third genders
-
నమోదైన ఓటర్లు 97.97 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి దేశంలో 97.97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికలప్పుడున్న 91.19 కోట్ల మందితో పోలిస్తే ఇది 7.43% ఎక్కువని పేర్కొంది. 2019లో 61.4 కోట్ల ఓట్లు పోలవగా 2024లో 64.64 కోట్ల ఓట్లు పోలయ్యాయని ఇందులో 64.21 కోట్లు ఈవీఎంలలో నమోదైనట్లు వివరించింది. ఇందులో 32.93 కోట్ల పురుషులు, 31.27 కోట్ల మహిళలు, 13 వేల మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా, సార్వత్రిక ఎన్నికల్లో 42.81 లక్షల పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. అస్సాంలోని ధుబ్రి నియోజకవర్గంలో అత్యధికంగా 92.3% ఓట్లు పోల్ కాగా... అత్యల్పంగా శ్రీనగర్‌లో 38.7% పోలింగ్ నమోదైంది. అయితే 2019లో శ్రీనగర్‌లో ఇది 14.4% మాత్రమేనని ఈసీ గుర్తు చేసింది. దేశవ్యాప్తంగా 2024లో నోటాకు 63.71 లక్షల ఓట్లు పడ్డాయని కూడా వివరించింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో జరిగిన ప్రపంచంలోని అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ విస్తృత గణాంకాలను సీఈసీ గురువారం విడుదల చేసింది. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు 2024లో 10.52 లక్షల పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. 2019 కంటే ఇది 14,816 ఎక్కువ. 2019లో 540 చోట్ల రీపోలింగ్ జరగ్గా ఈ ఏడాది కేవలం 40 పోలింగ్ స్టేషన్లలోనే రీపోలింగ్ అయ్యింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 1.62 లక్షల పోలింగ్ స్టేషన్లు ఉండగా...2019తో పోలిస్తే 2024లో బిహార్‌లో అత్యధికంగా 4,739 పోలింగ్ స్టేషన్లు పెరిగాయి. -
‘గే’ స్ హర్ట్ అవుతున్నారు.. ఎందుకు?
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ఎస్... ఐ యామ్ గే. సిగ్గెందుకు.. చెప్పుకోడానికి?! నేను అబ్బాయిని. కానీ అమ్మాయిలకు ఎట్రాక్ట్ కాను. ఇందులో తప్పేముంది? నేను అమ్మాయిని. కానీ అబ్బాయిలు నన్ను ఎట్రాక్ట్ చెయ్యలేరు. ఇందులో ఒప్పుకానిది ఏముంది? ప్రకృతి ధర్మం ఒకటి ఉంటుంది కదా అంటుంది లోకం. ప్రకృతి ఒక్కటేనా ధర్మం? ప్రకృతి విరుద్ధ ధర్మాలు ఉండవా?! అబ్బాయిల దగ్గర మాత్రమే కంఫర్ట్ ఫీలయ్యే అబ్బాయిలు, అమ్మాయిల ఆలింగనాలలో మాత్రమే ఆలంబన పొందే అమ్మాయిలు అడుగుతున్న ఈ ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉందా? లేదు. సానుభూతి ఉందా? లేదు. సహానుభూతి ఉందా? అదెలాగూ ఉండదు. సాఫ్ట్ కార్నర్ ఉందా? ఎప్పటికైనా ఏర్పడుతుందేమో తెలీదు. మరేముంది? అభ్యంతరం ఉంది. అసహనం ఉంది. అవహేళన ఉంది. ‘ఎట్లానో చావండి. మీ ఒంట్లో ఏం జరుగుతోందో మా కంట్లో పడనివ్వకండి’ అని దూరంగా జరిగిపోయేంత ఈసడింపు ఉంది. ‘గే’ స్ హర్ట్ అవుతున్నారు. నేచురల్ బాధ అనేది సాధారణ జెండర్లకు ఉండి, ట్రాన్స్జెండర్లకు లేకుండా పోతుందా?! ఎవరైనా మనుషులే కదా. బాధ పడతారు. అయితే వారి బాధ.. వాళ్లని మనం గుర్తించడం లేదని కాదు. వాళ్లని మనం గౌరవించడం లేదని కాదు. మరి? వాళ్లేమిటో వాళ్లని చెప్పుకోనివ్వడం లేదని! మగదీరుడిగా నిన్ను నువ్వు ఎగ్జిబిట్ చేసుకుంటావు. కోమలాంగిగా నిన్ను నువ్వు రిప్రెజెంట్ చేసుకుంటావు. మరి గే గా నన్నెందుకు బయట పడనివ్వవు అని నేస్తం సంస్థ ప్రతినిధులు నిగ్గుదీసి నిలదీస్తున్నారు. ఇది నేను..నాలా‘గే’ ఉంటానని థర్డ్‌జెండర్స్ బీచ్ రోడ్డులో గర్వంగా ప్రైడ్వాక్ వాక్ చేశారు. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ తీర్పునిచ్చింది అత్యున్నత న్యాయస్థానం. మేమూ సాధారణ వ్యక్తులమే..మాకూ హక్కులున్నాయి. మమ్మల్నీ గౌరవించండంటూ నేస్తం సంస్థ ఆధ్వర్యంలో వైజాగ్ క్వీర్ ఆత్మాభిమాన్ యాత్ర పేరుతో ప్రైడ్ వాక్ ను ఆదివారం నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహం నుంచి ఆర్కేబీచ్ వరకు సాగిన ఈ వాక్‌ను జిల్లా హెచ్ఐవీ నియంత్రణ ప్రొగ్రాం మేనేజర్ శైలాజ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చట్టాలు ప్రతి ఒక్కరికి నచ్చినట్టు జీవించే హక్కును కల్పించాయన్నారు. ఎవరి హక్కులను మనం వ్యతిరేకించారదన్నారు. థర్డ్‌జెండర్, స్వలింగ సంపర్కులపై వివక్ష చూపించడం సరైంది కాదన్నారు. వారు కూడా మనలో ఒకరిగా మనం గుర్తించి వారికి మనోధైర్యం కల్పించాలన్నారు. ఈ వాక్కు పలు ఎన్జీవోలు, కాలేజీ విద్యార్థులు మద్దతిచ్చారు. రాష్ట్రంలో మొదటి ప్రైడ్ వాక్.. స్వలింగ సంపర్కులు, థర్డ్‌జెండర్ వారి హక్కుల కోసం రాష్ట్రంలో మొదటి సారిగా విశాఖలో ప్రైడ్ వాక్‌ను నిర్వహించినట్టు నిర్వహకులు తెలిపారు. ఈ వాక్‌లో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కొందరు పాల్గొన్నారు. తమపై వివక్ష పూర్తిగా పోయే వరకు ఇటువంటి వాక్‌లను దేశ వ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. ఇది తొలి మెట్టు.. ఇంత భారీ వర్షంలో కూడా అనేక మంది వచ్చిన ఈ ప్రైడ్ వాక్‌లో పాల్గొనడం తొలిమెట్టుగా భావిస్తున్నాం. స్వలింగ సంపర్కులు, థర్డ్‌జెండర్ హక్కుల కోసం రాష్ట్రంలో తొలి సరిగా నిర్వహించిన ఈ వాక్కు ఎన్జీవోలు, విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. స్వలింగ సంపర్కులు, థర్డ్జెండర్పై ప్రజలు చూపిస్తున్న వివక్ష పోయే వరకూ పోరాటం ఆగదు. – విశ్వతేజ్, రాష్ట్ర స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్త సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి మా సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ఇందుకు కోసం ఒక ప్రత్యేకమైన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి సరిగా మా ఆత్మ గౌవరం కోసం ఎంతో ధైర్యంతో ప్రైడ్ వాక్‌ను నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఈ వాక్ ద్వారా ప్రజల్లో ప్రేరణ వస్తుందని ఆశిస్తున్నాను. అందరితో పాటు మాకు సమాన హక్కులున్నాయని ప్రజలు గుర్తించాలి. – కృష్ణమ్మ, హైదరాబాద్ హక్కుల కోసం ఒకే వేదికపై.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న స్వలింగ సంపర్కులు, థర్డ్‌జెండర్స్ అంతా ఒకే వేదికపైకి వచ్చి హక్కుల కోసం మొదటి సరిగా ప్రైడ్ వాక్ నిర్వహించడం చాలా ధైర్యాన్ని ఇచ్చింది. మా హక్కులను హరించవద్దని కోరుతున్నా. మాపై వివక్ష చూపించకుండా అందరిలానే సమానంగా చూడాలని కోరుకుంటున్నా. – నందిత, ట్రాన్స్ మహిళ మేము మానసిక రోగులం కాదు ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి నచ్చడం, అబ్బాయికి అబ్బాయి నచ్చడం మానసిక రోగం కాదు. సుప్రీం కోర్టు కూడా ఇంటువంటి ఆలోచనలు కలిగిన వారిని కాన్వర్జేషన్ థెరిపీ చేయటం నిషేధించింది. నేను ఈ వాక్ ద్వారా స్వలింగ సంపర్కులు, థర్డ్‌జెండర్ ఎదుర్కొంటున్న వివక్షకు గురవుతున్నవారి బాధలు తెలుసుకున్నా. – భావ్య, క్వీర్ పర్సన్ -
కష్టకాలంలో.. మానవత్వం చాటిన ట్రాన్స్జెండర్లు ..
సాక్షి, లింగాలఘణపురం(జనగామ): కరోనాతో మృతిచెందిన లింగాలఘణపురం మండలం నవాబుపేటకు చెందిన రంపె వెంకటమ్మ అంత్యక్రియలు గురువారం జనగామ పట్టణంలోని పలువురు ట్రాన్స్జెండర్లు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాలేదు. దీంతో జనగామ పట్టణానికి చెందిన ట్రాన్స్‌జెండర్ ఓరుగంటి ఉషా, ఓరుగంటి నిత్య ముందుకొచ్చి అంత్యక్రియలు చేశారు. ఈ సందర్భంగా కోవిడ్ 19 సేవాసమితి నిర్వాహుకులు మల్లిగారి రాజు వారిని అభినందించారు. రాజన్న, నాగరాజు, వీరస్వామి ఉచిత అంబులెన్స్ సర్వీసులను అందించారు. చదవండి: ఊరంతా ఏకమై.. మహిళను చితకబాది, జుట్టు కత్తిరించి -
హిజ్రాలకు కూడా పోలీసు ఉద్యోగాలలో అవకాశం.. ఎక్కడంటే..
సాక్షి, భువనేశ్వర్(ఒడిశా): హిజ్రాలకు పోలీసు విభాగంలో ఉద్యోగాలు కల్పించనున్నట్లు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు అభయ్ శనివారం ప్రకటించారు. ఈ మేరకు 477 సబ్–ఇన్స్పెక్టర్, 244 కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ జారీ అయింది. దరఖాస్తు గడువు జూలై 15వ తేదీతో ముగుస్తుంది. సాధారణ అభ్యర్థులతో పాటు హిజ్రాలు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. సబ్– ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి విద్యార్హత డిగ్రీ కాగా కానిస్టేబుల్ ఉద్యోగానికి +2 శ్రేణి అర్హతగా పేర్కొన్నారు. చదవండి: వైరల్ వీడియో.. ఆ కుక్క చూపిస్తున్న ప్రేమకు కన్నీళ్లు వస్తున్నాయి -
హిజ్రాలను ఏ జైల్లో నిర్బంధించాలి?
సాక్షి, చెన్నై : సాధారణంలో జైల్లో మహిళలకు, పురుషులకు వేరువేరుగా జైళ్లు ఉంటాయి. కానీ థర్డ్ జెండర్ ( హిజ్రా)లకు ప్రత్యేకంగా కారాగారాలు లేవు. ఈ నేపథ్యంలోనే హిజ్రాలను ఎక్కడ నిర్బంధించాలని అనే దానిపై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఓ కేసు విచారణ నిమిత్తం.. కింద కోర్టులకు హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. తమిళనాడు, పుదుచ్చేరిలో గల సెషన్స్ కోర్టులకు హైకోర్టు కొత్త నింబంధనలు రూపొందించింది. ఈ నింబంధన రాష్ట్ర ప్రభుత్వ గెజిట్‌లో విడుదల చేశారు. కొత్త నిబంధనల ప్రకారం అరెస్టయిన వారిని నేరుగా హాజరుపరిస్తే మాత్రమే వారిని జైలుల్లో నిర్బంధించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని, నేర కేసుల్లో అరెస్లయిన హిజ్రాలను జిల్లా వైద్య అధికారిచే పరీక్షలు జరిపించాలని పేర్కొంది. ఈ నివేదన ఆధారంగా మగ లక్షణాలు అధికంగా ఉంటే పురుషుల జైలుల్లో, ఆడ లక్షణాలు ఎక్కువగా ఉంటే మహిళల జైలులో నిర్బంధించవచ్చని హైకోర్టు తెలిపింది. ఇలాంటి సందర్భంగా చాలా అరుదుగా ఎదురువుతాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. -
మా సంగతేంటి..?
సాక్షి, సిటీబ్యూరో: ‘‘భిక్షాటన చేసినా, వ్యభిచారం చేసినా నేరమే. ఊళ్లో ఉన్నా, ఏ బస్తీల్లో తలదాచుకున్నా తరిమి కొడతారు. నగర శివార్లలోకి వెళ్లినా పోలీసులు మైకుల్లో అనౌన్స్ చేసి మరీ ఖాళీ చేయిస్తారు. మేం ఎక్కడ ఉంటే అక్కడ నేరాలు జరుగుతాయని వేధిస్తారు. నేరాలకు పాల్పడిన వాళ్లపైన చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ ట్రాన్స్‌జెండర్‌గా పుట్టినందుకు బతికే హక్కు లేకుండా చేస్తే ఎలా’’ అని తెలంగాణ ట్రాన్స్‌జెండర్స్ హక్కుల నేత రచన ప్రశ్న ఇది. లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఆమె సాక్షితో మాట్లాడారు. మనుషులుగా గుర్తించాలని, అందరిలాగే ట్రాన్స్జెండర్లకు కూడా జీవించే హక్కు ఉందని సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ట్రాన్స్జెండర్లు ఆవేదన వ్యక్తం చేశా రు. ట్రాన్స్జెండర్ల సమస్యలను రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో ప్రస్తావించాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్జెండర్ల సమస్యలపై చట్టసభల్లో గళం విప్పే లక్ష్యంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రముఖి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి పోటీకి వీరు దూరంగా ఉన్నప్పటికీ తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, తదితర రాష్ట్రా ల నుంచి తమ ప్రతినిధులు పోటీలో ఉన్నట్లు రచన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో, తెలంగాణలో వేలసంఖ్యలో ఉన్న ట్రాన్స్జెండర్లు, హిజ్రా ల సమస్యలకు రాజకీయ పార్టీలు పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు. మనుషులుగా గౌరవప్రదమైన జీవితాన్ని అనుభవించే హక్కుకు భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. రిజర్వేషన్లు కల్పించండి గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 2,000 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు వేలకు పైగా ఉన్నట్లు అంచనా. కానీ ఎన్నికల కమిషన్ లెక్కల్లో మాత్రం చాలా తక్కువ సంఖ్యలోనే ఓటర్లుగా నమోదై ఉన్నారు. సామాజిక వివక్ష కారణంగా చాలామంది తమను తాము హిజ్రాలుగా, ట్రాన్స్జెండర్లుగా ప్రకటించుకొనేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు తెలంగాణ హిజ్రా, ఇంటర్‌సెక్స్, ట్రాన్స్‌జెండర్ సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఉన్నత విద్యను అభ్యసించేందుకు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేందుకు, అన్ని రంగాల్లో అవకాశాలను పొందేందుకు మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలనేది వారి ప్రధానమైన డిమాండ్. వెనుకబడిన వర్గాల జాబితాల్లో చేర్చాలని కోరుతున్నారు. ఆసుపత్రులు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, సామాజిక సంస్థలు, బహిరంగ స్థలాల్లో మహిళలకు, పురుషులకు వేరు వేరుగా టాయిలెట్లు ఉన్నట్లుగా తమకు కూడా ప్రత్యేక వసతి కల్పించాలని ఆమె చెప్పారు. ఆసుపత్రుల్లో ప్రత్యేక వైద్యులను ఏర్పాటు చేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లో సంక్షేమ బోర్డులు తమిళనాడుతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ట్రాన్స్జెండర్ల కోసం సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేశారు. ఉపాధి కోసం రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు రుణాలు అందజేస్తున్నారు. గుర్తింపు కార్డులు, రేషన్ సదుపాయం, గృహవసతి కల్పిస్తున్నారు. కానీ తెలంగాణలోనే తీవ్రమైన వివక్ష కొనసాగుతోంది. మహిళలపై లైంగిక హింసకు, దోపిడీ, వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన శిక్షలను అమలు చేస్తున్నారు. కానీ ట్రాన్స్జెం డర్లపై దాడి జరిగితే నేరస్తులకు రెండేళ్ల శిక్ష మాత్ర మే పడుతోంది. ‘మమ్మల్ని మనుషులుగా బతకనివ్వండి. మా బతికే హక్కుకు భరోసానివ్వండి అని సంఘం నాయకులు కోరుతున్నారు. -
థర్డ్ జెండర్ కీలకం
వివక్ష.. విస్మరణ నుంచి రాజ్యాధికారం దిశగా ట్రాన్స్జెండర్లు అడుగులు వేస్తున్నారు. భారత ఎన్నికల్లో థర్డ్ జెండర్ల ప్రాతినిథ్యం పెరుగుతోంది. కేవలం ఓటర్లుగానే కాదు అభ్యర్థులుగానూ పోటీ పడుతున్నారు. భారత ఎన్నికల సంఘం 1994లో ట్రాన్స్ జెండర్లను థర్ట్ జెండర్లు (ఇతరులు)గా గుర్తించి ఓటు హక్కు కల్పించడంతో వారికి ఎన్నికల్లో ప్రాతినిథ్యం మొదలైంది. అంతకు ముందు ట్రాన్స్ జెండర్లను మహిళల కిందనే పరిగణిస్తూ వారి వివరాలను ఓటర్ల జాబితాలో పేర్కొనేవారు. అయితే, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2009 నుంచి ఎన్నికల సంఘం థర్ట్ జెండర్ కాలమ్‌ను ఓటరు లిస్టులో ప్రవేశపెట్టింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 4.9 లక్షల మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. మన రాష్ట్రంలో వీరి సంఖ్య కచ్చితంగా లేదుగానీ.. 3,760 మంది ట్రాన్స్ జెండర్లు ఓటర్లుగా నమోదయ్యారు. జిల్లాల వారీగా ఇలా.. శ్రీకాకుళం జిల్లాలో 247 మంది ట్రాన్స్ జెండర్స్ ఓటర్లుగా నమోదయ్యారు. విజయనగరం జిల్లాలో 118 మంది, విశాఖ జిల్లాలో 158 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 384 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 364 మంది ఇతరుల కేటగిరీలో ట్రాన్స్ జెండర్ ఓటర్లు నమోదయ్యారు. కృష్ణా జిల్లాలో 294 మంది, గుంటూరు జిల్లాలో 421 మంది, ప్రకాశం జిల్లాలో 149 మంది, నెల్లూరు జిల్లాలో 338 మంది, కడప జిల్లాలో 296 మంది, కర్నూలు జిల్లాలో అత్యధికంగా 443 మంది, అనంతపురం జిల్లాలో 204 మంది, చిత్తూరు జిల్లాలో 344 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. రాహుల్‌పై పోటీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా తమ సమస్యలను ప్రపంచానికి తెలపవచ్చని వీరు భావిస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్ సోనమ్ కిన్నర్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ప్రాతినిథ్యం వహించిన అమేథి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. తమిళనాడులోని మధురై నుంచి శరత్‌కుమార్‌కు చెందిన సముతువ మక్కల్ కట్చీ పార్టీ అభ్యర్థిగా ట్రాన్స్ జెండర్ భారతి, ఆర్కే నగర్ నుంచి దేవి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 2017లో ఉత్తరాఖండ్‌కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజనీ రావత్ రాయపూర్ నుంచి, 2012లో ఆయోధ్య అసెంబ్లీ స్థానం నుంచి గుల్షన్ బిందో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బిందో 22 వేల ఓట్లు సాధించారు. తెలంగాణలో ‘చంద్రముఖి’ ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రముఖి అనే ట్రాన్స్ జెండర్ తొలిసారిగా పోటీకి దిగారు. హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గం నుంచి బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె ముమ్మర ప్రచారం నిర్వహించారు. ‘తమ్ముడూ!, నీ ఓటు నాకే వెయ్యాలి. మమ్నల్ని మనుషులుగా గుర్తించాలి’ అంటూ ఆమె ఓట్లు అభ్యర్థించింది. చరిత్ర సృష్టించిన షబ్నం మౌసీ భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా చట్టసభలకు ఎన్నికైన ట్రాన్స్ జెండర్‌గా షబ్నం మౌసీ చరిత్ర సృష్టించారు. 2000 సంవత్సరంలో మధ్యప్రదేశ్‌లోని సోహగ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో షబ్నం మౌసీ స్వతంత్ర అభ్యర్థి గా పోటీచేసి 17,800 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తొలి ట్రాన్స్ జెండర్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. 2008 ఎన్నికల్లో ఆర్జేడీ తరఫున అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తొలి ట్రాన్స్ జెండర్ మేయర్ ఛత్తీస్‌గడ్‌లోని రాయిగఢ్ మునిసిపల్ కార్పొరేషన్‌కు 2015లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ట్రాన్స్ జెండర్ మధు కిన్నార్ పోటీచేశారు. ఆ ఎన్నికల్లో ప్రధాన పార్టీ అభ్యర్థులను కాదని.. ప్రజలు మధు కిన్నార్‌కే మద్దతు పలికారు. బీజేపీ అభ్యర్థి మహవీర్ గురుజీ కంటే 4 వేల ఓట్ల మెజారిటీని సాధించిన కిన్నార్ దేశంలోని తొలి ట్రాన్స్ జెండర్ మేయర్‌గా చరిత్ర సృష్టించారు. మనుషులమేనని గుర్తించాలి మనుషులందరూ చూడటానికి ఒకేలా ఉన్నా భావాలు, ఆలోచనలు వేర్వేరుగా ఉంటాయి. స్త్రీగా ఉంటే ఎలా ఉంటుందోనని పురుషులు, మగవారిగా ఉంటే ఎలా ఉంటుందోనని మహిళలు అప్పుడప్పుడు ఆలోచిస్తుంటారు. ఆ ఆలోచనలు రావడానికి కారణం మన శరీరంలో ఉండే హార్మోన్స్. ఈ హార్మోన్స్ విపరీత ప్రభావానికి లోనైనప్పుడు అది వాస్తవ రూపం దాల్చడానికి యత్నించడం సహజం. ఈ విషయాన్ని సమాజం అర్థం చేసుకోవడం లేదు. ఏపీలో మేము 51 వేల మంది ఉన్నాం. బాగా చదువుకున్నప్పటికీ అటు ప్రభుత్వాలు, ఇటు ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాలివ్వడం లేదు. నేను ఇగ్నోలో బీసీఏ పూర్తి చేశాను. నాలా ఎంతోమంది ఉన్నారు. ఉపాధి కోసం రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ముందుకు రావడం లేదు. ఇప్పుడు మా ఓట్లు కూడా కీలకం కాబట్టి మా గురించి ఆలోచించే వారికే మద్దతు ఇస్తాం. – తమన్నా సింహాద్రి, విజయవాడ – యసోరా -
గుడ్ న్యూస్: పాన్ కార్డులో కొత్త ఆప్షన్
సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్-పాన్ అనుసంధానంలో ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించింది. పాన్ కార్డులో థర్డ్‌జెండర్ ఆప్షన్ కల్పిస్తూ ..ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సిబిడిటి) సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే పాన్‌కార్డు దరఖాస్తులో ట్రాన్స్జెండర్లను ప్రత్యేక కేటగిరీగా గుర్తించిన కేంద్రం వారికోసం ఈ ప్రత్యేక ఆప్షన్‌ను కేటాయించింది. స్త్రీ, పురుషుల మాదిరిగా ట్రాన్స్జెండర్లకు ఓ ఆప్షన్‌ను కేటాయిస్తూ ఆదాయ పన్ను శాఖ నిబంధనలను ప్రభుత్వం సవరించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను సీబీడీటీ సోమవారం విడుదల చేసింది. పాన్ కోసం దరఖాస్తు చేసే ట్రాన్స్జెండర్ల కోసం దరఖాస్తు ఫారంలో ప్రత్యేకంగా ఓ టిక్ బాక్స్‌ను ఏర్పాటు చేశారు. కాగా ఇన్ని రోజుల ఆధార్-పాన్ అనుసంధానంలో హిజ్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి కారణం ఆధార్ కార్డులో జెండర్ ఎంపికలో ఆడ, మగతోపాటు హిజ్రాలకు ప్రత్యేకంగా థర్డజెండర్ ఆప్షన్ ఉన్నప్పటికీ పాన్ కార్డు దరఖాస్తులో ఆ వెసులుబాటు లేకపోవడమే. ఆధార్‌కార్డుల్లో థర్డ్ జెండర్ అనీ, పాన్‌కార్డుల్లో మాత్రం పురుషుడు/మహిళ అని ఉండటంతో హిజ్రాలు తమ ఆధార్ నంబర్లను పాన్‌కు అనుసంధానించుకోలేక ఇబ్బందులకు గురయ్యారు.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో హిజ్రాలకు పాన్ కార్డుల ధరఖాస్తుకు, ఆధార్‌తో అనుసంధానికి సంబంధించిన సమస్యలు తొలగిపోయాయి. -
‘వారికీ’ పింఛన్లు
శ్రీకాకుళం పాతబస్టాండ్:జిల్లాలో థర్డ్ జెండర్ వర్గానికి ఈ ఏడాది నుంచి పింఛన్లు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ఆదేశాల అమలుకు ఎన్నో అడ్డంకులు ఎదురువస్తున్నాయి. దీనికి సంబంధించి పలు నిబంధనలతో కూడిన జీఓ నంబర్16ను ఈ నెల 5న విడుదల చేశారు. థర్డ్ జెండర్ వారికి వైద్య పరీక్షలుఅనంతరం వైద్యులు ధ్రువీకరణ పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. ఇప్పటికే సామాజిక భద్రతా పింఛన్ల మం జూరులో పారదర్శకత కనిపించడం లేదు. కేవలం అధికార పార్టీ అనుచరులకే పిం ఛన్లు మంజూరవుతున్నాయి. జన్మభూమి కమిటీ సిఫార్సులు ఉన్న వారికే పింఛన్లు ఇస్తుండడంతో వాస్తవ లబ్ధిదారులు తీవ్రం గా ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల కిడ్నీ రోగులకు కూడా పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే వీటికి కూడా నిబంధనలు పెట్టడంతో వారు కూడా ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో కిడ్నీ రోగులు 17 వేల మంది ఉండగా ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్న 291 మందికి మాత్రమే పింఛను అందజేస్తున్నారు. ఇప్పుడు థర్డ్ జెండర్లకు కూడా ఇలాంటి మెలికలే పెడుతోంది. స్థానికతతో పాటు మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది. అయితే రిమ్స్‌లో వీరికి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి సిబ్బంది లేరు. జిల్లా వ్యాప్తంగా 1100 మంది థర్డ్ జెండర్ వారు ఉన్నట్లు అంచనా. వీరికి రిమ్స్‌లో ప్రాథమికంగా పరీక్షించి, ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడానికి ప్రత్యేక వైద్యులు ఉండాలి. ఎండోక్రైనాలజిస్టు, యూరాలజిస్టు, సైక్రియాసిస్టులు ఉండాలి. అయితే ఎండోక్రైనాలజిస్టు లేరు. దీంతో విశాఖ నుంచి వారానికో రోజు ఆ వైద్యుడిని రప్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు రిమ్స్ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ పద్ధతిని ఫాలో అయితే ధ్రువీకరణ పత్రాల మంజూరుకు చాలా కాలం పడుతుంది. దీనిపై లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
హిజ్రాలకు ‘పాన్–ఆధార్’ తిప్పలు
న్యూడిల్లీ: దేశంలో వివిధ రకాలుగా వివక్ష, వేధింపులకు గురవుతున్న హిజ్రాలకు పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్) రూపంలో కొత్త సమస్య ఎదురైంది. అందరూ తమ ఆధార్ సంఖ్యను పాన్‌తో ఈ నెల 31లోపు అనుసంధానించుకోవాలని కేంద్రం, సుప్రీంకోర్టు గతంలో ఆదేశించడం తెలిసిందే. ఆధార్ అనుసంధానం కాని పాన్ కార్డులు వచ్చే నెల నుంచి రద్దయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే ప్రస్తుతం అనేక ఆర్థిక లావాదేవీలకు, సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఆధార్, పాన్లను తప్పనిసరి చేసింది. అయితే ఆధార్–పాన్ అనుసంధానంలో హిజ్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం ఆధార్ కార్డులో జెండర్ ఎంపికలో ఆడ, మగతోపాటు హిజ్రాలకు ప్రత్యేకంగా థర్డజెండర్ ఆప్షన్ ఉన్నప్పటికీ పాన్ కార్డు దరఖాస్తులో ఆ వెసులుబాటు లేకపోవడమే. ఆధార్‌కార్డుల్లో థర్డ్ జెండర్ అనీ, పాన్‌కార్డుల్లో మాత్రం పురుషుడు/మహిళ అని ఉండటంతో హిజ్రాలు తమ ఆధార్ నంబర్లను పాన్‌కు అనుసంధానించుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ప్రభావం దాదాపు 5 లక్షల మంది (తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 70 వేల మంది) హిజ్రాలపై పడుతోంది. ఎదురవుతున్న సమస్యలివీ ! ఆధార్–పాన్ లింకింగ్ తప్పనిసరి అయిన నేపథ్యంలో హిజ్రాలు ఆదాయ పన్ను రిటర్న్‌లు దాఖలు చేయలేకపోతున్నారు. రూ. 50 వేలకు పైబడిన ఆస్తుల క్రయవిక్రయాలకు, ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించేందుకు పాన్, ఆధార్‌కార్డులు తప్పనిసరి కావడం వీరికి తలనొప్పిగా మారింది. 2017 మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం మ్యూచువల్ ఫండ్ ఖాతాలను అప్డేట్ చేయలేకపోతుండటం, బ్యాంక్ ఖాతాలు తెరిచేందుకూ ఇబ్బందులు పడుతున్నారు. ‘ట్రాన్స్‌జెండర్‌గా నన్ను నేను అంగీకరించాను. దీనినే ప్రతి గుర్తింపు కార్డూ చాటిచెప్పాలని కోరుకుంటున్నాను. కారు యజమానిగా పత్రాల్లో గుర్తింపుతో పాటు, వైద్య బీమా, ఆస్తి పత్రాలు, పాన్‌కార్డు వరకు అన్నింట్లోనూ ఇదే స్పష్టంగా పేర్కొనాలి’అని హిజ్రాల హక్కుల కోసం పోరాడే కార్యకర్త రేష్మా ప్రసాద్ కోరుతున్నారు. ‘సుప్రీం’తీర్పు ఏం చెబుతోంది ? హిజ్రాలకు సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వం లభించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) కేసులో సుప్రీంకోర్టు నాలుగేళ్ల క్రితం ఆదేశాలిచ్చింది. సంక్షేమ పథకాల లబ్ధితో మొదలుపెట్టి వీరికి అన్ని రకాల సహాయ, సహకారాలను అందించాలని సూచించింది. తమ గుర్తింపును తామే నిర్ధారించుకునే ప్రాథమిక హక్కును వారికి కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు హిజ్రాల కోసం సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేశాయి. పశ్చిమబెంగాల్లోని ఓ ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీ ట్రాన్స్‌జెండర్‌కు ప్రిన్సిపాల్‌గా అవకాశమిచ్చింది కూడా. కొచ్చి మెట్రో సంస్థ పలు విభాగాల్లో వీరి సర్వీసులు ఉపయోగించుకుంటోంది. -
హిజ్రాలకు పోలీసుల క్లాస్..
మల్కాజ్గిరి (హైదరాబాద్) : సుమారు 200 మంది హిజ్రాలు, ట్రాన్స్జెండర్లు, బుడగ జంగాలకు పోలీసులు క్లాస్ తీసుకున్నారు. నగరంలోని అల్వాల్ పీవీఆర్ గార్డెన్స్ సోమవారం ఇందుకు వేదికగా నిలిచింది. డీసీపీ రమా రాజేశ్వరి, ఏసీపీలు సయ్యద్ రఫీక్, రవిచందర్ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇందులో మల్కాజ్గిరి పీఎస్ పరిధిలో నివసించే హిజ్రాలు, ట్రాన్స్జెండర్లు, బుడగ జంగాల వారితోపాటు స్థానిక షాపుల నిర్వాహకులు పాల్గొన్నారు. షాపుల వెంట తిరుగుతూ డబ్బులు అడగడం, ఇవ్వకపోతే దాడులకు పాల్పడడం చట్టరీత్యా నేరమని, కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు వారికి తెలియజేశారు. అయితే తాము హిజ్రాలమని, తమకు ఎవరూ ఉద్యోగాలు ఇవ్వరని, పోషణకు అడుక్కోవడమే మార్గమని వారన్నారు. బుడగ జంగాల వారు కూడా తమలాగే వేషాలు వేసుకుని అడుక్కుంటున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా వేషాలు వేసుకుని అడుక్కోవడం తమ కులవృత్తి అని బుడగ జంగాల వారు చెప్పారు. -
శ్రీవారిని దర్శించుకున్న హిజ్రాలు
తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సోమవారం సుమారు 30 మందికిపైగా హిజ్రాలు దర్శించుకున్నారు. ఉత్తర, దక్షిణ భారతదేశానికి చెందిన వీరంతా ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కలుసుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం రూ.300 టికెట్లను ఆన్లైన్ ద్వారా రిజర్వు చేసుకున్నారు. ఇతర భక్తులతో కలసి శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని వారు విలేకరులతో అన్నారు. -
హిజ్రాలకు రైల్వే పోలీసుల కౌన్సెలింగ్
వరంగల్: చప్పట్లు కొట్టడం.. రూ.10 తక్కువ కాకుండా డబ్బులిస్తే సరేసరి.. లేకుంటే ఇవ్వని వారి చొక్కా పట్టుకుని దాడికి దిగడం.. హిజ్రాల దౌర్జన్యకర చర్యలు సికింద్రాబాద్ - విజయవాడ మార్గంలో రైలు ప్రయాణికులకు అనుభవమే. ఈ నేపథ్యంలో వరంగల్ రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్) పోలీసులు ఆదివారం హిజ్రాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. సీఐ హరిబాబు ఆధ్వర్యంలో పోలీసులు వరంగల్ రైల్వే స్టేషన్లో సుమారు 50 మంది హిజ్రాలతో సమావేశం అయ్యారు. ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేయటం, వారిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించటం, చైన్ లాగి పారిపోవటం వంటి చర్యలు సరికాదని, వీటిని మానుకోవాలని సూచించారు. గౌరవంగా జీవించాలని, లేకుంటే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హిజ్రాలను హెచ్చరించారు.