ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, లింగాలఘణపురం(జనగామ): కరోనాతో మృతిచెందిన లింగాలఘణపురం మండలం నవాబుపేటకు చెందిన రంపె వెంకటమ్మ అంత్యక్రియలు గురువారం జనగామ పట్టణంలోని పలువురు ట్రాన్స్‌జెండర్లు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాలేదు.
దీంతో జనగామ పట్టణానికి చెందిన ట్రాన్స్‌జెండర్ ఓరుగంటి ఉషా, ఓరుగంటి నిత్య ముందుకొచ్చి అంత్యక్రియలు చేశారు. ఈ సందర్భంగా కోవిడ్ 19 సేవాసమితి నిర్వాహుకులు మల్లిగారి రాజు వారిని అభినందించారు. రాజన్న, నాగరాజు, వీరస్వామి ఉచిత అంబులెన్స్ సర్వీసులను అందించారు.
Comments
Please login to add a commentAdd a comment