Government Data
-
7030 విమానాలు రద్దు.. గవర్నమెంట్ డేటా
దేశీయ విమానయాన సంస్థలు ఈ ఏడాది మే 31 వరకు 7,030 షెడ్యూల్ విమానాలను రద్దు చేశాయి. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ వెల్లడించారు. మంత్రిత్వ శాఖ సోమవారం రాజ్యసభకు సమర్పించిన డేటా ప్రకారం.. క్యారియర్లు 2024లో 4,56,919 షెడ్యూల్డ్ డిపార్చర్లను నిర్వహించాలి. 2022లో 6,413 విమానాలు రద్దయ్యాయని, 2023లో ఈ సంఖ్య 7,427కి పెరిగిందని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి తెలిపారు.డిజి యాత్ర (Digi Yatra) గురించి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, దశలవారీగా దేశవ్యాప్తంగా విమానాశ్రయాలలో దీనిని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 2.5 కోట్లకుపైగా విమాన ప్రయాణికులు డిజి యాత్రను ఉపయోగించారు.డిజి యాత్ర అనేది ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ (FRT) ఆధారంగా రూపొందించారు. విమానాశ్రయాల్లోని వివిధ చెక్పాయింట్ల వద్ద కాంటాక్ట్‌లెస్ ప్రయాణం కోసం దీనిని ప్రవేశపెట్టారు. ఇందులో ప్రయాణికుల డేటా అంత ఉంటుంది. అయితే విమానం బయలుదేరిన 24 గంటల తర్వాత సిస్టమ్ నుంచి డేటా తొలగిస్తుంది. ఇది ప్రయాణికులకు సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచుతుంది. -
Afghanistan: తాలిబన్లకు కీలక సమాచారం చిక్కకూడదనే..
అఫ్గనిస్తాన్‌లో రాజ్యాధికారం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన తాలిబన్లకు గూగుల్ పెద్ద షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారం అందించేందుకు విముఖత వ్యక్తం చేసింది. అంతేకాదు అకౌంట్లు, మెయిల్స్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేసినట్లు ప్రకటించిన గూగుల్.. మరోవైపు తాలిబన్ల నుంచి వస్తున్న విజ్ఞప్తులను తోసిపుచ్చుతోంది. గత అఫ్గన్ ప్రభుత్వానికి సంబంధించిన ఈ-మెయిల్ అకౌంట్లను, మాజీ అధికారుల మెయిల్స్‌ను, అఫ్గన్ డిజిటల్ డేటా సర్వర్లను గూగుల్ తాతాల్కికంగా బ్లాక్ చేసింది. అయితే అది ఏ సంఖ్యలో అనేది గూగుల్ వెల్లడించలేదు(దాదాపు 24 ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన సమాచారం ఉన్నట్లు అంచనా). ‘‘అఫ్గన్ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని, వాటిని అన్‌బ్లాక్ చేసే విషయంపై వేచిచేత ధోరణిని అవలంభించనున్నామ’’ని శుక్రవారం గూగుల్ మాతృక సంస్థ ఆల్ఫాబెట్ ఓ ప్రకటనలో విడుదల చేసింది. ఒకవేళ తాలిబన్లు పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా.. ఆ వివరాల్ని అందించే ఉద్దేశంలో గూగుల్ లేదని తెలుస్తోంది. చంపేస్తారనే భయంతో.. తాలిబన్ల ఆక్రమణ తర్వాత ప్రభుత్వ అధికారులు, విదేశాలకు చెందిన ప్రతినిధులు అఫ్గన్ వ్యవస్థకు చెందిన కీలక సమాచారానికి(డాటా)ను వదిలేసి పారిపోయారు. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన వివరాల్ని వెల్లడించాలంటూ గూగుల్‌కు, మైక్రోసాఫ్ట్ కంపెనీలకు మెయిల్స్ ద్వారా తాలిబన్ సంస్థ రిక్వెస్ట్ మెయిల్స్ పెడుతోంది. ఒకవేళ ఆ డాటా తాలిబన్ల చేతికి వెళ్తే పరిస్థితి ఏంటన్నది అంచనా వేయలేకపోతున్నారంతా. పైగా బయోమెట్రిక్ డేటా బేస్ ఆధారంగా చేసుకుని కొత్త ప్రభుత్వం(తాలినబ్ల నేతృత్వంలోని).. గతంలో తమకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లను, పని చేసిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గూగుల్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గప్‌చుప్ కీలక సమాచారాన్ని తాలిబన్ల చేతికి వెళ్లనివ్వకుండా భద్రపరిచే విషయంలో గూగుల్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అయితే మైక్రోసాఫ్ట్ మాత్రం ఈ విషయంలో నోరు మెదపడం లేదు. మైకోసాఫ్ట్ ఈ మెయిల్స్ సర్వీస్ ద్వారానే గతంలో అఫ్గన్ అధ్యక్ష భవనం, విదేశాంగ శాఖ, అఫ్గన్ ఏజెన్సీలన్నీ కీలక సమాచారాన్ని ఇతర దేశాలతో పంచుకున్నాయి. ఈ తరుణంలో ఆ డాటా భద్రతపై మైక్రోసాఫ్ట్ ఎలాంటి భరోసా ఇవ్వడం లేదు. పైగా స్పందించేందుకు విముఖత వ్యక్తం చేస్తోంది కూడా. హాని తలపెట్టం: తాలిబన్లు ప్రభుత్వ-ఆర్థిక సంబంధిత వ్యవహారాల కోసమే తాము డిజిటల్ డాటాను కోరుతున్నామని తాలిబన్లు చెప్తున్నారు. అమెరికాకు ఏజెంట్లుగా పని చేసిన అఫ్గన్ పౌరులను క్షమించి వదిలేస్తున్నామని ఇది వరకే ప్రకటించామని, అఫ్గన్ వ్యవస్థ సజావుగా నడవాలంటే పాత రికార్డులు తప్పనిసరిగా అవసరమని తాలిబన్లు చెప్తున్నారు. కానీ, ఈ విషయంలో తాలిబన్లను నమ్మే ప్రసక్తే లేదని అమెరికా అంటోంది. దురాక్రమణ టైంలో కీలక సమాచారానికి చెందిన సర్వర్స్‌ను తాలిబన్లు భద్రపరిచే ప్రయత్నాలు చేశారని, అఫ్గన్‌లో అమెరికా నిర్మించిన డిజిటల్ వ్యవస్థను ట్రేస్ చేసే ప్రయత్నామూ జరిగిందని అమెరికా నిఘా వర్గాలు ఆరోపిస్తున్నాయి. చదవండి: తాలిబన్లతో సంప్రదింపులు అవసరం -
Pegasus: ఏంటీ పెగాసస్.. భారీ డేటా హ్యాక్‌లో వాస్తవమెంత?
ప్రభుత్వాలకు మాత్రమే అందుబాటులో ఉండే స్పైవేర్ ‘పెగాసస్’ హ్యాకింగ్‌కు గురైందన్న వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఓవైపు భారత ప్రభుత్వం ఈ హ్యాకింగ్ కుంభకోణంలో తమ ప్రమేయం లేదని చెప్తుండగా.. మరోవైపు ఫోరెన్సిక్ టెస్టుల్లో పెగాసస్ ద్వారా డేటా హ్యాక్ అయ్యేందుకు వీలుందన్న కథనాలు కలకలం రేపుతున్నాయి. న్యూఢిల్లీ: దేశంలో మరో భారీ డేటా లీకేజీ కుంభకోణం ప్రకంపనలు మొదలయ్యాయా?. కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, మరికొందరు ప్రముఖుల్ని లక్క్ష్యంగా చేసుకుని హ్యాకర్లు రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్.. కేవలం ప్రభుత్వాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఈ స్పైవేర్ ద్వారా హ్యాకర్లు.. ప్రముఖుల ఫోన్ డేటాను చోరీ చేశారని ‘ది వైర్’ ఆదివారం ఓ కథనం ప్రచురించింది. తాజా కథనం ప్రకారం.. భారత్‌తో మరికొన్ని దేశాల ప్రముఖులను లక్క్ష్యంగా చేసుకుని ఈ హ్యాకింగ్ ఎటాక్ జరిగినట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ టెస్ట్‌లు(డేటాబేస్‌లో ఉన్న పది నెంబర్లపై పరీక్షలు) దాదాపుగా హ్యాకింగ్ జరిగిందనేందుకు ఆస్కారం ఉందని తేల్చాయని వైర్ ప్రస్తావించింది. మన దేశానికి చెందిన సుమారు 300 మంది ఫోన్ నెంబర్లు ఆ లిస్ట్‌లో ఉన్నట్లు సమాచారం. అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు, తాజా-మాజీ అధికారులు, రాజ్యాంగబద్ధ పదవిలో ఓ ప్రముఖుడు, ముగ్గురు కీలక ప్రతిపక్ష సభ్యులు, 40 మంది జర్నలిస్టుల నెంబర్లు, ఆరెస్సెస్ సభ్యులు, ఇతర ప్రముఖుల వివరాలు ఉన్నట్లు, రాబోయే రోజుల్లో వాళ్ల పేర్లను సైతం వెల్లడిస్తామని ది వైర్ పేర్కొంది. యాపిల్ ఫోన్లు వాడే ప్రముఖుల డేటా మరింత తేలికగా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉందని ఉటంకించింది. Strong rumour that this evening IST, Washington Post & London Guardian are publishing a report exposing the hiring of an Israeli firm Pegasus, for tapping phones of Modi’s Cabinet Ministers, RSS leaders, SC judges, & journalists. If I get this confirmed I will publish the list. — Subramanian Swamy (@Swamy39) July 18, 2021 దావా వేస్తాం 2018-19 నడుమ ఈ హ్యాకింగ్ ప్రయత్నం జరిగిందని, అయితే అన్ని నెంబర్లు హ్యాకింగ్‌కు గురయ్యాయా,? లేదా? అనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉందని వైర్ పేర్కొంది. వైర్‌తో పాటు వాషింగ్టన్ పోస్ట్ లాంటి అంతర్జాతీయ మ్యాగజైన్లు సైతం ఈ వార్తలను ప్రచురించాయి. మరోవైపు ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్వో గ్రూప్ (పెగాసస్‌ను అమ్మేది ఇదే) ఆరోపణల్ని ఖండించింది. నిఘా కార్యకలాపాల కోసమే ఈ స్పైవేర్‌ను ఎన్ఎస్వో ప్రభుత్వాలకు అమ్ముతుంటుంది. అలాంటిది హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశమే ఉండదని స్పష్టం చేసింది. అయితే లీక్ డేటా బేస్‌లో నెంబర్లు కనిపించినంత మాత్రనా హ్యాక్ అయినట్లు కాదని గుర్తించాలని తెలిపింది. ప్రభుత్వాలకు మాత్రమే యాక్సెస్ ఉండే Pegasus డేటా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశమే లేదని, తప్పుడు కథనాలు ప్రచురించిన వార్తా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తామని ప్రకటించింది. గతంలో కూడా.. పారిస్‌కు చెందిన ఓ మీడియా హౌజ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ద్వారా ఈ నిఘా కుంభకోణం వెలుగు చూసినట్లు సమాచారం. ఎన్ఎస్వో గ్రూప్ రూపొందించిన పెగాసస్.. సైబర్‌వెపన్‌గా భావిస్తుంటారు. కానీ, ఐఫోన్ యూజర్లనే ఇది టార్గెట్ చేస్తుందని, హ్యాకింగ్‌కు పాల్పడుతుంటుందనే ఆరోపణలు ఉన్నాయి. కానీ, ఇది ఆండ్రాయిడ్ ఫోన్లను సైతం టార్గెట్ చేస్తుందని తర్వాత తేలింది. పెగాసస్ స్పైవేర్‌కు సంబంధించి ఎన్ఎస్వో గ్రూప్ మీద ఫేస్బుక్ 2019లో ఓ దావా కూడా వేసింది. అంతేకాదు వాట్సాప్ యూజర్లను అప్రమత్తం చేసింది కూడా. ప్రస్తుతం పెగాసస్ కథనాలు పలు ఇంటర్నేషనల్ మీడియా హౌజ్‌లలో కూడా ప్రచురితం అవుతున్నాయి. -
నిరుద్యోగ యువతకు ఊరట..
సాక్షి, న్యూఢిల్లీ : ఉద్యోగాల కోత, ప్రబలుతున్న నిరుద్యోగం ఆర్థిక మందగమనంపై భయాలను పెంచుతుంటే తాజాగా వెలువడిన ప్రభుత్వ గణాంకాలు కొంత ఊరట ఇచ్చాయి. ఈ ఏడాది జనవరి -మార్చిలో పట్టణ నిరుద్యోగ రేటు 9.3 శాతానికి దిగివచ్చింది. అంతకుముందు ఏడాది ఏప్రిల్-జూన్‌లో నిరుద్యోగ రేటు 9.8 శాతంగా నమోదైంది. అయితే 2018లో జనవరి-మార్చి కాలంలో నిరుద్యోగ రేటు వివరాలు ఈ గణాంకాల్లో లేకపోవడం గమనార్హం. గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ జనవరి-మార్చి 2019 కాలానికి త్రైమాసిక బులెటిన్‌లో పట్టణ ఉపాధి, ప్రామాణికాలపై అంచనాలతో ఈ గణాంకాలు వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లోని పురుషుల్లో నిరుద్యోగ రేటు 8.7 శాతం ఉండగా గత ఏడాది ఏప్రిల్-జూన్‌లో 9 శాతంగా నమోదైంది. ఇక మహిళల్లో నిరుద్యోగ రేటు 11.6 శాతం కాగా గత ఏడాది 12.8 శాతంగా నమోదవడం గమనార్హం. కాగా, 2017-18లో 45 ఏళ్లలో ఎన్నడూలేని విధంగా దేశంలో నిరుద్యోగ రేటు 6.1 శాతంగా నమోదవడంతో మోదీ సర్కార్‌పై విపక్షాలు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. -
ఇక పంచాయతీల్లోనే డిజిటల్ సేవలు
సాక్షి, అద్దంకి: గత ప్రభుత్వాలు కాగిత రహిత పాలన ఈ–పంచాయతీ అంటూ ప్రచారం చేసుకున్నా అమలుకు నోచుకోలేదు. ప్రచార ఆర్భాటం కోసం వ్యయం చేసిన కోట్లు వృథా చేయడం మినహా ఏ పథకం పంచాయతీ స్థాయిలు అమలుకు నోచుకున్న పాపాన పోలేదు. రెండు, మూడు పంచాయతీలకు ఒక కంప్యూటరు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఈ–పంచాయతీ ఆశించిన మేర ఫలితాలు రాక కాగిత రహిత పాలన అటకెక్కింది. అయితే నూతన ప్రభుత్వ హయాంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి గ్రామ సుపరిపాలన కోసం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారు. అందులో ఒక డిజిటల్ అసిస్టెంట్‌ను నియమించడంతోపాటు, నెట్ సౌకర్యం, ఆధునాత కంప్యూటరు, ఇతర పరికరాలను ఇచ్చారు. దీంతో ఈ–పంచాయతీ పటిష్టంగా అమలై తమ సమస్యలు గ్రామ స్థాయిలోనే పరిష్కారం అవుతాయనే నమ్మకం ప్రజల్లో కలుగుతోంది. పారదర్శక సేవల కోసమే డిజిటల్ అసిస్టెంట్.. ప్రతి 50 గృహాలకు ఒక వలంటీరును నియమించిన ప్రభుత్వం, వారి ద్వారా సేకరించిన సమాచారిన్ని డిజిటలైజేషన్ చేయడానికి, ఇతర రేషన్ కార్డులు, పింఛన్ల మంజూరు, ఆధార్ కార్డు, తదితర సేవను పారదర్శకంగా గ్రామ స్థాయిలోనే అందించడం కోసం, ప్రతి రెండు వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసింది. అందులో డిజిటల్ సేవలను పారదర్శకంగా చేయడం కోసం ఒక డిజిటల్ అసిస్టెంట్‌ను నియమించింది. డిజిటల్ అసిస్టెంట్ విధులివే.. 1. గ్రామ సచివాలయంలో నియమించిన డిజిటల్ అసిస్టెంట్ గ్రామ వలంటీర్లు సేకరించిన గృహాల డేటాను కంప్యూటరీకరించాలి. 2. దరఖాస్తు రూపంలో అందిన సమస్యలను ఆయా శాఖల వారీగా విభజించి గ్రామ కార్యదర్శికి పంపాలి. 3. కార్యాలయానికి వచ్చే ప్రజలకు అడిగిన సమాచారాన్ని స్నేహపూర్వకంగా అందించాలి. 4. ప్రజల నుంచి అందిన దరఖాస్తులను జవాబుదారీ తనం కోసం రసీదులు ఇవ్వడం, ఉత్తర ప్రత్యుత్తరాలు, రికార్డు చేయడం, రికార్డుల్లో రాయడం చేయాలి. 5. అందిన దరఖాస్తును చెక్ లిస్ట్ సహాయంతో ప్రాధమిక పరిశీలన చేసి స్వీకరించాలి. 6. కార్యాలయానికి వచ్చే ప్రజలకు అవసరమైన దరఖాస్తు ఏ విధంగా నింపాలో వివరించి చెప్పాలి. 7. గ్రామ సచివాలయంలో ఉండే మొబైల్ అప్లికేషన్స్, ట్యాబ్‌లు, కంప్యూటరు సిస్టమ్స్, వంటి వాటికి సాంకేతిక మేనేజరుగా వ్యవహరించాలి. 8. జనన, మరణాలు ఆన్లైన్ చేయడం, ఆస్తి మదింపు పన్ను, డిమాండ్ మొదలైన స్థానిక ప్రభుత్వ డేటాను యాప్స్‌లో నమోదు చేసి ఆన్లైన్ చేయాలి. ఇలాంటి సేవలు అందించే డిజిటల్ అసిస్టెంట్ గ్రామ సచివాలయంలో అందుబాటులోకి రావడంతో గ్రామాల్లో ప్రజలు తమ సమస్యలను పరిష్కారం కోసమో, దరఖాస్తులు నింపడం కోసమో ఎవరి దగ్గరకు వెళ్లనవసరం లేదు. మండల కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వానికి సబందించిన అన్ని పనులు గ్రామ సచివాలయంలోనే అవుతాయని చెప్పవచ్చు. -
నాలుగున్నరేళ్ల గరిష్టానికి ఎగిసిన ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ : దేశీయ హోల్‌సేల్ ద్రవ్యోల్బణం నాలుగున్నరేళ్ల గరిష్టానికి ఎగిసింది. కొన్ని ఆహారోత్పత్తులు, ఆయిల్ ధరలు పెరగడంతో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) జూన్ నెలలో 5.77 శాతంగా నమోదైనట్టు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటాలో వెల్లడైంది. మే నెలలో డబ్ల్యూపీఐ 4.43 శాతంగానే ఉండేది. 2017 జూన్‌లో అయితే కేవలం 0.90 శాతం మాత్రమే. మొత్తం టోకు ధరల సూచీల్లో ఐదో వంతు కంటే ఎక్కువ కలిగి ఉన్న ప్రైమరీ ఆర్టికల్స్ జూన్ నెలలో 5.3 శాతం పెరిగాయి. మే నెలలో ఇవి 3.16 శాతంగా మాత్రమే ఉన్నాయి. కూరగాయల ధరలు కూడా జూన్ నెలలో 8.12 శాతానికి పెరుగగా.. బంగాళదుంప ధరలు జూన్‌లో 99.02 శాతానికి ఎగిశాయి. పప్పు ధాన్యాలు ధరలు మాత్రం రివర్స్ ట్రెండ్‌లో తగ్గుతూ వస్తున్నాయి. మే నెలలో -21.13 శాతంగా ఉన్న పప్పుధాన్యాల ధరలు, జూన్ నెలలో -20.23 శాతంగా నమోదయ్యాయి. ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం ఈ డబ్ల్యూపీఐలో 13.15 శాతం వెయిటేజ్‌ను కలిగి ఉన్నాయి. అయితే ఈ ద్రవ్యోల్బణం మాత్రం మే నెలలో 11.22 శాతంగా ఉంటే, జూన్ నెలలో ఏకంగా 16.18 శాతానికి పెరిగింది. ఇంధన ధరలు 13.90 శాతం నుంచి 17.45 శాతానికి, డీజిల్ ధరలు 17.34 శాతం నుంచి 21.63 శాతానికి ఎగిశాయి. గత వారం విడుదలైన జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం కూడా 5 శాతం ఎగిసింది. ఇది నాలుగు నెలల గరిష్టం. -
మరోసారి దిగొచ్చిన ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ : వరుసగా రెండో నెలలో కూడా దేశీయ వార్షిక టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం తగ్గింది. ఆహార, ఇంధన ధరలు తగ్గడంతో డబ్ల్యూపీఏ జనవరి నెలలో 2.84 శాతానికి పడిపోయింది. 2017 డిసెంబర్లో ఇది 3.58 శాతంగా ఉంది. నవంబర్ నెలలో ఈ ద్రవ్యోల్బణం ఎనిమిది నెలల గరిష్టానికి ఎగిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి నెల నుంచి ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోంది. రాయిటర్స్ పోల్ అంచనాల ప్రకారం ఈ ద్రవ్యోల్బణం 3.25 శాతంగా నమోదవుతుందని తెలిసింది. కానీ అంచనాల కంటే తక్కువగానే ద్రవ్యోల్బణం కిందకి దిగి వచ్చింది. ముందటి నెలతో పోలిస్తే హోల్‌సేల్ ఫుడ్ ధరలు జనవరిలో ఏడాది ఏడాదికి కేవలం 1.65 శాతం మాత్రమే పెరిగాయి. అటు రిటైల్ ద్రవ్యోల్బణం కూడా కొద్దిగా చల్లబడింది. డిసెంబరు నాటి 17 నెలల గరిష్టంతో పోలిస్తే జనవరి నెలలో స్వల్పంగా తగ్గి 5.07శాతంగా నమోదైంది. అయితే రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా మధ్యస్థ లక్ష్యం 4 శాతం కంటే ఎక్కువగానే ఉంది. -
భారత్ ఆ స్టేటస్ కోల్పోయింది
నోటు రద్దు ప్రభావం ఇంకా జీడీపీ వృద్ధిరేటుకు తగలుతూనే ఉంది. జనవరి-మార్చి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు మందగించింది. దీంతో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థ స్టేటస్ ను కూడా భారత్ కోల్పోయింది. ఈ క్వార్టర్ లో భారత జీడీపీ వృద్ధి రేటు 6.1 శాతంగానే నమోదైంది. బుధవారం విడుదల చేసిన ప్రభుత్వ డేటాలో ఈ విషయం వెల్లడైంది. ఇదే క్వార్టర్ లో చైనా జీడీపీ వృద్దిరేటు 6.9 శాతంగా ఉంది. గత క్వార్టర్ లో కూడా ప్రొవిజనల్ 7.0 శాతంగా భారత వృద్దిరేటు ఉంది. రాయిటర్స్ పోల్ ప్రకారం ఈ క్వార్టర్ లో వృద్ధిరేటు 7.1 శాతంగా ఉంటుందని అనాలిస్టులు అంచనావేశారు. కానీ అంచనాలు సైతం తప్పాయి. అంతేకాక నేడు విడుదలైన ఈ డేటా స్ట్రీట్ అంచనాలను నిరాశపరచనున్నట్టు విశ్లేషకులు చెప్పారు. ఇటీవలే మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లను పూర్తిచేసుకుంది. ఈ సమయంలో జీడీపీ వృద్ధిరేటు నిరాశపరుస్తూ వచ్చింది. ప్రధాని నవంబర్ లో తీసుకున్న నోట్ల రద్దు ప్రభావం జీడీపీ గణాంకాలపై ఇంకా ప్రభావం చూపుతూనే ఉందని విశ్లేషకులు చెప్పారు. 2016-17కు సంబంధించిన మొత్తం ఏడాదిలో కూడా వృద్ధిరేటు 7.1 శాతంగా ఉంది. ఇది ప్రభుత్వ అధికారులు అంచనాలకు అనుగుణంగానే వచ్చింది. భారత జీడీపీ వృద్దిరేటు వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో సుమారు 8 శాతం పెరుగుతుందని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసు అంచనావేసింది. 2018లో 7.7 శాతం నమోదవుతుందని పేర్కొంది. స్వాతంత్య్రం తర్వాత ప్రభుత్వం అమలుచేయబోతున్న అతిపెద్ద సంస్కరణ జీఎస్టీ, వృద్దిరేటును 2 శాతం పెంచుతుందని ఆర్థికవేత్తలంటున్నారు. మార్చి క్వార్టర్ లో వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాల్లో వృద్ధిరేటు 5.2 శాతం కాగ, మైనింగ్, క్వారింగ్ లో 6.4 శాతం వృద్ధి ఉన్నట్టు ప్రభుత్వ డేటా పేర్కొంది. తయారీ 5.3 శాతం, విద్యుత్, గ్యాస్, మంచినీళ్ల సరఫరా, ఇతర వినియోగ సేవలు 6.1 శాతం, వాణిజ్యం, రవాణా, సమాచారం 6.5 శాతం, ఆర్థికరంగం, రియల్ ఎస్టేట్, నిపుణులు సేవలు 2.2 శాతం, డిఫెన్స్, ఇతర సేవలు 17 శాతంగా వృద్ధి చెందాయి. చీఫ్ గణాంకాల అధికారి టీసీఏ అనంత్ ఈ సీఎస్ఓ డేటాను విడుదల చేశారు. -
పాకిస్థాన్ జైళ్లలో 518 మంది భారతీయులు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని జైళ్లలో 518 మంది భారతీయ ఖైదీలు మగ్గుతున్నారని తాజా గణాంకాలు ఆ దేశం వెల్లడించింది. ఇందులో అత్యధికంగా 463 మంది మత్సకారులు ఉన్నారు. ఈ నివేదికను పాకిస్థాన్ లోని భారత అధికారులకు ఆదేశం అందిచింది. రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం ప్రతీ ఆరు నెలలకొకసారి ఇరు దేశాలలో ఉన్న దాయాది దేశాల ఖైదీల వివరాలను తెలియజేయాల్సి ఉంది.