no interest
-
రండి బాబూ... రండి!
సాక్షి, కంబదూరు: కళ్యాణదుర్గంలో సోమవారం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి నామినేషన్ కార్యక్రమానికి వెళ్లడానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో నామినేషన్‌కు మండలం నుంచి భారీగా జనాన్ని తరలించాలని ఆయన వర్గీయులు ప్రయత్నించారు. కానీ ప్రజలెవరూ స్వచ్ఛందంగా ముందుకు రాకపోవడంతో గత్యంతరం లేక ఒక్కొక్కరికి రూ.300 నుంచి రూ.400 వరకు కూలి డబ్బులు ఇచ్చి బలవంతంగా తీసుకెళ్లారు. -
జాతీయ భాషకు ఆదరణేదీ?
నేడు హిందీ భాషాదినోత్సవం జహీరాబాద్: దేశంలోని అన్ని ప్రాంతాలను ఏకం చేసి స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన హిందీ భాషకు నేడు సముచిత స్థానం లభంచడం లేదు. జాతీయ భాషగా, అధికార భాషగా కొనసాగుతున్నా నిరాదరణకు గురవుతోందని హిందీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ భాష అయిన ఆంగ్లానికి పాఠశాలల్లో ఇస్తున్న ప్రాధాన్యతను హిందీ విషయంలో ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఇంగ్లిషుకు ఇస్తున్న ప్రాధాన్యతను జాతీయ భాషకు మాత్రం ఆ స్థాయిలో ఇవ్వడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటులో సైతం సభ్యులు అధికంగా ఆంగ్లంలోనే మాట్లాడడం పట్ల వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో హిందీని వ్యతిరేకిస్తూ ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టడం పట్ల హిందీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రీ భాష సూత్రం అమలులో భాగంగా హిందీ మాట్లాడని ప్రాంతాల్లో ద్వితీయ భాషగా అమలు చేస్తున్నా మిగతా సబ్జెక్టులకు ఉత్తీర్ణత శాతం ఒక విధంగా, హిందీకి ఒక విధంగా చూడడంతో విద్యార్థలు హిందీ పట్ల ఆసక్తి చూపడం లేదంటున్నారు. పోస్టుల భర్తీలో సైతం అసమానతలు చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా హిందీ భాషకు సముచిత స్థానం కల్పించాలని భాషాభిమానులు కోరుతున్నారు. హిందీ భాకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి జాతీయ సమైక్యతకు దోహదపడుతున్న హిందీ భాషకు సముచిత స్థానం కల్పించాలి. ఇందుకు పాలకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.స్వాతంత్ర్య ఉద్యమంలో హిందీ భాష ప్రజలను ఏకం చేసింది. నేడు హిందీకి సముచిత స్థానం కల్పించక పోవడం విచారకరం. సెప్టెంబర్ 14న హిందీ దినోత్సవంగా ప్రకటించినా అందుకు అనుగుణంగా కార్యక్రమాలు జరగడం లేదు. హిందీ లావో దేశ్ బచావో నినాదంతో వారం రోజుల పాటు హిందీ వారోత్సవాలను నిర్వహిస్తాం. - అశోక్కుమార్శేరి, హిందీ ప్రచార సమితి కార్యదర్శి, జహీరాబాద్ -
ఖైదీలకు వడ్డీ లేని రుణాలు...
చంచల్‌గూడ: తెలంగాణ ప్రభుత్వం ఓ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. జైళ్ల శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాపరివర్తన్ కార్యక్రమంలో భాగంగా శిక్ష ఖైదీలకు వ్యక్తిగత రుణాలు మంజూరు చేశారు. రాష్ట్రంలోని వివిధ జైళ్లకు చెందిన 34 మంది ఖైదీలకు వారి పిల్లల విద్య, వివాహాల ఖర్చులకు సంబంధించి వడ్డీరహిత రుణాలు మంజూరు చేసినట్లు డీజీ వినయ్‌కుమార్‌సింగ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొదట విడతలో మొత్తం రూ.పదకొండున్నర లక్షల రుణాలు ఇచ్చేందుకు నిర్ణయించారు. కనిష్టంగా రూ.13,500 నుంచి గరిష్టంగా రూ.45 వేల వరకు మంజూరు చేశారు. ఖైదీలకు రుణాల పంపిణీ వల్ల వారి జీవితాలు మారుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
సెల్ఫీయా.. నో నో!
నచ్చిన వ్యక్తితో సెల్ఫీ, మంచి డ్రెస్ వేసుకుంటే సెల్ఫీ, కొత్త ప్రదేశానికి వెళితే సెల్ఫీ... ఇలా సెల్ఫోన్లో సెల్ఫీలు తీసుకోవడం ఇప్పుడో ఫ్యాషన్ అయిపోయింది. ఈ పిచ్చి ఎందాకా ముదిరిందంటే.. చివరికి చచ్చిపోయిన వాళ్లతో కూడా సెల్ఫీలు దిగుతున్నారు. ఇటీవల ఈ సెల్ఫీల గురించి ఇలియానా స్పందించారు. ‘‘ఏమోనండి బాబూ నాకు సెల్ఫీలంటే ఇంట్రస్ట్ లేదు’’ అని పేర్కొన్నారు ఈ గోవా సుందరి. ఇటీవల ఓ రెస్టారెంట్ దగ్గర చిన్న పాప సెల్ఫీ తీసుకుంటూ ఇలియానాకి కనిపించిందట. ‘‘ఒక్క ఫొటో కోసం ఆ పాప దాదాపు 15 నిమిషాలు కేటాయించింది. ఆ ఓపికకు ఆశ్చర్యపోయాను. ఇదే ఓపికను ఉపయోగపడే విషయాలకు కేటాయిస్తే బాగుంటుంది కదా అనిపించింది’’ అని ఇలియానా పేర్కొన్నారు. అది మాత్రమే కాదు.. తనకంత ఓపిక లేదని, ఎవరైనా ఒత్తిడి చేస్తే, అప్పుడు కాదనలేక సెల్ఫీకి ఓకే చెబుతానని స్పష్టం చేశారు. -
స్మార్ట్‌ఫోన్ కంపెనీల వడ్డీలేని రుణాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వడ్డీ లేని రుణమంటే ఎగిరి గంతేస్తుంటారు చాలామంది. అదేదో ఫ్రీగా ఇచ్చేస్తున్నట్టే ఫీలవుతారు కొందరు. అలాంటివారి కోసం గృహోపకరణాలను అందించిన సంస్థలు... ఇపుడు స్మార్ట్ ఫోన్లకూ ఈ ఆఫర్ ఇస్తున్నాయి. వడ్డీ లేని ఈఎంఐలు... అంటూ మొబైల్ కంపెనీలు చేస్తున్న ప్రచారం వాటి అమ్మకాలను అమాంతం పెంచుతోంది. ఒకేసారి డబ్బు చెల్లించే స్తోమత ఉన్నవారు సైతం వాయిదా పద్ధతికే సై అంటూ హైఎండ్ ఫోన్లను ఎగరేసుకుపోతున్నారు. విశేషమేంటంటే ఇపుడీ ఆఫర్లు అందిస్తున్న వారి జాబితాలో యాపిల్, శామ్సంగ్ వంటి కంపెనీలతో పాటు గొలుసుకట్టు రిటైల్ దుకాణాలూ చేరుతున్నాయి. స్మార్ట్ ఫోన్ల వరకూ వస్తే క్రెడిట్ కార్డు వినియోగదారులకు వడ్డీ లేని వాయిదా పద్ధతిని మొదట మొదలుపెట్టింది యాపిల్ కంపెనీయే. తర్వాత శామ్సంగ్, బ్లాక్‌బెర్రీ, సోనీ, హెచ్‌టీసీ, ఎల్జీ కూడా ఈ దార్లో నడవటం ఆరంభించాయి. సంగీత, యూనివర్సెల్, టెక్నోవిజన్ వంటి ఔట్‌లెట్లతోపాటు ఎక్స్‌క్లూజివ్ స్టోర్ల ద్వారా కంపెనీలు ఈ సదుపాయం కల్పిస్తున్నాయి. బ్యాంకును బట్టి, ఔట్‌లెట్‌ను బట్టి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. అయితే లాట్, బిగ్ సి వంటి దుకాణాలు దాదాపు స్మార్ట్ ఫోన్లన్నిటిపైనా వడ్డీ లేని రుణ సదుపాయాన్ని అందిస్తున్నాయి. క్రెడిట్ కార్డు లేని వారికి కొన్ని షరతులకులోబడి బజాజ్ ఫైనాన్స్ వడ్డీ రహిత రుణమిస్తోంది. బజాజ్‌తో తాము ఒప్పందం చేసుకున్నామని లాట్, బిగ్ సి ప్రతినిధులు చెప్పారు. వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజులను తామే భరిస్తున్నామని వెల్లడించారు. చిన్న పట్టణాలకూ పాకిన ట్రెండ్.. నెలవారీ వాయిదాల్లో స్మార్ట్ఫోన్లను తీసుకుంటున్న వారిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వేతన జీవులే అధికం. అయితే ఇపుడీ ట్రెండ్ చిన్న పట్టణాలకూ పాకుతోంది. ఖరీదైన ఫోన్లు కావాలంటే చాలా మంది గతంలో డబ్బులు జమ చేసుకుని కొనేవారు. ఇప్పుడా పరిస్థితి లేదని, 10 నిముషాల్లో నచ్చిన మోడల్‌ను సొంతం చేసుకోవచ్చని బిగ్-సి సంస్థ సీఎండీ బాలు చౌదరి చెప్పారు. మారుమూలనున్న ఔట్‌లెట్లలోనూ ఈ సౌకర్యం కల్పించామన్నారు. స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో ఈఎంఐ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. తమ ఔట్లెట్లలో ఈఎంఐలపై కొంటున్నవారు 20 శాతం ఉంటున్నారని చెప్పారు. దూసుకెళ్తున్న అమ్మకాలు.. రూ.6వేలు ఆపై ధర ఉన్న స్మార్ట్ఫోన్లు దేశవ్యాప్తంగా జూలైలో దాదాపు 20 లక్షలు అమ్ముడయ్యాయి. రాష్ట్రంలో ఈ తరహా మొబైల్స్ నెలకు 1.65 లక్షల వరకూ ఉన్నాయి. రాష్ట్రం లో స్మార్ట్ ఫోన్ల అమ్మకాల విలువ జూలైలో రూ.100 కోట్లు, ఆగస్టులో రూ.120 కోట్లుగా నమోదైంది. 2012 ఆగస్టులో ఇది రూ.50 కోట్లేనని, ఇందులో ఈఎంఐల వాటా 5 శాతం అనేది మార్కెట్ వర్గాల సమాచారం. గత నెల అమ్మకాల్లో ఈఎంఐల వాటా 33%. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు కొనేవారు పెరిగారని, దీనికి ఈఎంఐ పథకాలు దోహదపడ్డాయని టెక్నో విజన్ ఎండీ సికందర్ చెప్పారు. ‘ఈఎంఐలపై వడ్డీ భారం గతంలో కస్టమర్‌కు పడేది. ఇపుడు దాన్ని నేరుగా కంపెనీలే బ్యాంకులకు చెల్లిస్తున్నాయి. మా ఔట్లెట్లలో క్రెడిట్ కార్డు ద్వారా కొనేవారు గతేడాది 25%ఉండగా ఇపుడా సంఖ్య రెట్టింపయింది’ అని తెలిపారు.