jails
-
ఒళ్లు గగుర్పొడిచే.. ‘అండా సెల్’
సాక్షి, సెంట్రల్ డెస్క్: దేశ స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో అండమాన్‌లోని ‘కాలాపానీ’, బర్మా (ప్రస్తుతం మయన్మార్)లో ‘మాండలే’ జైళ్లు చరిత్ర ప్రసిద్ధికెక్కాయి. లోకమాన్య బాలగంగాధర్ తిలక్‌కు నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఆరేళ్ల కఠిన కారాగార శిక్ష విధించి బర్మాలోని మాండలే జైలుకు పంపింది. ఒక్కసారి ‘కాలాపానీ’, ‘మాండలే’ జైలులో ప్రవేశిస్తే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. అత్యంత దారుణ మైన చావుని మూటగట్టుకోవాల్సిందే. ఎందుకంటే అక్కడ ఖైదీలకు విధించే శిక్షలు దారుణంగా ఉంటాయి. కాలాపానీ, మాండలే జైళ్ల తరహాలోనే ఇప్పుడు అండా సెల్స్ కూడా చాలా పాపులర్. మానవ హక్కుల కార్యకర్త, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా అక్టోబర్ 13న కన్నుమూసిన సంగతి తెలిసిందే.ఆయన నాగపూర్ సెంట్రల్ జైలులో తొమ్మిదేళ్లపాటు జైలుశిక్ష అనుభవించారు. అందులోనూ ‘అండా సెల్’లో అత్యంత కఠినమైన కారాగార శిక్షను ఎదుర్కొన్నారు. ఈయనకు ముందు నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణంలో అబ్దుల్ కరీం తెల్గీ, 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి నిషేధిత ఆయుధాలను అక్రమంగా కలిగి ఉన్నందుకు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ను అండా సెల్లో ఉంచారు. రోజులో ఉన్న 24 గంటల్లో 22.5 గంటలు అత్యంత కఠిన ఏకాంత నిర్బంధం తప్పదని తెలుసుకుంటే ఒళ్లు గగుర్పొడచక మానదు. ఈ నేపథ్యంలో ఈ అండా సెల్ ఏంటి? ఇది ఎక్కడ ఉంది? ఎలాంటి వారిని ఇందులో ఉంచుతారు? ఇప్పటివరకు ఇందులో ఎవరెవరు శిక్షను అనుభవించారు? అనే అంశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గుడ్డు ఆకారంలో..⇒ అండా సెల్ అంటే గుడ్డు ఆకారంలో ఉండే నిర్మాణం. ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 50్ఠ50 అడుగుల కంపార్ట్మెంట్లుగా విభజితమై ఉంటుంది.⇒ మహారాష్ట్రలోని ఎరవాడ (పుణే), నవీ ముంబైలోని తలోజా, నాగపూర్ సెంట్రల్ జైళ్లలో ఈ అండా సెల్స్ ఉన్నాయి. ఇక్కడే కాకుండా మనదేశంలోని పలు సెంట్రల్ జైళ్లలోనూ ఈ అండా సెల్స్ ఉన్నాయని తెలుస్తోంది. వీటిని ఆయా రాష్ట్రాల ప్రజా పనుల విభాగాలు నిర్మించాయి.⇒ 1990లో పుణేలోని ఎరవాడలో అండా సెల్‌ను నిర్మించారు.⇒అత్యంత కరడు గట్టిన నేరస్తులను, మోస్ట్ వాండెట్ ఉగ్రవాదులను, తీవ్రవాదులను, గ్యాంగ్స్టర్లను. వ్యవస్థీకృత నేరాలు చేసినవారిని ఈ అండా సెల్స్‌లో ఉంచుతారు.⇒ అమృత్‌సర్‌లో గోల్డెన్ టెంపుల్ వద్ద ఆపరేషన్ బ్లూస్టార్‌కు నాయకత్వం వహించిన ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ అరుణ్‌కుమార్ వైద్యను హత్య చేసిన ఉగ్రవాదులు హర్జీందర్ సింగ్ జిందా, సుఖ్‌దేవ్ సుఖాలను ఉరితీసే ముందు 1992లో పుణేలోని ఎరవాడలో ఉన్న అండా సెల్లో తొలిసారిగా ఉంచారు.అండా సెల్స్ ఎందుకు?అత్యంత కరడు గట్టిన నేరస్తులను సులువుగా పర్యవేక్షించడానికి, అధిక ప్రమాదం ఉన్న ఖైదీలను సురక్షితంగా ఉంచడానికి ప్రత్యేకంగా ఈ అండా సెల్స్‌ను నిర్మించారు. గుడ్డు ఆకారంలో రెండు భాగాలుగా ఉండే అండా సెల్స్ జైలు అధికారుల పెట్రోలింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. వీటిలో అత్యంత పటిష్టమైన భద్రత ఉంటుంది.ఇనుప కడ్డీలే స్నేహితులు.. ఊచలే తోబుట్టువులుఅండా సెల్స్‌లో రెండు.. బాహ్య, అంతర్గత భద్రతా వలయాలు ఉంటాయి. మిగతా బ్యారక్‌లతో పోలిస్తే అండా సెల్స్‌ను పర్యవేక్షించడానికి ఎక్కువ మంది జైలు అధికారులు ఉంటారు. అండా సెల్లో జైలుశిక్ష అత్యంత దారుణంగా ఉంటుంది. ఇందులో ఖైదీకి ఏకాంత నిర్బంధం ఉంటుంది. రోజులో 22.5 గంటల పాటు ఒంటరిగా ఉండాల్సి ఉంటుంది. ఇనుప కడ్డీలు, జైలు ఊచలు తప్ప మరో మనిషి జాడ కనిపించదు. సెంట్రల్ జైలులో అత్యంత ఒంటరిగా ఉండే సెల్.. అండా సెల్. అందులో ఉండే ఖైదీ అన్ని వైపులా ఇనుప కడ్డీలతో కప్పబడి ఉంటాడు.ఎత్తయిన గోడలే తప్ప కిటికీలు ఉండవు. పచ్చదనం ఏమాత్రం కనిపించదు. ఒక్క మాటలో చెప్పాలంటే గాలి కూడా చొరబడలేని కాంక్రీట్‌తో నిర్మితమై ఉంటుందంటే అతిశయోక్తి కాదు. గదిలో ఉన్న ఖైదీ చుట్టూ కాంక్రీట్‌ను తప్ప మరేమీ చూడలేడు. స్వచ్ఛమైన ఆక్సిజన్ కూడా అందదు. ఖైదీలు ఇతర ఖైదీలను చూడలేరు.. మాట్లాడలేరు. లైబ్రరీ, క్యాంటీన్‌కు వెళ్లే అవకాశం ఉండదు. బాత్రూమ్, టాయిలెట్ కూడా అండా సెల్లోనే అటాచ్డ్గా ఉంటాయి. అండా సెల్ నుంచి తప్పించుకోవడం అసాధ్యం. కుటుంబ సభ్యులతో ములాఖత్ కావడానికి అంతగా అవకాశాలు ఉండవు. ఏ ఖైదీని అండా సెల్‌కు పంపాలనేది ఆ జైలు సూపరింటెండెంట్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. -
జైళ్లా... కులతత్వ కూపాలా!
కులతత్వం బందీఖానాలో మగ్గుతున్న మన జైళ్లకు ఎట్టకేలకు ‘విముక్తి’ లభించినట్టే! రాజ్యాంగం అమల్లోకొచ్చి 74 యేళ్లవుతున్నా మనుస్మృతిని మించి ఆలోచించని మన కారాగారాల దివాంధ త్వాన్ని ఎండగడుతూ గురువారం సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది. ఖైదీల పుట్టుక ఆధారంగా వారిపై వివక్ష ప్రదర్శించటం, పనులు అప్పజెప్పటం రాజ్యాంగ విరుద్ధమనీ, ఈ దురాచా రాన్ని మూడు నెలల్లో కట్టిపెట్టి ఆ సంగతి తెలియజేస్తూ నివేదికలు దాఖలు చేయాలనీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం రాష్ట్రాలనూ, కేంద్ర పాలిత ప్రాంతాలనూ ఆదేశించటం హర్షించదగ్గ పరిణామం. జైళ్లు సంస్కరణాలయాలంటారు. నేరాలకు పాల్పడుతూ సమాజానికి తలనొప్పిగా మారిన వ్యక్తులను సంస్కరించటం ధ్యేయంగా కారాగారాలు ఏర్పడ్డాయి. కానీ అక్కడా బయటి సమాజంలాగే కులం కుళ్లు నిండివుందనీ, దాని ఆధారంగా భయంకరమైన వివక్ష కొనసాగుతున్నదనీ... రాజ్యాంగ అధికరణలను ఉల్లంఘిస్తూ జైళ్లలో అంట రానితనం, వెట్టిచాకిరీ రాజ్యమేలుతున్నాయనీ ఆంగ్ల వెబ్సైట్ ‘ది వైర్’లో పనిచేస్తున్న పాత్రికేయు రాలు సుకన్యా శాంత నాలుగేళ్ల క్రితం పరిశోధనాత్మక కథనం రాశారు. దాని ఆధారంగా నిరుడు సుప్రీంకోర్టులో ఆమె ప్రజాప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. ఆ పిటిషన్ పర్యవసానంగానే తాజా తీర్పు వెలువడింది. వలస పాలకుల హయాంలో ఎప్పుడో 1894లో రూపొందిన కారా గారాల చట్టం ఆధారంగా తయారైన మాన్యువల్‌లోని అంశాలే అన్ని జైళ్లలో అమలవుతున్నాయి. వాటిని పాలకులెవరూ పట్టించుకోలేదని కాదు. 2016లో కేంద్రం నమూనా మాన్యువల్‌ను తీసు కొచ్చింది. నిరుడు నమూనా జైళ్ల చట్టం కూడా రూపొందింది. కానీ జైళ్లు, మాన్యువల్స్ ఏమాత్రం మారలేదు. కానీ అడిగేదెవరు?నిర్బంధానికీ పుట్టకకూ, నిర్బంధానికీ నిరక్షరాస్యతకూ, నిర్బంధానికీ నిస్సహాయతకూ మధ్య అవినాభావ సంబంధం ఉన్నదని మన దేశంలో పదే పదే రుజువవుతోంది. జైలు శిక్షలు అనుభవిస్తు న్నవారు మాత్రమే కాదు, విచారణలో ఉన్న ఖైదీల్లో సైతం అత్యధికులు నిరుపేదలూ, నిరక్ష రాస్యులూ, అట్టడుగు కులాలవారూ, ఆదివాసీలూ ఉండటం యాదృచ్ఛికం కాదు. ఈ వర్గాలవారు దాదాపు 65 శాతం వరకూ ఉంటారు. ప్రపంచ దేశాల్లో ఈ వర్గాల సగటు 32 శాతానికి మించదని అనేక నివేదికలు చెబుతున్నాయి. యూపీఏ ఏలుబడిలో చేయని నేరానికి అరెస్టయి తొమ్మిదేళ్లపాటు ఢిల్లీ, మహారాష్ట్ర జైళ్లలో మగ్గిన పౌరహక్కుల నాయకుడు ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఇటీవల నిర్దోషిగా విడుదలయ్యాక మీడియా సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించింది జైళ్లలోని కుల వివక్ష గురించే. జైళ్లలో కుల వ్యవస్థ అమలవుతోందనీ, ఖైదీలకు కులాన్నిబట్టి పనులు ఇవ్వాలని మాన్యువల్‌లో సైతం ఉన్నదనీ ఆయన చెప్పినప్పుడు అందరూ నివ్వెరపోయారు. స్వాతంత్య్రం వచ్చి 77 యేళ్లవుతున్నా ఈ దురాచారాలు అమలవుతున్నాయంటే బయటి సమాజంలో ఉండేవారు నమ్మలేరు. ఇవే దురాచారాలు సాధారణ పౌరులు పాటిస్తే వాటి పర్యవ సానాలు తీవ్రంగా ఉంటాయి. కఠిన శిక్షలు పడతాయి. కానీ ఎంతో నాగరికంగా కనబడే రాజ్యమే కారాగారాల్లో ఈ దారుణాలు అమలు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఉదాహరణకు దారి దోపిడీలు, ఇతరేతర నేరాలు చేస్తున్నవారు ఫలానా జాతులవారు గనుక వారిపై ‘నేరస్త జాతులు’ అనే ముద్రవేశారు వలసపాలకులు. రాజ్యాంగం అమల్లోకొచ్చాక అలాంటి దురాచారం రద్దయింది. కానీ ఇప్పటికీ జైళ్లలో సంచార, నేరస్త జాతులకు చెందినవారిగా కొందరిని వర్గీకరించి వారిని విడిగా ఉంచుతున్నారనీ, వారితో అమానవీయమైన పనులు చేయిస్తున్నారనీ సుప్రీంకోర్టు నిర్ధారించింది. అలాగే జైలు రిజిస్టర్లో కులం గురించిన కాలమ్ ఉండటం, ఖైదీలను కులాలవారీగా విభజించటం, అట్టడుగు కులాలవారితో మరుగుదొడ్లు శుభ్రం చేయించటం, ఇతర పారిశుద్ధ్య పనులు అప్పగించటం యధేచ్ఛగా కొనసాగుతున్నదని ధర్మాసనం గుర్తించింది. పుట్టుక ఆధారంగా వివక్ష ప్రదర్శించరాదని రాజ్యాంగంలోని 15(1) అధికరణ చెబుతోంది. 17వ అధికరణ అంటరానితనం నేరమంటున్నది. వెట్టి చాకిరీ చేయించరాదని 23వ అధికరణ అంటున్నది. ఇంకా 14వ అధికరణ పౌరులందరినీ సమానంగా చూడాలని, 21వ అధికరణ జీవించే, స్వేచ్ఛగా మసలే హక్కు కల్పించాలని నిర్దేశిస్తోంది. ఇవన్నీ ప్రాథమిక హక్కులు. ఈ హక్కులను రాజ్యమే ఉల్లంఘించటం ఎంత అపచారం! మహారాష్ట్ర మాన్యువల్ ‘నేరస్త మహిళలు, వ్యభిచార మహిళలు, తార్పుడుగత్తెలు, యువ మహిళా ఖైదీలు’ అంటూ విభజించిందట.‘సాధారణ జైలుశిక్ష పడిన ఖైదీలు కిందికులాల వారైతే తప్ప తక్కువ స్థాయి పనులు అప్పగించరాదని ఉత్తరప్రదేశ్ మాన్యువల్ చెప్తోంది. ఫలానా కులస్తు లను మాత్రమే పారిశుద్ధ్య పనికి వినియోగించాలనీ, కిందిస్థాయి కులాలవారు వండిన ఆహారాన్ని ఆధిపత్య కులాల ఖైదీలు నిరాకరించవచ్చనీ మరో మాన్యువల్ ప్రవచిస్తోంది. వివక్ష వెనక కుల,మత విశ్వాసాలుంటే పట్టించుకోరాదని బెంగాల్ మాన్యువల్ సుద్దులు చెబుతోంది. ఇవన్నీ చూస్తే జైళ్లలో మనకు తెలియని, మన రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే మరో సమాంతర వ్యవస్థ అమల వుతున్నదని అర్థమవుతుంది. ఒక సమాజ నాగరికత స్థాయిని అక్కడి జైలుని చూసి చెప్పవచ్చని విఖ్యాత రచయిత దాస్తోవిస్కీ అన్నాడు. ఇన్ని దశాబ్దాలుగా మన మధ్యే కొనసాగుతూ వచ్చిన ఈ అధమస్థాయి వ్యవస్థ మూడు నెలల్లోపు కాదు, తక్షణం రద్దు కావాలని మానవీయతగల ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. -
UAE: బంగ్లాదేశీయుల నిరసనలు.. 53 మందికి జైలుశిక్ష
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో బంగ్లాదేశ్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన పలువురు స్థానిక బంగ్లాదేశీయులకు ఒక కోర్టు జైలు శిక్ష విధించింది. ఆందోళనకారులలో ముగ్గురికి జీవిత ఖైదు కూడా విధించింది. ఈ వివరాలను యూఏఈ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.యూఏఈ ప్రభుత్వ వార్తా సంస్థ డబ్ల్యూఏఎం తెలిపిన వివరాల ప్రకారం అబుదాబిలోని ఫెడరల్ అప్పీల్ కోర్టు 53 మంది బంగ్లాదేశీయులకు 10 ఏళ్ల జైలు శిక్ష, ఒక బంగ్లాదేశీయునికి 11 ఏళ్ల జైలు శిక్ష, ముగ్గురికి జీవిత ఖైదు విధించింది. శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఈ బంగ్లాదేశీయులను దేశం నుంచి బహిష్కరించాలని కూడా కోర్టు ఆదేశించింది.బంగ్లాదేశ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా యూఏఈలోని పలు వీధుల్లో స్థానిక బంగ్లాదేశీయులు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కేసులో కోర్టు సాక్షులను కోర్టు విచారించింది. అరెస్టయిన బంగ్లాదేశీయులకు సంబంధించిన వివరాలను యూఏఈ అధికారులు విడుదల చేశారు. యూఏఈఏ ప్రభుత్వం రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్ల ఏర్పాటును నిషేధిస్తుంది. ఇక్కడ అమలులో ఉన్న చట్టం ప్రకారం భావప్రకటనా స్వేచ్ఛకు కొన్ని హద్దులు ఉన్నాయి.బంగ్లాదేశ్ ప్రభుత్వం 1971లో ముక్తిసంగ్రామ్లో పాల్గొన్న ముక్తి వాహిని సభ్యుల బంధువులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 30 శాతం మేరకు రిజర్వేషన్లు కల్పించింది. దీనికి వ్యతిరేకంగా దక్షిణాసియా దేశంలో హింసాత్మక నిరసనలు జరిగాయి. ఇవి యూఏఈలోనూ చోటుచేసుకున్నాయి. కాగా బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ముక్తివాహిని సభ్యుల రిజర్వేషన్ పరిమితిని ఏడు శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయం నిరసనకారుల పాక్షిక విజయంగా పరిగణిస్తున్నారు. -
జైళ్లలో డి అడిక్షన్ సెంటర్లు
ఆరిలోవ (విశాఖ తూర్పు): మత్తు పదార్థాలకు అలవాటుపడి ఖైదు అనుభవిస్తున్నవారి కోసం జైళ్లలో డి అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. విశాఖ కేంద్ర కారాగారాన్ని ఆమె మంగళవారం సందర్శించారు. ఆమెకు జైలు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జైలు సూపరింటెండెంట్ ఎస్.కిశోర్‌కుమార్, అదనపు సూపరింటెండెంట్ ఎం.వెంకటేశ్వరరావు, ఇతర అధికారులతో కలిసి ఆమె జైలు లోపల పర్యవేక్షించారు. ఖైదీలు ఉండే బేరక్లను పరిశీలించారు. అనంతరం జైలు బయట ప్రధాన ద్వారం వద్ద మీడియాతో మాట్లాడారు. జైలు గంజాయి ముద్దాయిలతో నిండిపోయిందన్నారు. వారిలో మంచి మార్పు తీసుకురావడానికి జైళ్లలో 20 నుంచి 30 పడకలతో కూడిన డి అడిక్షన్ సెంటర్లు ఏర్పాటుపై దృష్టి పెడతామని చెప్పారు. అసలైన గంజాయి సరఫరా చేయించిన వారిని వదిలేసి అమాయక గిరిజనులను పోలీసులు పట్టుకుని జైళ్లలో పెట్టారన్నారు. గంజాయి ముద్దాయిలకు బెయిల్ మంజూరులో ఆటంకంగా నిలిచిన షూరిటీ గురించి లీగల్‌గా పరిశీలించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చిస్తానన్నారు. జైలు సిబ్బంది సమస్యలు కూడా పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. జోనల్ ట్రాన్స్ఫర్లకు బదులుగా రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలు జరిగేటట్లు చర్యలు చేపడతామన్నారు. ఖైదీలకు గత ఐదు సంవత్సరాలుగా ఒక్కసారి కూడా క్షమాభిక్ష ఇవ్వలేదని తెలిపారు. ఈ ఏడాది ఖైదీలకు క్షమాభిక్ష కలి్పస్తామన్నారు. ఖైదీల ఆరోగ్యంపై మరింత దృష్టిపెడతామని, ఆరోగ్యశ్రీ సక్రమంగా వర్తించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టిన వారిపైన, ప్రభుత్వ భూములు ఆక్రమించినవారిపైన దర్యాప్తు జరిపిస్తామని తెలిపారు. -
రైతుల ‘చలో ఢిల్లీ’.. హర్యానా ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఫిబ్రవరి 13న రైతు సంఘాలు ‘ఢిల్లీ చలో’ మార్చ్‌కు పిలుపునివ్వడాన్ని దృష్ట్యాలో పెట్టుకుని పంజాబ్ నుండి ఢిల్లీ వరకు హై అలర్ట్ ప్రకటించారు. పంజాబ్‌లోని పలు ప్రాంతాలకు చెందిన రైతులు ఇప్పటికే తమ ట్రాక్టర్లపై నిరసన ప్రదర్శనకు బయలుదేరారు. అయితే వారిని ఢిల్లీకి రాకుండా అడ్డుకునేందుకు ఆ దారిలోని ప్రతి కూడలిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు హర్యానా పోలీసులు. హర్యానా ప్రభుత్వం చౌదరి దల్బీర్ సింగ్ ఇండోర్ స్టేడియం, సిర్సా, గురుగోవింద్ సింగ్ స్టేడియం, దబ్వాలిని తాత్కాలిక జైళ్లుగా మార్చింది. ఆందోళనకు దిగుతున్న రైతులను వీటిలో పెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే హర్యానాలోని 15 జిల్లాల్లో సెక్షన్ 144 విధించారు. ఏడు జిల్లాల్లో ఫిబ్రవరి 13 వరకు ఇంటర్నెట్ బంద్ చేశారు. డ్రోన్ల ద్వారా అధికారులు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీకి ఆనుకుని ఉన్న హర్యానా, పంజాబ్ సరిహద్దులను మూసివేయడానికి భారీ కాంక్రీట్ బారికేడ్లను ఏర్పాటు చేసి, పదునైన ముళ్ల తీగలను అమర్చారు. #WATCH | Ambala, Haryana: Shambhu border sealed ahead of the farmers' call for march to Delhi on 13th February. pic.twitter.com/9jbrddosnV — ANI (@ANI) February 12, 2024 మరోవైపు రైతుల నిరసనకు కాంగ్రెస్ మద్దతు పలికింది. పంజాబ్‌లో జరిగిన సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రైతుల ఉద్యమానికి మద్దతునిస్తున్నట్లు తెలిపారు. ఇదేసమయంలో కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో చర్చలు జరుపుతోంది. గురువారం జరిగిన మొదటి రౌండ్ చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఫిబ్రవరి 13 న నిరసనకు దిగుతున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. అయితే ఈరోజు(సోమవారం) ముగ్గురు కేంద్ర మంత్రులు రైతు సంఘాల ప్రతినిధులతో భేటీ కానున్నారు. -
బాబు కుంభకోణాలన్నీ బయటకొస్తాయి
కొవ్వూరు/ఆరిలోవ (విశాఖ తూర్పు): చంద్రబాబు అవినీతి కుంభకోణాలన్నీ బయటకొస్తాయని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. నేరం చేసి జైలుకు వెళ్లిన చంద్రబాబునాయుడుకి విధేయులుగా ఉన్న కొందరు చట్టాన్ని తప్పుపట్టటం సరికాదని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు స్పష్టమైన సాక్ష్యాదారాలున్నందునే న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించిందని చెప్పారు. చంద్రబాబు జైలుకెళ్లడం పట్ల ప్రజలు సంతోషంతో ఉన్నారని, అందుకే టీడీపీ చేపట్టిన బంద్‌లో ప్రజలు పాల్గొనలేదని తెలిపారు. విశాఖపట్నంలో సోమవారం ప్రారంభమైన జైళ్లశాఖ జాతీయ సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతోను, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ‘సాక్షి’తోను మాట్లాడారు. నేరం చేసినవారు ఎంతటివారైనా చట్టం దృష్టిలో సమానులేనని చెప్పారు. టీడీపీ నాయకులు, కొన్ని చానళ్లు, పత్రికలు చట్టాన్ని, న్యాయవ్యవస్థను తప్పుపట్టడం మంచిది కాదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.371 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తే, దాన్ని రాజకీయ వైరంగా చిత్రీకరించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. రాజధానికి వేలాది ఎకరాల భూముల సేకరణ విషయంలో బినామీల పేరుతో చంద్రబాబు రూ.వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. తెలంగాణలో ఓటుకి కోట్లు కేసులో సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికిపోయాడన్నారు. రాజధానిలో అసైన్డ్ భూముల కుంభకోణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాల వారి భూములను చంద్రబాబు, ఆయన మనుషులు దోచుకున్నారని చెప్పారు. ఏపీ ఫైబర్‌నెట్ కుంభకోణంపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుతో పాటు రామోజీ కొడుకు వియ్యంకుడు ఆర్.వి.ఆర్.రఘు కేంద్ర ఐటీశాఖ అధికారులకు దొరికిపోవడం వలన రాజధాని కుంభకోణాలు విచారించడానికి వీల్లేదని వాదిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ ఐటీశాఖ చంద్రబాబుకి అవినీతిపై నోటీసులిస్తే పచ్చమీడియా నోరు మెదపడం లేదన్నారు. రూ.2 వేలకోట్ల లావాదేవీలు చేశారని, చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ప్రధాన నిందితుడని ఐటీశాఖ సాక్ష్యాధారాలతో నోటీసులిచి్చనా విచారణగానీ, అరెస్ట్గానీ చేయకూడదా.. అని ప్రశ్నించారు. ఇంతకాలం చంద్రబాబు దేశంలో వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ, స్టేలు తెచ్చుకుంటూ కాలం గడిపారని చెప్పారు. చంద్రబాబు వేలకోట్ల అవినీతికి పాల్పడుతూ దుష్టచతుష్టయానికి వాటాలు పంచుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్‌తో అవినీతి భాగస్వాముల వెన్నులో వణుకు పుడుతోందన్నారు. అవినీతికి పాల్పడిన కేసులో చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ప్రతీకారంతో చేశారంటూ టీడీపీ, జనసేన, పచ్చమీడియా ప్రజలను నమ్మించేందుకు అష్టకష్టాలు పడుతున్నట్లు ఎద్దేవా చేశారు. అవినీతి డొంక కదిలింది ఇంతకాలం చంద్రబాబు రాజకీయాలను వ్యాపారంగా మార్చుకుని అవినీతి సామ్రాజ్యాన్ని నడిపారని హోంమంత్రి వనిత అన్నారు. ఇప్పుడు చంద్రబాబు అవినీతి డొంక కదిలిందని, ఒక్కో కుంభకోణం బయటపడుతుందని చెప్పారు. ఈ వ్యవహారంలో లోకేశ్‌పైన కూడా అనుమానాలున్నాయని, సీఐడీ దర్యాప్తు చేస్తోందని తెలిపారు. చంద్రబాబు అరెస్టు తర్వాత ప్రజాజీవనానికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రంలో 144 సెక్షన్ విధించినట్లు చెప్పారు. దీనిపై పోలీసులు బాధ్యతాయుతంగా వ్యహరించారని ఆమె పేర్కొన్నారు. -
ప్రపంచలోనే అత్యంత పురాతన జైళ్లు ఇవే.. వందల ఏళ్ల కిందటే నిర్మాణం
-
నేర నిలయాలు!
ఒక సమాజ నాగరికత స్థాయిని అంచనా వేయాలంటే అక్కడున్న జైళ్లను ముందుగా చూడాలన్నాడు విశ్వవిఖ్యాత రచయిత ఫ్యూదోర్ డాస్టోవిస్కీ. దాన్నే గీటురాయిగా తీసుకుంటే అన్ని వ్యవస్థలూ సిగ్గు పడాల్సిందే. మన దేశంలో జైళ్ల స్థితిగతుల గురించి ఏటా జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) వెల్లడించే అంశాలు కంగారు పుట్టిస్తుంటాయి. ఇతర జైళ్ల సంగతలావుంచి దేశంలోనే అతి పెద్దదయిన తిహార్ జైలు గురించి కథలు కథలుగా చెబుతుంటారు. ఈ జైలు దేశంలో మాత్రమే కాదు...దక్షిణాసియా దేశాల్లోనే అతి పెద్దది. అలాంటిచోట నెలరోజుల వ్యవధిలో రెండో హత్య జరిగిందంటే ఎవరికైనా దిగ్భ్రాంతి కలుగుతుంది. గత నెల 14న రౌడీ షీటర్, ఒక హత్య కేసు ముద్దాయి అయిన ప్రిన్స్ తెవాతియా అనే యువకుణ్ణి అతని ప్రత్యర్థి వర్గం హతమార్చింది. రెండూ వర్గాలూ పదునైన ఆయుధాలతో దాడి చేసుకోవటంతో నలుగురు గాయపడ్డారు. వారిలో ఒకడైన తెవాతియా మరణించాడు. దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియదుగానీ, గతవారం టిల్లూ తాజ్‌పురియా అనే గూండాను ప్రత్యర్థివర్గం దాడిచేసి మట్టుబెట్టింది. నిరుడు ఢిల్లీలోని రోహిణి కోర్టు కాంప్లెక్స్‌లో జరిగిన గూండా జితేందర్ గోగి మరణానికి టిల్లూ తిహార్ జైలునుంచే పథక రచన చేశాడని అప్పట్లో అధికారుల దర్యాప్తులో తేలింది. జైళ్లను సంస్కరణాలయాలుగా ఎంత చెప్పుకున్నా అందుకు అనుగుణమైన చర్యలు అంతంతమాత్రమే. ఏ నేరమూ చేయకుండానే కేసుల్లో ఇరుక్కుని వచ్చే అమాయకులతోపాటు రకరకాల నేరాలు చేసి అక్కడికొచ్చేవారు కూడా అధికంగా ఉంటారు జైళ్లలో పర్యవేక్షణ అంత సులభం కాదు. అందునా తిహార్ జైలు రాజకీయ నాయకులకూ, గూండాలకూ, కరడుగట్టిన నేరగాళ్లకూ, చిల్లర నేరగాళ్లకూ నిలయం. అక్కడ పరిస్థితి చేయిదాటిందంటే ఎంతటి ప్రమాదమైనా చోటుచేసుకోవచ్చు. అయితే సమస్య ఉందని గుర్తించి నపుడు దానికి తగిన పరిష్కారం వెదకాలి. ఎక్కడో ఒకచోట ఆ సమస్యకు అడ్డుకట్ట పడాలి. కానీ అది ఎవరికీ పట్టినట్టు లేదు. ఫలితంగా జైల్లో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటం, చంపుకోవటం, బయటనున్న ప్రత్యర్థుల్ని మట్టుబెట్టడానికి పథక రచన చేయటం యధేచ్ఛగా సాగిపోతోంది. మరీ ఘోరం జరిగితే తప్ప అన్నీ బయటకు రావు. తిహార్ జైలు 400 ఎకరాల విస్తీర్ణంలో 9 జైళ్లుగా ఉంటుంది. అక్కడ 10,026మందిని ఖైదు చేయ టానికి వీలుండగా, అంతకు రెట్టింపు మంది ఉంటారు. ఆ జైల్లో అత్యధికంగా ఉండేది ఉత్తరాదివారు గనుక జైలు భద్రతను తమిళనాడు స్పెషల్ పోలీస్(టీఎన్‌ఎస్‌పీ)కి అప్పగించారు. ఆ విభాగంనుంచి దాదాపు వేయిమంది సిబ్బంది తిహార్ జైల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వారితోపాటు అనుకోని పరిస్థితులు తలెత్తితే ఎదర్కొనడానికి ఇండో టిబెటిన్ సరిహద్దు పోలీస్(ఐటీబీపీ) సన్నద్ధంగా ఉంటుంది. కానీ టిల్లూను ప్రత్యర్థివర్గం కొట్టిచంపినప్పుడు అందరూ ప్రేక్షకపాత్ర వహించారని సీసీటీవీ ఫుటేజ్‌లో బయటపడింది. ఇప్పటికైతే ఏడుగురు టీఎన్‌ఎస్‌పీ అధికారులను సస్పెండ్ చేశారు. ఇందువల్ల అంతా మారిపోతుందనుకోవటం అత్యాశే. నిజానికి కొన్ని దేశాల జైళ్లతో పోలిస్తే మన జైళ్లు మరీ అంత కిక్కిరిసినట్టు భావించనక్కరలేదని కొందరి వాదన. అది నిజమే కావొచ్చు గానీ...మన జైళ్లు కూడా రకరకాల కారణాలతో పరిమితికి మించిన ఖైదీలతోనే నిండి ఉంటున్నాయి. జైళ్లలో ఉండేవారంతా నేరస్తులు కాదు. అందులో విచారణలో ఉన్న ఖైదీలు కూడా ఉంటారు. చెప్పా లంటే మన ప్రభుత్వాల విధానాల వల్లనో, అలసత్వం వల్లనో ఈ రెండో క్యాటగిరీవారే అధికం. విచారణలో ఉండే ఖైదీల్లో క్షణికావేశంలో ఏదో ఒక తప్పు చేసి కేసుల్లో ఇరుక్కొని వచ్చేవారు ఎక్కువ. అలాగే పల్లెటూళ్లలో పెత్తందార్ల ఆగ్రహానికిగురై అకారణంగా జైలుపాలైనవారూ ఉంటారు. అటువంటివారిని గుర్తించి వెంటవెంటనే విడుదల చేయగలిగితే జైళ్లు ఇంత చేటు కిక్కిరిసిపోయే అవకాశం ఉండదు. ఇలాంటివారిని జైళ్లలో ఉంచటం వల్ల కలిగే మరో అనర్థం ఏమంటే... తప్పు చేయటం పెద్ద నేరమేమీ కాదన్న భావన వారిలో కలిగినా కలగొచ్చు. ఎన్డీటీవీ యాంకర్‌గా పనిచేసిన సునేత్రా చౌదరి ఆరేళ్లక్రితం రాసిన ‘బిహైండ్ బార్స్’ అనే పుస్తకం ఈ సంగతినే హెచ్చరిస్తుంది. ముఖ్యంగా తిహార్ జైల్లో అడుగడుగునా కనిపించే అవినీతిని, సంపన్నుల ఇంట పుట్టి నేరాల్లో ఇరుక్కొని జైలుకొచ్చేవారికి దక్కే రాచమర్యాదలనూ పుస్తకం వివరిస్తుంది. కిరణ్ బేడీ తిహార్ జైలు సూపరింటెండెంట్‌గా ఉన్నకాలంలో అక్కడ సంస్కరణలు చేపట్టినట్టు, అందువల్ల ఎన్నో మంచి ఫలితాలు వచ్చినట్టు మీడియాలో కథనాలు వెలువడేవి. కానీ ఆ తర్వాత అంతా మామూలే. సిబ్బంది కొరత, విచారణలో ఉన్న ఖైదీలకు సకాలంలో న్యాయ సహాయం అందకపోవటం వంటి కారణాలవల్ల ఖైదీల పర్యవేక్షణ సక్రమంగా ఉండటం లేదు. దీన్ని అధిగమించటం కోసం కొందరు ఖైదీలను పర్యవేక్షకులుగా ఉంచే సంస్కృతి అన్నిచోట్లా కనబడుతోంది. ఇందువల్ల ఏ ఖైదీ మానసిక స్థితి ఎలావుందో, ఎవరికి వైద్య సాయం అవసరమో తెలిసే పరిస్థితి ఉండటం లేదు. జైళ్లలో తగినమంది సిబ్బందిని నియమించటం, అనవసరంగా ఉంటున్నవారి సంఖ్యను తగ్గించటం వంటివి చేయగలిగితే మెరుగైన పర్యవేక్షణకు వీలవుతుంది. అప్పుడు ఈ స్థాయిలో నేరగాళ్లు బరి తెగించే అవకాశం ఉండదు. సస్పెన్షన్లు, తొలగింపులు సిబ్బందిలో భయం కలిగిస్తాయన్నది నిజమే కావొచ్చు. కానీ అది తాత్కాలికమే. దానికి బదులు వారిపై పడే అదనపు భారాన్ని వదిలిస్తే సిబ్బంది మెరుగ్గా పనిచేయగలుగుతారు. అప్పుడు జైళ్లు నిజమైన సంస్కరణాలయాలుగా మారతాయి. -
గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న మనోళ్లు
మోర్తాడ్(బాల్కొండ): ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన మన దేశస్తులు పరాయి దేశాల చట్టాలపై అవగాహన లేక చేసిన చిన్నచిన్న తప్పులకు ఆయా దే శాల జైళ్లలోనే మగ్గిపోతున్నారు. రాయబార కా ర్యాలయాల ద్వారా న్యాయసాయం పొందే అవకాశా లు తక్కువగా ఉండడంతో ఏళ్ల తరబడి జైలు పక్షులుగానే ఉండిపోతున్నారు. విదేశీ జైళ్లలో ఉన్న భారతీయుల సంఖ్య, వారికి అందుతున్న న్యాయ సహాయంపై పలువురు ఎంపీలు పార్లమెంట్లో చర్చ లేవనెత్తారు. దీనిపై విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ ఇచ్చిన సమాధానం ప్రకారం 82 దేశాల్లో అండర్ ట్రయల్ ఖైదీలతో పాటు వివిధ కేసుల్లో శిక్షపడి జైళ్లలో ఉన్న భారతీయుల సంఖ్య 8,343 మంది అని తేలింది. ఇందులో 4,755 మంది కేవలం ఆరు గల్ఫ్ దేశాల్లోని జైళ్లలో బంధించబడి ఉన్నారు. ఆరు దేశాల జైళ్లలో ఉన్న భారతీయులతో పోలిస్తే ఇతర 76 దేశాల జైళ్లలో ఉన్న వారి సంఖ్య తక్కువగా ఉంది. గల్ఫ్ దేశాలతో పాటు మలేషి యా జైళ్లలోనూ భారతీయులు ఎక్కువగానే ఉన్నా రు. అంటే కేవలం ఉపాధి కోసం వెళ్లినవారు వీసా నిబంధనలను అతిక్రమించి జైలు పాలైనట్లు వెల్లమవుతుంది. కంపెనీల వీసాలపై వెళ్లి ఆ కంపెనీల్లో పని నచ్చకపోతే కల్లివెల్లి కార్మికులుగా మారి పనిచేయడం చివరకు పోలీసులకు దొరికిపోవడంతో జైలు పాలయ్యారు. మరికొందరు విజిట్ వీసాలపై వెళ్లి వీసా గడువు ముగిసినా అక్కడే ఉండిపోవడంతో కటకటాల పాలయ్యారు. ఇదిలా ఉండగా 31 దేశాలతో శిక్షార్హమైన వ్యక్తుల బదిలీపై మన విదేశాంగ శాఖ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇందు లో గల్ఫ్ దేశాల్లోని ఒమాన్ మినహా మిగిలిన ఐదు దేశాలున్నాయి. అయినా ఖైదు చేయబడ్డ భారతీయులకు విముక్తి లభించడం లేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించి వివిధ దేశా ల్లోని జైల్లో మగ్గుతున్న భారతీయులను మాతృదేశానికి చేరి్పంచాలని పలువురు కోరుతున్నారు. న్యాయసాయం అందించాలి గల్ఫ్ దేశాల్లో అండర్ ట్రయల్ ఖైదీలతో పాటు శిక్షపడిన ఖైదీల సంఖ్యను కేంద్రం వెల్లడించిన సంఖ్య కన్నా ఎక్కువ మందే జైళ్లలో ఉన్నారు. ఇమ్మిగ్రేషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మరో ఐదువేల మంది ఔట్ జైళ్లలో ఉన్నారని సమాచారం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయసాయం అందించాలి. – మంద భీంరెడ్డి, గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకులు -
జైళ్ల ఉన్నతాధికారి హత్య.. ఇంట్లో పనిచేసే వ్యక్తి పరార్
జమ్ముకశ్మీర్ జైళ్ల ఉన్నతాధికారి హేమంత్ లోహియా దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం ఆయన ఇంట్లో శమమై కన్పించారు. నిందితుడు ఆయనను ఊపిరాడకుండా చేసి, ఆ తర్వాత పగిలిన గ్లాస్ సీసా ముక్కతో గొంతు కోశాడని పోలీసులు తెలిపారు. అంతేకాదు శవానికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించాడని ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు. అయితే హేమంత్ లోహియా హత్య జరిగిన వెంటనే ఆయన ఇంట్లో పనిచేసే యాసిర్ పరార్ అయ్యాడు. హత్య జరిగిన కాసేపటికే ఇంట్లో నుంచి పారిపోతున్నట్లు సీసీటీవీలో రికార్డులో అయింది. పోలీసులు రంగంలోకి దిగి గంటల్లోనే అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం లోహియా ఇంట్లో యాసిర్ ఆరు నెలలుగా పని చేస్తున్నాడని జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. అతనికి ఆవేశం ఎక్కువని, మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు తెలుస్తోందని చెప్పారు. యాసిర్‌ను విచారిస్తే ఇంకా మరిన్ని విషయాలు తెలుస్తాయన్నారు. 1992 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన లోహియా(57) జమ్ముకశ్మీర్ జైళ్ల డీజీగా పనిచేస్తున్నారు. జమ్ము పరిసరాల్లో నివాసం ఉంటున్నారు. అయితే ఆయన హత్యకు గల కారణాలు మాత్రం తెలియడం లేదు. చదవండి: మోదీజీ వారిపై చర్యలు తీసుకోండి.. లేఖ రాసి సాధువు ఆత్మహత్యాయత్నం! -
జైళ్లలోని 80% మంది విచారణ ఖైదీలే
జైపూర్: దేశంలోని జైళ్లలో పెద్ద సంఖ్యలో విచారణ ఖైదీలు ఉండటం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. క్రిమినల్ జస్టిస్ వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్న ఈ అంశాన్ని పరిష్కరించేందుకు చర్యలు అవసరమని పిలుపునిచ్చారు. ఎలాంటి విచారణ లేకుండా దీర్ఘకాలంపాటు వ్యక్తుల నిర్బంధానికి దారితీస్తున్న విధానాలను ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని 6.10 లక్షల మంది ఖైదీల్లో సుమారు 80% మంది అండర్ ట్రయల్ ఖైదీలేనన్నారు. శనివారం సీజేఐ జైపూర్‌లో ఆల్ ఇండియా లీగల్ సర్వీసెస్ అథారిటీ 18వ వార్షిక సదస్సులో పసంగించారు. న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ పాల్గొన్నారు. కారాగారాలను బ్లాక్ బాక్సులుగా పేర్కొన్న సీజేఐ.. ముఖ్యంగా అణగారిన వర్గాలకు చెందిన ఖైదీల్లో జైలు జీవితం ప్రతికూల ప్రభావం చూపుతోందని చెప్పారు. విచారణ ఖైదీలను ముందుగా విడుదల చేయడమనే లక్ష్యానికి పరిమితం కారాదని పేర్కొన్నారు. ‘‘నేర న్యాయ వ్యవస్థలో, ప్రక్రియే ఒక శిక్షగా మారింది. అడ్డుగోలు అరెస్టులు మొదలు బెయిల్ పొందడం వరకు ఎదురయ్యే అవరోధాలు, విచారణ ఖైదీలను దీర్ఘకాలం పాటు నిర్బంధించే ప్రక్రియపై తక్షణం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరం’’అని ఆయన అన్నారు. దీంతోపాటు పోలీసు వ్యవస్థ ఆధునీకరణ, పోలీసులకు శిక్షణ, సున్నితత్వం పెంచడం వంటి వాటి ద్వారా క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను మెరుగుపరచవచ్చని అన్నారు. రాజకీయ వైరుధ్యం శత్రుత్వంగా మారడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సంకేతం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘వివరణాత్మక చర్చలు, పరిశీలనలు లేకుండా చట్టాలు ఆమోదం పొందుతున్నాయి’’అని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ లాయర్లకే ఎక్కువ గౌరవం: రిజిజు హైకోర్టులు, దిగువ కోర్టుల్లో కార్యకలాపాలు ప్రాంతీయ భాషల్లోనే జరిపేలా ప్రోత్సహించాలని కిరణ్ రిజిజు చెప్పారు. ఏ ప్రాంతీయ భాష కంటే ఇంగ్లిష్ ఎక్కువ కాదన్నారు. ఇంగ్లిష్ ధారాళంగా మాట్లాడగలిగినంత మాత్రాన లాయర్లు ఎక్కువ గౌరవం, ఎక్కువ ఫీజు పొందాలన్న విధానం సరికాదని చెప్పారు. కొందరు లాయర్లు ఒక్కో కేసుకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేస్తున్నారని, ఇంత ఫీజును సామాన్యులు భరించలేరని చెప్పారు. సామాన్యుడిని కోర్టుల నుంచి దూరం చేసే కారణం ఎలాంటిదైనా ఆందోళన కలిగించే అంశమేనన్నారు. -
Mahabubnagar: కారాగారంలో కర్మాగారం
స్వచ్ఛమైన డీజిల్ కావాలన్నా.. సేంద్రియ ఆకు కూరగాయాలు కొనుగోలు చేయాలన్నా.. ఇంటికోసం మన్నికైన ఫర్నిచర్ తీసుకోవాలన్నా.. చివరికి రుచికి రుచి.. అతి చవకైన ఇడ్లీలు సైతం జిల్లా జైలు వద్దనే దొరుకుతాయి. ఇవే కాదండోయ్ గోధుమపిండి, ఫినాయిల్, నోట్ పుస్తకాలు, తదితర వస్తువులు తయారవుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్నతరహా పరిశ్రమను తలపించేలా పాలమూరు జిల్లా జైలు మారింది. ఒకప్పుడు జైలు అంటే రాళ్లు కొట్టడం, వడ్రంగి పనులు చేయడం,అల్లికలు, చేతి కుట్లు లాంటివే గుర్తుకొచ్చేవి. కానీ, కాలక్రమేణా ఖైదీల ఆలోచనల్లో మార్పులు తీసుకొస్తూ.. వారి జీవితాల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తూ..వారి ఆర్థికాభివృద్ధికి జైలు అధికారులు వినూత్న సంస్కరణలను తీసుకొస్తున్నారు. అవి సత్ఫలితాలిస్తుండడంతో రాబోవు కాలంలో జైళ్లు నాణ్యతకు.. మన్నికకు పేరున్న వస్తువులు తయారయ్యే పరిశ్రమలుగా మారనున్నాయి. – మహబూబ్‌నగర్ క్రైం పెట్రోల్ బంకులో కాసుల వర్షం 2016లో జిల్లా జైలు ఆవరణలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు కారాగారానికి కాసుల వర్షం కురిపిస్తోంది. జైళ్లశాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసిన తొలి పెట్రోల్ బంక్. ప్రస్తుతం రోజుకు 7,500 లీటర్లు డీజిల్, 6వేల లీటర్ల పెట్రోల్ విక్రయిస్తుండగా.. వీటి ద్వారా నెలకు దాదాపు రూ.7 లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది. 2016 జూన్ నుంచి 2021 నవంబర్ వరకు రూ.38,291,566 ఆదాయం వచ్చింది. ప్రస్తుతం 22మంది ఖైదీలు మూడు షిప్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆరుగురు విడుదలైన ఖైదీలు ఉంటే మరో 16 మంది జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న వారు ఉన్నారు. విడుదలైన ఖైదీలకు నెలకు రూ.12వేల వేతనం ఇస్తుంటే.. శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీలకు రోజుకు రూ.150 చొప్పున వేతనం చెల్లిస్తున్నారు. ఇక ప్రతి నెల నాగర్‌కర్నూల్ బంక్ ద్వారా రూ.7 లక్షలు, కల్వకుర్తి బంక్ ద్వారా రూ.4 లక్షలు, అచ్చంపేట బంక్ ద్వారా రూ.7లక్షల ఆదాయం వస్తుంది. ఇక్కడ లభించే పెట్రోల్, డీజిల్ కల్తీ లేకపోవడంతో పాటు మైలేజీ ఇవ్వడంతో వినియోగదారులు అధి కంగా వస్తున్నారు. ఆదాయం బాగా ఉండడంతో ఉమ్మడి జిల్లాలో మరో పది బంక్‌లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర జైళ్ల శాఖ నిర్ణయించింది. జైలులో 230 ఖైదీలు.. ప్రస్తుతం జిల్లాలో 230మంది ఖైదీలు ఉంటే వీరిలో జీవిత ఖైదీలు 29, రిమాండ్ ఖైదీలు పురుషులు 181, మహిళలు 20 మంది ఉన్నారు. ప్రస్తుతం జిల్లా జైలులో ఒక సూపరింటెండెంట్, ఇద్దరు జైలర్లు, ఒక డిప్యూటీ జైలర్, ఆరుగురు హెడ్‌కానిస్టేబుల్స్, 30 మంది కానిస్టేబుల్స్ విధులు నిర్వహిస్తున్నారు. ఆకుకూరల సాగు జిల్లా జైలు ఆవరణలో ఉన్న 15 గుంటల విస్తీర్ణంలో ఆకుకూరలు సాగు చేస్తున్నారు. ఇందులో పాలకూర, తోటకూర, గోంగూర, కొత్తిమీర, మెంతికూరతో పాటు వంకాయలు కూడా పండిస్తున్నారు. వీటి బాధ్యతను నలుగురు ఖైదీలు చూసుకుంటున్నారు. వీటి ద్వారా రోజుకు రూ.2వేల వరకు ఆదాయం వస్తోంది. కొనుగోలుదారులు నేరుగా జిల్లా జైలు ఆవరణలోకి వచ్చి ఆకుకూరలు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఫినాయిల్ తయారీతో మొదలై.. జిల్లా కారాగారంలో ఖైదీలు మొదట్లో కూరగాయల పెంపకం, కలుపుతీత పనులు చేయిస్తుండేవారు. దీంతో పెద్దగా ప్రయోజనం దక్కేది కాదు. ఈ క్రమంలో 2015 ఏప్రిల్‌లో ఖైదీలకు ఫినాయిల్ తయారీ పై శిక్షణ ఇచ్చి, వారితో తయారు చేయించడం మొదలుపెట్టారు. దీంతో ఆరేళ్లలో 15వేల బాటిల్స్ తయారు చేశారు. గతేడాది నుంచి స్టీల్ ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించారు. ఇప్పటి వరకు రూ.50 లక్షల విలువైన బెంచీలు, బీరువాలు, మంచాలు, పాఠశాలలో ఉపయోగించే డెస్కును తయారు చేశారు. అలాగే 2019లో గోధుమలు కొనుగోలు చేసి జైలులో ఉన్న మిషన్ ద్వారా పిండి తయారు చేయడం ప్రారంభించారు. దీని ద్వారా రూ.1.77లక్షల అమ్మకాలు చేశారు. అలాగే 2018 నుంచి నోట్‌బుక్స్ తయారీ ప్రారంభం కాగా.. రూ.38 లక్షల ఆర్డర్లు పూర్తి చేశారు. ప్రస్తుతం ప్రతి నెల రూ.2లక్షల వరకు విక్రయాలు జరుగుతున్నాయి. వీటి తయారీ ద్వారా వచ్చే ఆదాయంలో 15 శాతాన్ని ఖైదీల వేతనాలకు చెల్లిస్తున్నారు. ఫర్నిచర్ నాణ్యతగా ఉండడంతో ఆర్డర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీటితో పాటు బైండింగ్ వర్క్, టైలరింగ్ పనిలోనూ శిక్షణ ఇస్తున్నారు. పాఠశాలల పుస్తకాలను బైండింగ్ చేస్తున్నారు. డిష్, వాష్, హ్యాండ్వ్యాష్లు సైతం తయారు చేస్తున్నారు. 2021లో 200 బీరువాలు, 100 స్టూల్స్, 100 టేబుల్స్, 200 డెస్క్‌లు, 3వేల ఫినాయిల్ బాటిల్స్ తయారు చేశారు. వీటి ద్వారా రూ.25లక్షల అమ్మకాలు చేపట్టారు. దాదాపు రూ.5లక్షల వరకు లాభపడ్డారు. ఇటీవల ఫర్నిచర్ తయారీ కోసం రూ.70 లక్షల ఆర్డర్ వచ్చాయి. ఇందుకోసం ఆరుగురు జీవిత ఖైదీలు, 15మంది రిమాండ్ ఖైదీలు పని చేస్తున్నారు. వీరికి రోజుకు రూ.100 వేతనం ఇస్తున్నారు. పరిశ్రమగా అభివృద్ధి చేస్తాం.. జిల్లా జైలులో ఉన్న పరిశ్రమను బాగా అభివృద్ధి చేస్తాం. ఆర్డర్ తీసుకుని రూ.లక్షల విలువ చేసే ఫర్నిచర్ తయారు చేసే దశకు తీసుకొస్తాం. ప్రస్తుతం ఆకుకూరలు, పెట్రోల్ బంక్, ఇతర వస్తువుల ద్వారా మంచి ఆదాయం వస్తోంది. మరింత పెంచడానికి ప్రణాళిక తయారు చేస్తున్నాం. దీంతో పాటు ఖైదీలలో మార్పు తీసుకురావడానికి చదువు నేర్పించి ఆలోచల్లో మార్పు తెస్తున్నాం. నేరం చేసి ఒకసారి వచ్చిన ఖైదీ బయటకు వెళ్లాక మరోసారి తప్పు చేయకుండా అవగాహన కల్పిస్తున్నాం. – వెంకటేశం, జిల్లా జైలు సూపరింటెండెంట్ -
హరియాణా ఆవిర్భావ దినోత్సవం: ఖైదీలకు సీఎం ఖట్టర్ తీపికబురు
చండీగఢ్: హరియాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ రాష్ట్రంలోని.. వివిధ జైళ్లలో శిక్షలను అనుభవిస్తున్నవారికి తీపికబురు అందించారు. ఇప్పటికే.. జైళ్లలో లేదా పెరోల్‌పై ఉన్న సుమారు 250 మంది నిందితులకు క్షమాభిక్ష ఇస్తున్నట్లు ప్రకటించారు. శిక్షాకాలంలో 6 నెలలు, అంతకన్నా తక్కువ కాలం ఉన్న నిందితులకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపారు. అయితే, క్రూరమైన నేరాలకు పాల్పడి శిక్షలు అనుభవిస్తున్న వారికి మాత్రం ఇది వర్తించదని సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు. చదవండి: బస్సు లోయలో పడిన ఘటన: బాధిత కుటుంబాలకు రూ.లక్ష పరిహారం Haryana CM ML Khattar announces pardoning of sentences of 250 prisoners lodged in different jails of the state or currently on parole, who have a duration of 6 months or less remaining in their sentence. This will not be applicable to convicts of heinous crimes. pic.twitter.com/BpJQS3Ymmc — ANI (@ANI) November 1, 2021 -
సీసీటీవీలు, ఆడియో రికార్డింగ్ ఉండాల్సిందే : సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ: జైళ్లు, పోలీస్ స్టేషన్లు, లాకప్‌లు, ఇతర దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు, ఆడియో రికార్డింగ్ పరికరాలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు బుధవారం కేంద్రాన్ని ఆదేశించింది. అరెస్టు చేసి, విచారణ జరిపే అధికారం ఉన్న సీబీఐ, ఈడీ,నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) తో సహా ఇతర దర్యాప్తు సంస్థల విచారణ గదుల్లో వీటిని విధిగా అమర్చాలని సుప్రీం స్పష్టం చేసింది. ప్రతి పోలీస్ స్టేషన్లో అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, మెయిన్ గేట్, లాకప్స్, కారిడార్లు, లాబీ, రిసెప్షన్ వద్ద వీటిని కచ్చితంగా ఏర్పాటు చేయాలని తేల్చి చెప్పింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు (యూటీ) ఈ మేరకు చర్యలు తీసుకునేలా చూడాలని జస్టిస్ ఆర్ఎఫ్ నరిమన్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. ఏప్రిల్ 3, 2018నాటి ఉత్తర్వులకు అనుగుణంగా మానవ హక్కుల ఉల్లంఘనను అరికట్టేందుకు అన్ని పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీం తేల్చి చెప్పింది. నవంబర్ 24 వరకు 14 రాష్ట్రాలు నివేదికలను దాఖలు చేశాయని, వాటిలో ఎక్కువ భాగం ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, తదితర వివరాలను వెల్లడించడంలో విఫలమయ్యాయని తన 12 పేజీల ఉత్తర్వులో ధర్మాసనం పేర్కొంది. సీసీటీవీ వ్యవస్థలు తప్పనిసరిగా నైట్ విజన్ కలిగి ఉండాని ఈ పుటేజ్ లేదా డేటాను కనీసం ఒక సంవత్సరం పాటు స్టోరేజ్ చేయాలని అత్యున్నత ధర్మాసనం తెలిపింది. కేంద్రం, ఆయాలు రాష్ట్రాలు, యూటీలు దీనికి సంబంధించిన పరికరాలను కొనుగోలు చేయాలని పేర్కొంది. -
జైళ్ల గోడు: మగ్గుతున్న బతుకులు
కేంద్ర హోంశాఖ ప్రకటించిన ‘మోడల్ ప్రిజన్ మాన్యువల్ 2016’ ప్రకారం ప్రతి రాష్ట్రంలో ఒక మహిళా జైలు తప్పనిసరిగా ఉండాలి. కాని దేశంలో కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుకుని కేవలం 15 రాష్ట్రాల్లోనే మహిళా జైళ్లు నిర్వహిస్తున్నారు. మిగిలిన చోట్ల వివిధ స్థాయిల జైళ్లలోనే మహిళా విభాగాలను నిర్వహిస్తున్నారు. దేశంలోని జైళ్ల నిర్వహణను, ఖైదీల స్థితిగతులను తెలియ చేసే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2019 నివేదిక అనేక విషయాలను వెల్లడి చేస్తోంది. మొత్తం ఖైదీలలో స్త్రీలు నేరానికి దూరంగా ఉంటారు. నేర స్వభావాన్ని దగ్గరకు రానీయరు. కాని దురదృష్టవశాత్తు నేరాల్లో చిక్కుకునేవారు, తెలిసీ తెలియక నేరాలు చేసినవారు ఉంటారు. ఇలాంటివారు ఇప్పుడు దేశంలో దాదాపు ఇరవై వేల మంది జైళ్లల్లో ఉన్నారని ఎన్‌సిఆర్‌బి నివేదిక తెలియచేస్తోంది. దేశంలో మొత్తం ఖైదీలు 4,78,600 మంది ఉండగా వీరిలో 19,913 మంది మహిళా ఖైదీలు. నిజానికి వీరంతా మహిళా జైళ్లలోనే ఉండాల్సి ఉన్నా అన్నిచోట్లా మహిళా జైళ్లు లేవు. దేశం మొత్తం మీద 1300 జైళ్లు ఉంటే వీటిలో 31 మాత్రమే మహిళా జైళ్లు. వీటిలో నాలుగు వేల మంది మాత్రమే మహిళా ఖైదీలు ఉన్నారు. అంటే మూడింతల మంది సాధారణ జైళ్లలోని ప్రత్యేక విభాగాలలో శిక్ష అనుభవిస్తున్నారన్న మాట. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఉత్తర ప్రదేశ్‌లో ఎక్కువమంది మహిళా ఖైదీలు ఉన్నారు. అక్కడ వారి ప్రస్తుత సంఖ్య 4,174. పెరిగిన మహిళా ఖైదీలు గత ఐదేళ్లలో దేశంలో మహిళా ఖైదీలు దాదాపు 15 శాతం పెరిగారని ఈ నివేదిక చెబుతోంది. అంటే ఈ ఐదేళ్లలో సుమారు రెండున్నర వేల మంది మహిళా ఖైదీలు జైళ్లకు తీసుకురాబడ్డారు. వీరిలో శిక్ష ఖరారైన వారు, అండర్‌ట్రయల్స్, డిటెన్యూలు ఉన్నారు. శిక్ష ఖరారైన వారి కంటే అండర్ట్రయల్సే ఎక్కువ ఉండటం గమనార్హం. పిల్లలతో పాటు ఉన్న తల్లులు 1543 మంది ఉన్నారు. వీరితో ఉంటున్న పిల్లల సంఖ్య 1779. జైలు మాన్యువల్ ప్రకారం మహిళా ఖైదీలు ఆరేళ్లలోపు పిల్లలను తమతో ఉంచుకోవచ్చు. ఆరేళ్ల తర్వాత కోరిన బంధువులకు అప్పజెబుతారు. లేదా ప్రభుత్వ నిర్వహణలో ఉండే బాలల గృహాలకు తరలిస్తారు. సవాళ్లు దేశంలో పురుష ఖైదీలకు జైళ్లలో సవాళ్లు ఉన్నట్టే మహిళా ఖైదీలకు కూడా సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా శుభ్రత, భద్రత ముఖ్యమైనవి. స్త్రీల దైహిక పరిస్థితులను గమనించి వారి అవసరాలను కనిపెట్టుకుని ఉండే మహిళా సిబ్బంది పర్యవేక్షణ లో వీరంతా ఉండాల్సి ఉంటుంది. కాని మహిళా సిబ్బంది సమస్య అధికం. పది మంది స్త్రీలకు ఒక బాత్రూమ్, టాయిలెట్ ఉండాల్సి ఉండగా అలాంటి ఏర్పాటు ఉన్న జైళ్లు బహు తక్కువ. నీళ్ల కొరత వల్ల శుభ్రత కరువై అనారోగ్యం బారిన పడే వారు ఎందరో ఉంటారు. ఒక మహిళా ఖైదీకి రోజుకు 133 లీటర్ల నీరు వాడకానికి ఇవ్వాలి అని నియమం. కాని అన్ని నీళ్లు ఇచ్చే ఏర్పాటు కూడా బహుతక్కువ. పురుషుడు నేరం చేసి జైలుకు వెళితే అతడు మాత్రమే జైలులో ఉంటాడు. కాని స్త్రీ జైలుకు రావలసి వస్తే కుటుంబమే చెదిరిపోతుంది. పిల్లలు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఇవన్నీ స్త్రీల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. కాని మహిళా ఖైదీల మానసిక ఆరోగ్యం గురించి ప్రభుత్వాలకు తక్కువ పట్టింపు ఉంది. వారి డిప్రెషన్ జైలు గది గోడల మధ్య రెట్టింపు అవుతోంది. జైళ్లలో ఉన్న చాలామందికి తాము న్యాయ సహాయం పొందవచ్చు అని తెలియడం లేదు. ప్రతి జైలుకు ప్రభుత్వం లీగల్ ఎయిడ్ క్లినిక్స్ ఏర్పాటు చేయాలి. అడ్వొకేట్లను ఏర్పాటు చేయాలి. కాని దీనిని పట్టించుకునే ప్రభుత్వాలు కూడా తక్కువ. ఇక జైళ్లలో మహిళా సిబ్బంది సంఖ్య కూడా అరకొరగా ఉంటోంది. ఇప్పుడు దేశంలో ఉన్న 20 వేల మంది మహిళా ఖైదీలకు కేవలం 7,794 మంది మహిళా సిబ్బంది ఉన్నారు. 24 గంటలూ అందుబాటులో ఉండాల్సిన వీరిని మూడు షిఫ్టులుగా విభజిస్తే ప్రతి నిర్దిష్ట డ్యూటీలో ఎంతమంది ఉంటారో ఊహించుకోవచ్చు. ప్రభుత్వాల సంరక్షణ మహిళా ఖైదీల సంరక్షణ, చదువు, చైతన్యం, పరివర్తన, ఉపాధి విషయాలలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు చురుగ్గా ఉన్నాయని నివేదిక తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఖైదీలకు కంప్యూటర్ శిక్షణ ఇస్తోందని, వారి కోసం హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తోందని, చంటి పిల్లల సంరక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశారని, మూడేళ్లు దాటిన పిల్లలను వారి బాల్యం సాధారణంగా ఉండేందుకు జైలు బయటి స్కూళ్లకు పంపుతున్నారని నివేదిక తెలిపింది. ఇవి కాకుండా టైలరింగ్, బేకరి పనులు కూడా నేర్పిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం మహిళా ఖైదీలు తమవారితో మాట్లాడటానికి మూడు మహిళా జైళ్లలో 65 టెలిఫోన్ బూత్‌లు ఏర్పాటు చేసింది. సైకాలజిస్ట్‌లను నియమించింది. గుజరాత్లో మహిళా ఖైదీలకు స్పోకెన్ ఇంగ్లిష్, బ్యూటీషియన్ కోర్సులు ఏర్పాటు చేశారు. ఢిల్లీ జైళ్లలో ఆర్టిఫీషియల్ జువెలరీ, ఆర్టిఫీషియల్ ఫ్లవర్స్ తయారీని నేర్పిస్తున్నారు. తరవాతి జీవితం శిక్ష పూర్తయిన వారు తిరిగి తమ జీవితాల్లో నిలబడటానికి, కుటుంబం నుంచి సమాజం నుంచి ఒప్పుకోలు పొందడానికి సుదీర్ఘ ప్రయత్నాలు జరగాల్సి ఉంటుంది. ఆ సమయంలో ప్రభుత్వం నుంచి, వివిధ సంస్థల నుంచి తోడ్పాటు అందినప్పుడే ఇలాంటి వారి కొత్త జీవితం మొదలవుతుంది. చాలా జైళ్లలో మహిళా ఖైదీలు కోరే కోరిక ఏమిటంటే కడుపు నిండా భోజనం పెట్టమని. పురుష ఖైదీల కంటే మహిళా ఖైదీలకు రేషన్ తక్కువగా దొరుకుతుంది. జైళ్లల్లో అనారోగ్యం పాలైన మహిళా ఖైదీలు విడుదలయ్యాక మందులకు డబ్బు లేక చనిపోవడం నాకు తెలుసు. – వర్తికా నంద, సామాజిక కార్యకర్త, ఢిల్లీ భర్త జైలులో ఉంటే భార్య అనేక అవస్థలు పడైనా డబ్బు సేకరించి బెయిల్‌కు ప్రయత్నిస్తుంది. కాని చాలా కేసుల్లో భార్య జైలులో ఉంటే భర్త ఆమెను ఆమె ఖర్మానికి వదిలేస్తాడు. జైలు నుంచి విడుదలయ్యాక ఆ స్త్రీలను పిల్లలు ఇంట్లోకి రానివ్వకపోవడం నాకు తెలుసు. కాబట్టి మహిళా ఖైదీలు విడుదలయ్యాక వారి సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎక్కువ దృష్టి పెట్టాలి. – షీరిన్ సాదిక్, సోషియాలజీ ప్రొఫెసర్, అలిగర్ యూనివర్సిటీ – సాక్షి ఫ్యామిలీ -
హిజ్రాలను ఏ జైల్లో నిర్బంధించాలి?
సాక్షి, చెన్నై : సాధారణంలో జైల్లో మహిళలకు, పురుషులకు వేరువేరుగా జైళ్లు ఉంటాయి. కానీ థర్డ్ జెండర్ ( హిజ్రా)లకు ప్రత్యేకంగా కారాగారాలు లేవు. ఈ నేపథ్యంలోనే హిజ్రాలను ఎక్కడ నిర్బంధించాలని అనే దానిపై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఓ కేసు విచారణ నిమిత్తం.. కింద కోర్టులకు హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. తమిళనాడు, పుదుచ్చేరిలో గల సెషన్స్ కోర్టులకు హైకోర్టు కొత్త నింబంధనలు రూపొందించింది. ఈ నింబంధన రాష్ట్ర ప్రభుత్వ గెజిట్‌లో విడుదల చేశారు. కొత్త నిబంధనల ప్రకారం అరెస్టయిన వారిని నేరుగా హాజరుపరిస్తే మాత్రమే వారిని జైలుల్లో నిర్బంధించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని, నేర కేసుల్లో అరెస్లయిన హిజ్రాలను జిల్లా వైద్య అధికారిచే పరీక్షలు జరిపించాలని పేర్కొంది. ఈ నివేదన ఆధారంగా మగ లక్షణాలు అధికంగా ఉంటే పురుషుల జైలుల్లో, ఆడ లక్షణాలు ఎక్కువగా ఉంటే మహిళల జైలులో నిర్బంధించవచ్చని హైకోర్టు తెలిపింది. ఇలాంటి సందర్భంగా చాలా అరుదుగా ఎదురువుతాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. -
మేం రైతుల్ని జైళ్లకు పంపం
బదౌన్/వంత్లి: తాము అధికారంలోకి వస్తే రుణం తిరిగి చెల్లించలేని రైతులను జైళ్లకు పంపబోమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. యూపీలోని అమ్లా, గుజరాత్‌లోని వంత్లిలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. ‘వేలాది కోట్లు రుణం తీసుకుని ఎగ్గొట్టిన వ్యాపారవేత్తలను దేశం విడిచి వెళ్లేందుకు అనుమతించారు. అదే, రూ.20 వేలు అప్పు తీసుకుని చెల్లించలేని రైతులను మాత్రం జైళ్లలో పెట్టారు. ఇలా ఇక జరగదు. రుణాలు తీసుకున్న బడా వ్యాపారవేత్తలను జైళ్లకు పంపుతాం. రుణం చెల్లించలేని ఒక్క రైతును కూడా జైలుకు పంపబోం’ అని రాహుల్ హామీ ఇచ్చారు. ధనికులకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయం ఉండరాదన్నారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ల్లోని తమ కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతు రుణాలను మాఫీ చేశాయన్నారు. ‘ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు బడ్జెట్లుంటాయి. ఒకటి సాధారణ బడ్జెట్ కాగా మరోటి రైతు బడ్జెట్. రైతు బడ్జెట్లో కనీస మద్దతు ధరలను, రైతు బీమా చెల్లించే మొత్తం కూడా ముందుగా ప్రకటిస్తాం’ అని రాహుల్ తెలిపారు. ‘కాపలాదారే దొంగ(చౌకీదార్ చోర్ హై)అని ఎస్పీ– బీఎస్పీ ఎన్నడూ విమర్శించకపోవడానికి కారణం.. ఆ రెండు పార్టీల అసలు గుట్టు మోదీ వద్ద ఉండటమే’ అని ఎస్పీ, బీఎస్పీలపై ఆరోపణ చేశారు. ‘నోట్లు రద్దు చేసిన మోదీ ప్రజల ధనాన్ని లాగేసుకున్నారు. ఆ డబ్బును కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుని, పేదల అకౌంట్లలో జమ చేస్తుంది’అని పేర్కొన్నారు. -
జైళ్లు ఎన్నాళ్లిలా?!
పద్దెనిమిదేళ్లనాటి మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో నిందితుడైన బుకీ సంజీవ్ చావ్లాను భారత్‌కు అప్పగిస్తూ బ్రిటన్ న్యాయస్థానం తీహార్ జైలు స్థితిగతులపై సంతృప్తి వ్యక్తం చేసి పదిరోజులు కాలేదు. దేశంలోని ఇతర జైళ్లలో నెలకొన్న పరిస్థితులపై సుప్రీంకోర్టు కటువుగా వ్యాఖ్యానించాల్సివచ్చింది. అక్కడుంటున్న ఖైదీలు మీ దృష్టిలో మనుషులో కాదో చెప్పండని ధర్మాసనం నిలదీసింది. మన న్యాయస్థానాలు ఇలా వ్యాఖ్యానించడం ఇది మొదటిసారి కాదు. ఎన్నిసార్లు ఎంతగా చెబుతున్నా అధికార యంత్రాంగంలో ఆవగింజంత మార్పయినా కనబడటం లేదు. కనుకనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత్, మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోయల్ ఫరీదాబాద్ జైలును స్వయంగా సందర్శించి అక్కడున్న పరిస్థితులకు దిగ్భ్రమచెందారు. పనికిమాలిన మరుగుదొడ్లు, ఎటుచూసినా మురుగునీరు, కట్టడిలేని కుళాయిలు, పెచ్చులూడుతున్న గోడలు చూసి అవాక్క య్యారు. న్యాయమూర్తులిద్దరూ సమర్పించిన నివేదిక ధర్మాసనాన్ని ఎంతగా కదిలించిందంటే సాధారణ ఖైదీలను కనీసం మనుషులుగా కూడా పరిగణించడంలేదని అర్ధమవుతున్నదని వ్యాఖ్యా నించింది. అక్కడికొచ్చినవారిని సంస్కరించడం మాట అటుంచి ఆ జైళ్లు మామూలు వ్యక్తులను సైతం కరడుగట్టిన నేరగాళ్లుగా మారుస్తున్నాయి. మన జైళ్లలో ఉండేవాళ్లంతా శిక్ష అనుభవిస్తున్నవారు కాదు. అత్యధికులు అంటే 62 శాతం మంది విచారణలో ఉన్న ఖైదీలు. 38శాతంమంది మాత్రమే శిక్షపడినవారు. విచారణ ఖైదీలపై ఉన్న ఆరోపణలను కోర్టులు విచారించి శిక్ష ఖరారు చేసేవరకూ వారిని నిర్దోషులుగానే పరిగణించాలి. విచారణ సమయంలో ఇలాంటివారికి బెయిల్ లభించే అవకాశం కూడా ఉంటుంది. కొందరికి బెయిల్ లభించినా అందుకవసరమైన పత్రాలు సమర్పించే స్థోమత లేక, డబ్బు ఖర్చుపెట్టలేక జైళ్లలోనే ఉండిపోతున్నారు. కానీ మన అధికార యంత్రాంగం తీరు చూస్తుంటే జైళ్లకొచ్చేవారంతా నేరస్తులేనని భావిస్తున్నట్టుంది. వారిని కష్టపెట్టడం, కనీస వసతి సౌకర్యాలు కల్పించకుండా వేధిం చడం తమ కర్తవ్యమని విశ్వసిస్తున్నట్టుంది. ఈ తీరుతెన్నులపై వస్తున్న ఫిర్యాదుల్ని విచారించిన ప్పుడల్లా న్యాయస్థానాలు ప్రభుత్వాలను నిలదీస్తూనే ఉన్నాయి. అవి ఏదో ఒక జవాబు చెబుతూ తప్పించుకుంటున్నాయి. మరోపక్క జైళ్లు రోజురోజుకూ దిగజారుతున్నాయి. సామర్థ్యానికి మించి ఖైదీలుండటంతో అవన్నీ కిటకిటలాడుతున్నాయి. చాలా జైళ్లలో 150 శాతం మొదలుకొని 609 శాతం వరకూ అధికంగా ఖైదీలు ఉంటున్నారు. ఇలాంటి జైళ్లలో అసలు పర్యవేక్షణ సాధ్యమేనా? అక్కడుంటున్నవారు ఎలా బతుకుతారన్న స్పృహే లేకుండా ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయి. నిజా నికి జైళ్లనేవి పరివర్తనాలయాలుగా ఉండాలి. తాము చేసింది తప్పిదమని గ్రహించి, తిరిగి అటు వంటి నేరానికి పాల్పడకూడదన్న వివేచన వారిలో కలగజేయాలి. సమాజంలో పక్కదోవపట్టిన కొందరిని కొన్నాళ్లపాటు ఆ సమాజానికి దూరంగా ఉంచడం, సంస్కరించడం జైళ్లు నెలకొల్పడం లోని ఉద్దేశం. కానీ అందుకు భిన్నంగా అవి నేరాలను ప్రోత్సహించే కేంద్రాలుగా తయారవుతు న్నాయి. నోరున్న ఖైదీలు సిబ్బంది ప్రాపకంతో తోటి ఖైదీలను వేధిస్తున్నారు. వారు చెప్పింది నమ్మి సిబ్బంది కూడా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా క్షణికావేశంలో తప్పిదాలకు పాల్పడిన వారు, ఊళ్లల్లో పెత్తందార్ల కారణంగా కేసుల్లో ఇరుక్కున్న అమాయకులు నేరగాళ్లుగా మారే ప్రమాదం ఏర్పడుతోంది. విచారణలో ఉన్న ఖైదీలను వారి వారి నేరాల ప్రాతిపదికన విభజించి చూస్తే అత్యధికులు చిన్న చిన్న నేరాల్లో ఇరుక్కుని జైళ్లకొచ్చివారు. ఆ కేసుల్ని వెనువెంటనే విచా రించే వ్యవస్థ ఉంటే అందులో చాలామంది నిర్దోషులుగా లేదా స్వల్ప శిక్షలతో బయటికెళ్లే అవకాశముంటుంది. దురదృష్టమేమంటే చాలామంది తాము చేసిన నేరాలకు అనుభవించాల్సిన కాలానికి మించి జైళ్లలో మగ్గుతున్నారు. జిల్లా స్థాయిలో పేరుకు విచారణ ఖైదీల సమీక్షా సంఘా లున్నాయి. అవి విడుదల కావాల్సిన ఖైదీల గురించి, బెయిల్ లభించిన ఖైదీల గురించి అవసరమైన చర్యలు తీసుకోవాలి. కానీ అవి సక్రమంగా పనిచేయడంలేదు. వాటి పనితీరుపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అమితావ్ రాయ్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. కానీ ఆ కమిటీకి అవసరమైన సమాచారాన్ని అందించడంలో, దానికి అవసరమైన సిబ్బందిని కేటాయిం చడంలో కేంద్రం శ్రద్ధ చూపడం లేదు. మన ప్రభుత్వాల నిర్లక్ష్యం చెప్పనలవికానిది. ఇందుకు శిక్ష విధించేట్టయితే చాలామంది అధికా రులు జైళ్లకెళ్లవలసి ఉంటుంది. జైళ్ల స్థితిగతుల గురించి మీ జవాబేమిటని దేశంలోని రాష్ట్రాలకూ, కేంద్రపాలిత ప్రాంతాలకూ సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నలతో నోటీసులు పంపితే కేవలం 19 ప్రభుత్వాలనుంచి మాత్రమే స్పందన వచ్చింది. మిగిలిన ప్రభుత్వాలు చేష్టలుడిగి ఉండిపోయాయి. స్పందించిన ప్రభుత్వాలు సైతం కొన్నింటిని ఎంచుకుని జవాబిచ్చాయి. న్యాయస్థానం అడిగి నప్పుడు సంపూర్ణమైన వివరాలివ్వాలన్న ఇంగిత జ్ఞానం కూడా వాటికి కరువైంది. అవి జవాబిచ్చిన మేరకు చూస్తే చాలా ప్రభుత్వాలు మైనర్ల విషయంలో చట్ట నిబంధనలను గాలికొదిలేస్తున్నాయన్న అభిప్రాయం కలుగుతున్నదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో వీరప్పమొయిలీ న్యాయశాఖ మంత్రిగా ఉండగా ఇకపై జైళ్లలో పరిమితికి మించి ఖైదీల్లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందులో భాగంగా కేసుల్ని న్యాయస్థానాలు త్వరితగతిన తేల్చేలా చర్యలు తీసుకోవడం, బెయిల్‌కు అర్హమైనవారు సాధ్యమైనంత త్వరగా బయటపడేందుకు ప్రభుత్వపరంగా తోడ్పాటునందజేయడం వగైరా చర్యలు తీసుకోబోతున్నామని చెప్పారు. కానీ ఆచరణలో అదంతా ఎటో కొట్టుకుపోయింది. నియంతలు రాజ్యమేలేచోట మాత్రమే ఇంతటి అధ్వాన్నమైన పరిస్థితులుంటాయి. దీన్నంతటినీ సరిదిద్దకపోతే మనది ప్రజాస్వామిక వ్యవస్థ అని చెప్పుకోవడానికి కూడా అర్హులం కాదని ప్రభుత్వాలు గుర్తించాలి. -
ఒక ఉరికంబం కావాలి
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదం పేరుతో మారణహోమం సృష్టించిన దోషులకు న్యాయస్థానాలు ఉరిశిక్ష తీర్పు వెల్లడించాయి. అయితే ఈ ఉరిశిక్ష అమలు చేయాల్సిన జైళ్ల శాఖ ఇప్పుడు ఆందోళనలో పడింది. రాష్ట్రంలోని ఏ జైలులో కూడా ఉరికంబాలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. తెలంగాణలో ఉరికంబం ఉన్న ఒకే ఒక్క జైలు ముషీరాబాద్ జైలు. ఇప్పుడు ఆ జైలు కనుమరుగైంది. అప్పటినుంచి ఇప్పటివరకు ఏ కేంద్ర కారాగారంలో కూడా ఉరికంబం ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం రాష్ట్ర కేంద్ర కారాగారాల్లో ఉన్న ఏడుగురు దోషులకు ఉరిశిక్ష పడింది. వీరికి ఉరివెయ్యాలంటే ఉరికంబం ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికోసం జైళ్ల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు తెలిసింది. 1978లో చివరి ఉరి... ప్రస్తుతం రాష్ట్రంలో చర్లపల్లి, చంచల్‌గూడ, వరంగల్ జైళ్లు కేంద్ర కారాగారాలుగా ఉన్నాయి. వీటిలో ఎక్కడా కూడా ఉరికంబం అందుబాటులో లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కేంద్ర కారాగారంగా ఉన్న ముషీరాబాద్, రాజమండ్రి జైళ్లలోనే ఉరికంబం ఉండేది. రాజమండ్రి జైల్లో 1976లో కిష్టప్ప అనే ఖైదీని ఉరితీశారు. అదేవిధంగా ముషీరాబాద్‌లో 1978లో మరో ఖైదీని ఉరితీశారు. ఇదే జైళ్ల శాఖలో చివరి ఉరిగా చెప్పుకుంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు రెండు రాష్ట్రాల్లో ఉరిశిక్ష పడుతున్నా ఉరి మాత్రం అమలు కాలేదని జైళ్ల శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం గోకుల్‌చాట్, దిల్సుఖ్నగర్ పేలుళ్లలో ముద్దాయిలుగా మొత్తం ఏడుగురికి ఉరిశిక్ష వేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో ఇప్పుడు ఉరికంబం విషయం చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ ఏర్పాటు చేయాలి.. పేలుళ్ల కేసుల్లో దోషులు ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో ఉన్న కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే వీరికి ఉరి అమలు చేయాల్సింది రాష్ట్ర జైళ్ల శాఖే కావడంతో తప్పనిసరిగా ఉరికంబాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికోసం జైళ్ల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధమవుతోంది. అయితే రాష్ట్రంలోని మూడు కేంద్ర కారాగారాల్లో ఏ జైల్లో ఉరికంబం ఏర్పాటు చేయాలన్న దానిపై సందిగ్ధం ఏర్పడింది. సున్నితమైన కేసుల్లో ఉరిశిక్ష పడ్డ ఖైదీలకు నగరంలోని కేంద్ర కారాగారాల్లో శిక్ష అమలుచేస్తే ఇబ్బందికర పరిస్థితులుంటాయని, అందువల్ల వరంగల్ సెంట్రల్ జైల్లో ఏర్పాటుచేస్తే బాగుంటుందని జైళ్ల శాఖ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఉరికంబం ఏర్పాటు ప్రతిపాదనపై త్వరలో ప్రభుత్వం ఓ కమిటీని నియమించి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే స్పష్టత వస్తుందని జైళ్ల శాఖ అధికారులు స్పష్టంచేశారు. -
జైళ్ల వ్యవస్థ బాగుపడుతుందా?
సంస్కరణాలయాలు కావలసిన కారాగారాలు పశువుల కొట్టాలుగా మారుతున్నాయి. ఖైదీలకూ హక్కులుంటాయని, వారూ మనుషులేనని మన ప్రభుత్వాలు మరిచినట్టున్నాయి. అందుకే అవి కిక్కిరిసిపోతున్నా, అక్కడ కనీస సౌకర్యాలు కూడా లభించక వేలాదిమంది ఇబ్బందులు పడుతున్నా వారికి పట్టడం లేదు. దేశంలో అత్యధిక జైళ్లలో పరిమితికి మించి ఖైదీలున్నారని, కొన్నిచోట్ల ఇది 150 శాతం మించిపోతున్నదని తాజాగా సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘన గనుక అన్ని రాష్ట్రాల హైకోర్టులూ దీన్ని తీవ్రంగా తీసుకుని తగిన చర్యలు చేపట్టాలని కోరింది. నిజానికి కారాగారాల స్థితిగతులెలా ఉన్నాయో ఎప్పటికప్పుడు చూసుకుంటూ వాటిని సరిచేయాల్సిన బాధ్యత పాలకులదే. కానీ యధాప్రకారం వారు పట్టనట్టు ఉంటున్నారు. జైళ్లకు సంబంధించి ప్రతి రాష్ట్రంలోనూ ప్రత్యేక వ్యవస్థలున్నాయి. లక్షల రూపా యల్లో జీతాలు తీసుకునే ఉన్నతాధికార గణం ఉంది. అయినా కారాగారాలు మాత్రం నరకాలకు నకళ్లుగానే ఉంటున్నాయి. జైళ్లలో ఉన్నవారంతా నేరస్తులు కాదు. అందులో శిక్ష పడినవారితో పాటు విచారణ ఖైదీలు కూడా ఉంటారు. నిజానికి వీరి సంఖ్యే అత్యధికం. ఆవేశంలో ఘర్షణలకు దిగి కేసుల్లో ముద్దా యిలుగా మారినవారు, అకారణంగా కేసుల్లో ఇరుక్కున్నవారు, కేసు చిన్నదే అయినా బెయిల్‌కు వీలున్నా పూచీకత్తులిచ్చేవారు దొరక్క, స్థోమత లేక మగ్గుతున్నవారు...ఇలా వేర్వేరు తరగతుల వారు అక్కడుంటారు. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో ఆదివాసులు వందలమంది తమ నేరం కూడా ఏమిటో తెలియకుండా ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. 2016 చివరినాటికి దేశంలోని జైళ్లలో 4,33,000మంది ఖైదీలున్నారని గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 2,93,000మంది...అంటే మూడింట రెండొంతుల మంది విచారణలో ఉన్నవారే. విచారణలో ఉన్న ఖైదీల్లో 25 శాతంమంది ఏడాదికన్నా ఎక్కువ కాలం నుంచి జైళ్లలో ఉంటున్నవారు. 17 రాష్ట్రాల్లో వందశాతానికి మించి, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ జైళ్లలో 150 శాతం మించి ఖైదీలుంటున్నారు. మధ్యమధ్యలో న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటూనే ఉన్నా, సాక్షాత్తూ సుప్రీంకోర్టే తప్పుబట్టినా ఈ పరిస్థితుల్లో కాస్తయినా మార్పు రావడం లేదు. పరిమితికి మించి ఖైదీలుండటం వల్ల జైళ్లలో అనేక సమస్యలొస్తున్నాయి. ముఖ్యంగా ఖైదీల ఆరోగ్యం, పరిశుభ్రత అటకెక్కుతున్నాయి. వారికి నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన ఆహారం అందడం లేదు. అందువల్ల చాలామంది ఖైదీలు జైళ్లకొచ్చాక రోగాలబారిన పడుతున్నారు. నిజానికి జైళ్ల మౌలిక ఉద్దేశం నేరస్తుల్లో మానసిక పరివర్తన తీసుకురావడం. కారాగారాల్లో ఇందుకు అవ సరమైన చర్యలన్నీ అమలు చేస్తే, వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో మంచి శిక్షణ ఇప్పిస్తే శిక్షాకాలం పూర్తయి బయటికొచ్చినవారు సమాజంలో సాధారణ పౌరుల్లా బతకడానికి వీలుంటుందన్నది దీనివెనకున్న అవగాహన. కానీ జైలుకెళ్లినవారు అక్కడి కరడుగట్టిన నేరస్తులతో సావాసం చేసి మరింత రాటుదేలుతున్నారు. శిక్షపడిన నేరగాళ్లు అక్కడి అధికారులను లోబర్చుకుని, బెదిరించి జైళ్లను శాసిస్తున్నారు. అమాయక ఖైదీలు వారి దయాదాక్షిణ్యాలపై బతికే పరిస్థితి ఉంటోంది. కొందరు నేరగాళ్లు అక్కడుంటూ సెల్ఫోన్ల ద్వారా బయట ఉన్న తమ సామ్రాజ్యాలను నడిపి స్తున్నారు. బయటికొచ్చాక అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారు. పరిమితికి మించి ఖైదీలుం డటం వల్ల జైళ్ల పర్యవేక్షణ కూడా కష్టమవుతోంది. ఎక్కడే సమస్యలొస్తున్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టవలసిన అధికారులు ఏం చేయాలో తోచక చూసీ చూడనట్టు ఊరుకుంటున్నారు. డబ్బు, పలుకుబడి ఉన్న ఖైదీలను మాత్రం ఎలాంటి లోటూ లేకుండా చూసు కుంటున్నారు. జైళ్ల అధికారులు, వార్డర్ల తీరుతెన్నులెలా ఉంటున్నాయో పట్టించుకోకపోవడం, వారికి అవసరమైన పునశ్చరణ తరగతులపై దృష్టి పెట్టకపోవడం వల్ల జైళ్ల వ్యవస్థ బండబారి పోతోంది. రెండేళ్లక్రితం జైళ్ల స్థితిగతులపై వచ్చిన ఫిర్యాదును విచారిస్తున్న సందర్భంగా జైళ్లలో మనుషుల్ని జంతువుల కన్నా హీనంగా చూస్తున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితులు కాస్తయినా మారలేదు. నేరం రుజువై శిక్ష పడినవారికి హక్కులన్నీ హరించుకుపోవు. తాత్కాలికంగా కొన్ని నిలిచి పోతాయి. కానీ ఖైదీల పట్ల అమానుషంగా వ్యవహరించడం అలవాటుగా మారింది. అక్కడ ఏం జరిగినా పట్టించుకునేవారు లేకపోవడమే ఇందుకు కారణం. చాలా అరుదుగా తప్ప జైళ్లలో జరుగు తున్నదేమిటో బయటి ప్రపంచానికి వెల్లడికాదు. దేశంలో 1,300 పైగా జైళ్లున్నాయి. ఖైదీల సంఖ్య అపరిమితంగా పెరుగుతున్నా, వీరి పర్యవేక్షణకు అవసరమైన సిబ్బంది ఉండటం లేదు. రిటైరై వెళ్తున్నవారి స్థానంలో కొత్తవారి నియామకాలు జరగటం లేదు. లెక్క ప్రకారం దేశవ్యాప్తంగా జైళ్లకు 77,230మంది సిబ్బంది ఉండాల్సిరాగా, గత డిసెంబర్‌నాటికి అందులో 30శాతానికిపైగా పోస్టులు ఖాళీ అయ్యాయి. విచారణలో ఉన్న ఖైదీల కేసుల్ని పరిశీలించి, అందులో బెయిల్‌కు అర్హులైనవారిని గుర్తించి విడుదలకు చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి కొంతైనా మారుతుంది. నిజానికి విచారణ ఖైదీల కోసం జిల్లా స్థాయిల్లో సమీక్షా సంఘాలున్నాయి. ఈ సంఘాల్లో జిల్లా న్యాయమూర్తి, కలె క్టర్, ఎస్పీ తదితరులుంటారు. విషాదమేమంటే ఈ సంఘాలిచ్చిన సూచనలు సైతం బేఖాతరవు తున్నాయి. ఇకపై ఇలా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబోతున్నామని కేంద్రం సుప్రీం కోర్టుకు తాజాగా హామీ ఇచ్చింది. అందుకవసరమైన ప్రామాణిక వ్యవహార సరళి(ఎస్ఓపీ)ని వచ్చే నెల 30కల్లా ఖరారు చేస్తామని చెప్పింది. మంచిదే. జైళ్లు సకల రుగ్మతలకూ నిలయాలుగా, నిస్స హాయుల పాలిట నరకాలుగా ఉండటం మొత్తం దేశానికే అప్రదిష్ట. ఈసారైనా ఇచ్చిన మాట నిలు పుకుని ఈ పరిస్థితిని మార్చే బాధ్యత కేంద్రానిదే. -
కారాగారాలు దేవాలయాలు
ఆరిలోవ(విశాఖతూర్పు): జైళ్లు దేవాలయాల్లాంటివని, అందులో పనిచేస్తున్న సిబ్బంది పూజారుల లాంటివారని ప్రముఖ వైద్యనిపుణుడు కూటికుప్పల సూర్యారావు తెలిపారు. విశాఖ కేంద్ర కారాగారంలో గురువారం రాష్ట్ర స్థాయి పునరశ్చరణ తరగతులు(ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ డిపార్ట్మెంట్ స్టేట్ లెవెల్ రిట్రీట్–2017) ప్రారంభమయ్యాయి. ఈ తరగతులు రెండురోజులు జరగనున్నాయి. మొదటిరోజు కార్యక్రమంలో జైల్ శాఖ ఐజీ జయవర్ధన్, కోస్త ఆంద్రా డీఐజీ ఇండ్ల శ్రీనివాస్ సమక్షంలో వివిధ కేంద్ర కారాగారాల సూపరింటెండెంట్లు, అధికారులు గత ఏడాది జైళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ఎదుర్కొనే సమస్యలు, ఖైదీల, సిబ్బంది కోసం అమలుచేసిన సంక్షేమ కార్యక్రమాలు గురించి చర్చించారు. ఇంకా 2018లో ఏఏ కార్యక్రమాలు చేపట్టదలిచారో తదితర వాటి గురించి చర్చించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ కూటికుప్పల ముఖ్యఅతిథిగా పాల్గొని జైల్ అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. జైళ్లలో పనిచేయడం అదృష్టమన్నారు. నేరాలు చేసేవారిని సత్ ప్రవర్తన గల వ్యక్తులుగా తీర్చిదిద్దే అవకాశం జైల్ సిబ్బందికే లభించిందన్నారు. వీరిద్వారా మంచి సమాజం ఏర్పడుతుందన్నారు. జైల్లో పరిశుభ్రత పాటించాలని, పరిశుభ్రత ఉన్నచోట ఆరోగ్యవంతమైన వాతావరణ లభిస్తుందన్నారు. పనిఒత్తడి అనేది సైలెంట్ కిల్లర్ అని, దాన్ని తగ్గించుకోవడానికి యోగా చేయడం మంచి విధానమని సూచించారు. ఖైదీలలో మంచి మార్పు తీసుకురావడానికి జైళ్లలో బిహేవియర్ థెరిపిస్టులు, సైకాలజిస్టులను నియమించాలన్నారు. కార్యక్రమంలో విశాఖ జైల్ సూపరింటెండెంట్ ఎస్.రాహుల్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఎస్.సన్యాసిరావు, పలు కేంద్రాకారాగారాల సూపరింటెండెంట్లు, అధికారులు పాల్గొన్నారు. -
ఖైదీలకు క్షయ, అంటురోగాలు..
జిల్లాలోని జైళ్లన్నీ ఖైదీలతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రత్యామ్నాయం లేకపోవడంతో కోడిపిల్లల్ని బుట్టలో వేసి కుక్కినట్లు కుక్కేస్తున్నారు. అండర్ ట్రయల్ ఖైదీలుగా మగ్గుతున్న వారికి అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. విడుదలయ్యేటప్పటికి పలువురు ఖైదీలు మంచంపడుతుండడం విమర్శలకు తావిస్తోంది. జైళ్లలోని దుస్థితిపై పార్లమెంటరీ స్థాయి సంఘం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను చీవాట్లు పెడుతున్నా పరిస్థితిలో ఏ మాత్రమూ మార్పురాకపోవడం గమనార్హం. తప్పట్లేదు.. తిరుపతి, సత్యవేడు లాంటి ప్రాంతాల్లో కొత్తగా జైళ్ల నిర్మాణానికి స్థలాలు కేటాయించారు. నిధుల కోసం నిరీక్షిస్తున్నాం. ఎర్రచందనం కేసుల్లో వస్తున్న వారిపై హత్యాయత్నం (ఐపీసీ 307) సెక్షన్లు పెడుతుండడంతో వీరికి బెయిల్ రావడానికి 60 నుంచి 90 రోజులు పడుతోంది. ఒక్కోసారి బెయిల్ వచ్చినా ష్యూరిటీ ఇచ్చేవారులేక ఇక్కడే ఉండిపోతున్నారు. వారికి వైద్యులతో పరీక్షలు చేయించి, మందులు కూడా ఇస్తున్నాం. మరీ సీరియస్‌గా ఉంటే ప్రభుత్వాస్పత్రులకు రెఫర్ చేస్తున్నాం. పరిమితి మించినా ప్రత్యామ్నాయం లేక తప్పని పరిస్థితుల్లో ఖైదీలను ఉంచాల్సి వస్తోంది. – బ్రహ్మయ్య, జిల్లా జైళ్ల అధికారి చిత్తూరు అర్బన్: నేరాలు, ఆరోపణల్లో పోలీసులు అరెస్టు చేస్తున్న నిందితులకు కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. పరిమితికి మించి జైళ్లలో కుక్కేస్తుండడంతో వారు అనారోగ్యం బారినపడుతున్నారు. మహిళా ఖైదీల హక్కులు కాలరాస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. జిల్లా కేంద్రమైన చిత్తూరులో జిల్లా జైలు ఉండగా తిరుపతి, పీలేరు, శ్రీకాళహస్తి, సత్యవేడు, మదనపల్లె ప్రాంతాల్లో సబ్‌జైళ్లు ఉన్నాయి. నెలకు సగటున 180 మంది ఖైదీలు జైళ్లకు వస్తుండగా అందులో 12 మంది మాత్రమే బెయిల్‌పై విడుదలవుతున్నారు. మిగిలివారు ఆరోపణలు ఎదుర్కొంటూ అండర్ ట్రయల్ ఖైదీలుగా కారాగారాల్లోనే ఉండిపోతున్నారు. ఎర్ర స్మగ్లర్లతో మరింత ఎక్కువ.. జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ ఎక్కువ. తమిళనాడు నుంచి చెట్లను నరకడానికి వస్తున్న వారిని వందల సంఖ్యలో పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో జైళ్లలో ఉండాల్సిన ఖైదీల పరిమితికంటే మూడు రెట్లు ఎక్కువ మందిని వేయక తప్పడం లేదు. వైద్యసేవలు అంతంతమాత్రమే.. ఖైదీలకు క్షయ, శ్వాసకోస, చర్మవ్యాధులతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. వ్యాధులబారిన పడుతున్న వారికి ఇక్కడ అందుతున్న వైద్య సేవలు అంతంత మాత్రమే. జైలు నుంచి విడుదలయ్యే నాటికి ఖైదీలు పూర్తిగా మంచానపడి కాటికి కాళ్లు చాపుతున్నారు. కొందరు ఆరోగ్యం బాగుచేసుకోవడానికి ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చిత్తూరు, తిరుపతి, మదనపల్లెలోని జైళ్లలో మహిళా ఖైదీలు ఉంటున్నా. వీరి హక్కులకు భంగం కలుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా చేస్తే.. అండర్ ట్రయల్ కేసుల్లో దీర్ఘకాలికంగా జైళ్లలో మగ్గిపోతున్న వారికి ఉచిత న్యాయసేవల ద్వారా బెయిల్ ఇప్పించే పద్ధతులపై అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నిందితుడు పారిపోడు, దర్యాప్తుకు సహకరిస్తాడనే కేసుల్లో పోలీసులు అరెస్టులకు ఊరటనివ్వాల్సిన అవసరం ఉందనే వాదనలున్నాయి. మహిళా ఖైదీల హక్కులకు భంగం వాటిల్లకుండా జైళ్లలోని బ్యారక్‌లలో సీసీ కెమెరాలు ఉంచడం లాంటివి చేస్తే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి జైలులో వారానికి ఒక్కసారైనా మానసిక వైద్య నిపుణుల ద్వారా ఖైదీల మనోగతాన్ని తెలుసుకుని చికిత్స చేయడం వల్ల వారిలో ఆత్మస్థైర్యం నింపొచ్చు. -
పాక్ జైళ్లలో 500 మంది భారతీయులు
లాహోర్ : పాకిస్తాన్‌లోని వివిధ జైళ్లలో 500 మంది భారతీయులు మగ్గిపొతున్నట్లు ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ లాహోర్ హైకోర్టుకు తెలిపింది. జైళ్లలో మగ్గుతున్న వారిలో అధికశాతం మత్య్సకారులేనని అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. పాక్ జైళ్లలో 996 మంది విదేశీయులు బందీలుగా ఉన్నారని.. అందులో 527 మంది భారతీయులు ఉన్నట్లు వారు వెల్లడించారు. పాక్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న మత్య్సకారులంతా.. అరేబియా సముద్రంలో పొరపాటను పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లో చేపల వేటకు వచ్చినవారేనని అధికారులు స్పష్టం చేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా వంద దేశాల్లో 9,476 మంది పాకిస్తాన్ జాతీయులు వివిధ నేరాల కింద జైళ్లలో ఉన్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులు లాహోర్ హైకోర్టుకు తెలిపారు. విదేశాల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న వారి విడుదల కోసం ప్రయత్నిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ కోర్టుకు తెలిపింది. -
జైళ్లలో 20 వేల మొబైల్ ఫోన్స్.. సిమ్స్
లండన్: బ్రిటన్‌లోని ఒక జైలు ఖైదీలకు విలాసవంతంగా మారింది. జైలుకు వెళ్లిన వాళ్లు తాము జైలుకు వెళ్లామనే ఫీలింగే రానంత ఉల్లాసంగా గడిపేస్తున్నారు. ఏకంగా ఇంట్లో ఉపయోగించినట్లే జైలులో మొబైల్ ఫోన్లు ఉపయోగించుకుంటూ సోషల్ మీడియాలో వీర విహారం చేస్తున్నారు. ఫొటోలు తీసుకుంటూ వీడియోలు తీస్తూ ఏం చక్కా ఫేస్‌బుక్‌లలో పెడుతున్నారు. ఈ విషయం బయటకు తెలిసి తనిఖీలు చేపట్టిన అధికారులకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 వేల మొబైల్ ఫోన్లు, సిమ్‌కార్డులు దొరికాయి. ఇది చూసి అధికారులు బిత్తరపోతున్నారు. గత రెండేళ్లలో దొరికిన మొబైల్ ఫోన్లకంటే ఈసారి రెట్టింపు స్థాయిలో దొరకడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోన్లన్ని కూడా ఒక్క సామాజిక మీడియాకే ఉపయోగిస్తున్నారంటే పొరపడ్డట్లే. ఎందుకంటే జైలులో ఉండి తమ నేర చరిత్రను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు. హత్యలు, డ్రగ్స్ వ్యాపారం, కిడ్నాప్లువంటి ఎన్నో పనులకు ఈ ఫోన్లనే వాడుతున్నారంట. తొలుత సామాజిక అనుసంధాన వేదిక ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయాలు చూసి న్యాయశాఖ కార్యదర్శి లిజ్ ట్రస్ కొత్త నిబంధనలు జారీ చేశారు. ఇక నుంచి అన్ని జైలల్లో మొబైల్ సిగ్నల్ల జామర్ల పెట్టాలని ఆదేశించారు. ఈ విషయంపై గతంలోనే డేవిడ్ హాన్సన్ అనే లేబర్ పార్టీకి చెందిన మాజీ న్యాయశాఖ మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాజా వాస్తవాలు వెలుగుచూసిన నేపథ్యంలో తాను గతంలోనే చెప్పానని, కానీ, పెడచెవిన పెట్టిన ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలా జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2016లో బ్రిటన్‌లోని పలు జైళ్లలో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 20,075 మొబైల్ ఫోన్లు బయటపడ్డాయి. అంతకుముందు ఏడాదితో పోల్చితే 18శాతం పెరిగాయి. గత ఏడాది 16,987 మొబైల్ ఫోన్లు, యూఎస్బీలు, సిమ్ కార్డులు, మీడియా కార్డులు దొరికాయి. -
కిటకిటలాడే జైళ్లట...
మనాలి: ఫిలిప్పీన్స్‌లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా దేశాధ్యక్షుడు రొడ్రిగో డూటర్టీ చేపట్టిన యుద్ధం వల్ల జైళ్లు, పునరావాస కేంద్రాలు కిక్కిర్సిపోయి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఒక్క జైలు గదిలో సామర్ధ్యానికి మించి మూడింతల మంది నిందితులను ఉంచుతున్నారు. వారు నిద్రపోవడానికి చోటులేక ఒకరిపై ఒకరు పడుకోవాల్సి వస్తోంది. రొడ్రిగో దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేనాటికి వెలవెలబోయిన ప్రభుత్వ, ప్రైవేటు పునరావాస కేంద్రాలు ఇప్పుడు రోగులతో కిటకిటలాడుతున్నాయి. దేశావ్యాప్తంగా ఉన్న 40 కేంద్రాల పరిస్థితి దాదాపు ఇలాగే తయారయింది. తమ పునరావాస కేంద్రానికి రోజుకు 30 మంది చొప్పున మాదక ద్రవ్యాలకు బానిసలైన రోగులు వస్తున్నారని మనీలా నగరంలోని బికుటాన్ పునరావాస కేంద్రం తెలియజేసింది. ఇప్పటికే తమ కేంద్రంలో రోగుల సంఖ్య సామర్థ్యానికి మించి రెండింతలు దాటిందని పేర్కొంది. ప్రైవేటు పునరావాస కేంద్రంలో చార్జీలు విపరీతంగా ఉన్నప్పటికీ రోగుల తాకిడి ఎక్కువగా ఉంది. మాదక ద్రవ్యాల మాఫియాను సమూలంగా నిర్మూలిస్తానంటూ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రొడ్రిగో, మాఫియాపైనే కాకుండా దానికి బానిసలైన రోగులపై కూడా ఉక్కుపాదం మోపుతున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు దేశంలో ఆరువేల మంది మరణించగా, వారిలో 2,051 మంది పోలీసు కాల్పుల్లో మరణించారు. మిగతావారు జనం జరిపిన కాల్పుల్లో మరణించారు. డ్రగ్‌కు బానిసైనా, డ్రగ్ వ్యాపారి అని తెలిసినా కాల్చి పారేయమని, ఎలాంటి కేసుల్లేకుండా తాను చూసుకుంటానని రొడ్రిగో ప్రజలకు నేరుగా పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. డ్రగ్ బానిసల చికిత్స కోసం క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని రొడ్రిగో రెండు కోట్ల డాలర్లను విడుదల చేశారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని డ్రగ్స్ నుంచి విముక్తి పొందాలని, ఇదే ఆఖరి అవకాశమని కూడా నిధుల విడుదల సందర్భంగా ఆయన చెప్పారు. ఆ తర్వాత తాను తాడు పంపిస్తానని, ఆ తాడుతో ఉరేసుకొని చనిపోవాలని కూడా ఆయన సూచించారు.