సాక్షి, న్యూఢిల్లీ: ఏప్రిల్ నెల టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్టాన్ని తాకింది. మార్చి నెల 2.47 శాతంతో పోలిస్తే ఏప్రిల్ నెలలో 3.18శాతంగా నమోదైంది. ప్రధాన ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 3.6 శాతంగా ఉంది. ఆహార ధరల్లో పెరుగుదలో దీనికి దారి తీసింది.
ప్రభుత‍్వం సోమవారం విడుదలచేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్‌లో ఆహార ద్రవ్యోల్బణం 0.67 శాతంగాఉంది. గత నెలల ఇది -0.07గా ఉండగా. ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం 0.87 శాతానికి పెరిగింది. గత నెలలో -0.29 శాతానికి పెరిగింది. నుంచి 0.0 శాతానికి పెరిగింది.సహజ వాయువు, ముడి పెట్రోలియం 2.4 శాతం పెరిగింది. గత నెలలో 80.2 శాతం నుంచి 82.1 శాతంగా నమోదైంది. కాగా డబ్ల్యుపీఐ మార్చి నెలలో 2.47 శాతానికి తగ్గింది. ఆహార పదార్ధాల ధరలు తగ్గుముఖం పట్టడంతో ఎనిమిది నెలల కనిష్ట స్థాయిని తాకింది.
Comments
Please login to add a commentAdd a comment