ఖైదీలకు వడ్డీ లేని రుణాలు... | interest less loans to Prisoners in Telangana | Sakshi
Sakshi News home page

ఖైదీలకు వడ్డీ లేని రుణాలు...

Published Wed, Mar 9 2016 7:50 PM | Last Updated on Sun, Sep 3 2017 7:21 PM

ఖైదీలకు వడ్డీ లేని రుణాలు...

ఖైదీలకు వడ్డీ లేని రుణాలు...

చంచల్‌గూడ: తెలంగాణ ప్రభుత్వం ఓ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. జైళ్ల శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాపరివర్తన్ కార్యక్రమంలో భాగంగా శిక్ష ఖైదీలకు వ్యక్తిగత రుణాలు మంజూరు చేశారు.

రాష్ట్రంలోని వివిధ జైళ్లకు చెందిన 34 మంది ఖైదీలకు వారి పిల్లల విద్య, వివాహాల ఖర్చులకు సంబంధించి వడ్డీరహిత రుణాలు మంజూరు చేసినట్లు డీజీ వినయ్‌కుమార్‌సింగ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.  మొదట విడతలో మొత్తం రూ.పదకొండున్నర లక్షల రుణాలు ఇచ్చేందుకు నిర్ణయించారు. కనిష్టంగా రూ.13,500 నుంచి గరిష్టంగా రూ.45 వేల వరకు మంజూరు చేశారు. ఖైదీలకు రుణాల పంపిణీ వల్ల వారి జీవితాలు మారుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement