
డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : వరుసగా రెండో నెలలో కూడా దేశీయ వార్షిక టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం తగ్గింది. ఆహార, ఇంధన ధరలు తగ్గడంతో డబ్ల్యూపీఏ జనవరి నెలలో 2.84 శాతానికి పడిపోయింది. 2017 డిసెంబర్‌లో ఇది 3.58 శాతంగా ఉంది. నవంబర్ నెలలో ఈ ద్రవ్యోల్బణం ఎనిమిది నెలల గరిష్టానికి ఎగిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి నెల నుంచి ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోంది.
రాయిటర్స్ పోల్ అంచనాల ప్రకారం ఈ ద్రవ్యోల్బణం 3.25 శాతంగా నమోదవుతుందని తెలిసింది. కానీ అంచనాల కంటే తక్కువగానే ద్రవ్యోల్బణం కిందకి దిగి వచ్చింది. ముందటి నెలతో పోలిస్తే హోల్‌సేల్ ఫుడ్ ధరలు జనవరిలో ఏడాది ఏడాదికి కేవలం 1.65 శాతం మాత్రమే పెరిగాయి.
అటు రిటైల్ ద్రవ్యోల్బణం కూడా కొద్దిగా చల్లబడింది. డిసెంబరు నాటి 17 నెలల గరిష్టంతో పోలిస్తే జనవరి నెలలో స్వల్పంగా తగ్గి 5.07శాతంగా నమోదైంది. అయితే రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా మధ్యస్థ లక్ష్యం 4 శాతం కంటే ఎక్కువగానే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment