే నెలలో టోకు ద్రవ్యోల్బణం 1.88 శాతంగా నమోదైంది.
ఆహార ద్రవ్యోల్బణం 6.99 శాతంగా ఉంది, ఏప్రిల్‌లో ఇది 7.37 శాతంగా ఉంది. అయితే ఏప్రిల్ నెలలో ద్రవ్యోల్బణం 15.89 శాతంగా నమోదైంది. కూరగాయల ద్రవ్యోల్బణం మే నెలలో 33.15 శాతానికి తగ్గింది. అంతకు ముందు నెలలో ఇది 40.65 శాతంగా ఉంది. ఇంధన, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 3.84 శాతం నుంచి 0.98 శాతానికి తగ్గింది. తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం మే నెలలో 1.28 శాతంగా నమోదైంది. గత నెలలో 1.72 శాతం నమోదైంది. మరోవైపు మే నెల రిటైల్ ద్రవ్యోల్బణం 3.05శాతం వద్ద 7 నెలల గరిష్ఠానికి చేరిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment