సాక్షి, చెన్నై : సాధారణంలో జైల్లో మహిళలకు, పురుషులకు వేరువేరుగా జైళ్లు ఉంటాయి. కానీ థర్డ్ జెండర్ ( హిజ్రా)లకు ప్రత్యేకంగా కారాగారాలు లేవు. ఈ నేపథ్యంలోనే హిజ్రాలను ఎక్కడ నిర్బంధించాలని అనే దానిపై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఓ కేసు విచారణ నిమిత్తం.. కింద కోర్టులకు హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. తమిళనాడు, పుదుచ్చేరిలో గల సెషన్స్ కోర్టులకు హైకోర్టు కొత్త నింబంధనలు రూపొందించింది. ఈ నింబంధన రాష్ట్ర ప్రభుత్వ గెజిట్‌లో విడుదల చేశారు. కొత్త నిబంధనల ప్రకారం అరెస్టయిన వారిని నేరుగా హాజరుపరిస్తే మాత్రమే వారిని జైలుల్లో నిర్బంధించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని, నేర కేసుల్లో అరెస్లయిన హిజ్రాలను జిల్లా వైద్య అధికారిచే పరీక్షలు జరిపించాలని పేర్కొంది. ఈ నివేదన ఆధారంగా మగ లక్షణాలు అధికంగా ఉంటే పురుషుల జైలుల్లో, ఆడ లక్షణాలు ఎక్కువగా ఉంటే మహిళల జైలులో నిర్బంధించవచ్చని హైకోర్టు తెలిపింది. ఇలాంటి సందర్భంగా చాలా అరుదుగా ఎదురువుతాయని న్యాయస్థానం అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment