హైదరాబాద్: తెలంగాణ జైళ్లలో ఉన్నవారి సంఖ్య 79,409 కాగా వివిధ నేరాల కింద శిక్ష ఖరారై అనుభవిస్తున్నవారు 3,926 మంది మాత్రమేనని.. మిగతావారంతా అండర్‌ట్రయల్స్ అని జైళ్ల శాఖ డీజీ వీకేసింగ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని జైళ్లలో గత ఏడాది సంభవించిన పరిణామాలను వివరించారు.
రాష్ట్రంలోని జైళ్లలో విచారణ ఖైదీల్లో పురుషులు 49,942 మంది కాగా మహిళలు 25,941 మంది ఉన్నారని ఆయన వివరించారు. 2015లో జైళ్లలో వివిధ కారణాలతో 32 మంది మృత్యువాతపడ్డారని పేర్కొన్నారు. ఖైదీల్లో మానసిక పరివర్తన ద్వారా తిరిగి వారు నేరబాట పట్టకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
మొత్తం ఖైదీలు 79,409, శిక్ష ఖరారైనవారు 3,926
Published Tue, Jan 12 2016 5:35 PM | Last Updated on Sun, Sep 3 2017 3:33 PM
Advertisement