లాహోర్ : పాకిస్తాన్‌లోని వివిధ జైళ్లలో 500 మంది భారతీయులు మగ్గిపొతున్నట్లు ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ లాహోర్ హైకోర్టుకు తెలిపింది. జైళ్లలో మగ్గుతున్న వారిలో అధికశాతం మత్య్సకారులేనని అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. పాక్ జైళ్లలో 996 మంది విదేశీయులు బందీలుగా ఉన్నారని.. అందులో 527 మంది భారతీయులు ఉన్నట్లు వారు వెల్లడించారు. పాక్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న మత్య్సకారులంతా.. అరేబియా సముద్రంలో పొరపాటను పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లో చేపల వేటకు వచ్చినవారేనని అధికారులు స్పష్టం చేశారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా వంద దేశాల్లో 9,476 మంది పాకిస్తాన్ జాతీయులు వివిధ నేరాల కింద జైళ్లలో ఉన్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులు లాహోర్ హైకోర్టుకు తెలిపారు. విదేశాల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న వారి విడుదల కోసం ప్రయత్నిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ కోర్టుకు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment