పాకిస్థాన్ లోని జైళ్లలో 518 మంది భారతీయ ఖైదీలు మగ్గుతున్నారని తాజా గణాంకాలు ఆ దేశం వెల్లడించింది.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని జైళ్లలో 518 మంది భారతీయ ఖైదీలు మగ్గుతున్నారని తాజా గణాంకాలు ఆ దేశం వెల్లడించింది. ఇందులో అత్యధికంగా 463 మంది మత్సకారులు ఉన్నారు. ఈ నివేదికను పాకిస్థాన్ లోని భారత అధికారులకు ఆదేశం అందిచింది. రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం ప్రతీ ఆరు నెలలకొకసారి ఇరు దేశాలలో ఉన్న దాయాది దేశాల ఖైదీల వివరాలను తెలియజేయాల్సి ఉంది.