కాల్ చార్జీలు భారీగా తగ్గింపు.. ఖైదీలు హర్షం | Prisoners happy about cut in phone call charges | Sakshi
Sakshi News home page

కాల్ చార్జీలు భారీగా తగ్గింపు.. ఖైదీలు హర్షం

Published Thu, Jul 27 2017 7:36 PM | Last Updated on Tue, Sep 5 2017 5:01 PM

కాల్ చార్జీలు భారీగా తగ్గింపు.. ఖైదీలు హర్షం

కాల్ చార్జీలు భారీగా తగ్గింపు.. ఖైదీలు హర్షం

హైదరాబాద్‌: రాష్ట్ర జైళ్లలో ఉండే ఖైదీలకు ఫోన్ కాల్ చార్జీల ధరలను భారీగా తగ్గించారు. ఆ మేరకు తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు 6 రూపాయలకే 5 నిమిషాలపాటు మాట్లాడే అవకాశం కల్పించారు.

గతంలో జైలు నుంచి ఖైదీలు ఒక ఫోన్ మాట్లాడాలంటే 20 రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. ఏకంగా కాల్ చార్జీలు 14 రూపాయలు తగ్గించడంతో ఖైదీలు సంతోషం వ్యక్తం చేశారు. పోలీసులు 2014 నుంచి ఖైదీలకు ఫోను మాట్లాడే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement